సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు కాస్త ఉపశమనం పొందుతారు. వ్యాపారస్తులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విశేష ఆదరణ. 1,2 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. ఒప్పందాలలో ఆటంకాలు. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. ఆత్మీయులతో సరదాగా గడుపుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు. వ్యాపారులకు లాభాలు సమకూరతాయి. ఉద్యోగులు సత్తా చాటుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు చిక్కులు తొలగే సమయం. 3,4 తేదీల్లో మానసిక ఆందోళన. శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

సమస్యలు కొన్ని తీరి ఉపశమనం పొందుతారు. ఆర్థికంగా కొంత బలపడతారు. ప్రముఖులు పరిచయమై సహకరిస్తారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. భూములు, వాహనాలు కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సహచరులతో సఖ్యత నెలకొంటుంది. విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. 5,6 తేదీల్లో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. అనారోగ్యం. దక్షిణావ•ర్తి స్తోత్రాలు పఠించండి

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

అనుకున్న కార్యక్రమాలలో మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సకాలంలో అంది ఊరట చెందుతారు. ఉద్యోగులకు కొత్త విధులు దక్కుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు కొంత అనుకూల పరిస్థితులు ఉండవచ్చు. 6,7 తేదీల్లో దూరప్రయాణాలు. ఆంజనేయ స్వామి దండకం పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

కొన్ని కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో  ఉత్సాహంగా గడుపుతారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. ఆదాయం, వ్యయాలు సమానంగా ఉంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. దూరపు బంధువుల నుంచి వచ్చిన క్షేమసమాచారాలు ఊరటనిస్తాయి. వాహనాలు, ఇళ్ల నిర్మాణయత్నాలు కొంత కలసివస్తాయి. కాంట్రాక్టులు  ఎట్టకేలకు సాధిస్తారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం రాగలదు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, కళాకారులకు  ప్రోత్సాహకరంగా ఉంటుంది. 2,3 తేదీల్లో మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. వినాయకుని పూజించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మంచీచెడ్డా విచారిస్తారు. రావలసిన డబ్బు సకాలంలో అందుకుంటారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. వ్యాపారులకు ఊహించిన లాభాలు తథ్యం. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు కొంత అనుకూల సమయం. 4,5 తేదీలలో వృథా ఖర్చులు. శారరక రుగ్మతలు. బంధువిరోధాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులు మీ అభిప్రాయాలను తప్పుపడతారు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు ఉండవచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటి నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారస్తులకు కొంతమేర లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిబాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు నిరుత్సాహపూరితంగా  ఉంటుంది. 3,4 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులు, స్నేహితులతో నెలకొన్న వివాదాలు సమసిపోతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం కుదుటపడి ఊపిరిపీల్చుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యాపారులు లాభాల వెంట నడుస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి.  రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు  సంతోషకర సమాచారం. 5,6 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది.  వ్యాపారులకు లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగులకు హోదాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. 4,5 తేదీలలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ఇంతకాలం పడిన సమస్యలు తీరతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.  ఆస్తుల వ్యవహారాలలో బంధువులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమై ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం గతం కంటే మెరుగై రుణబాధలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో ఆనందాన్ని పంచుకుంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఈతిబాధలు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు అనుకూల సమాచారం అందుతుంది. 6,7 తేదీల్లో దుబారా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఈశ్వరారాధన మంచిది.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి.  ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన ఉద్యోగయత్నాలు కొంత అనుకూలం. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది.  ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. 5,6  తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. రావలసిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. శుభకార్యాలపై కుటుంబంలో చర్చలు జరుపుతారు. కాంట్రాక్టులు కోసం చేసే యత్నాలు కొంత సఫలమవుతాయి. వ్యాపారులు మరింత ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులు విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమించి ముందడుగు వేస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు కాస్త ఊపిరిపీల్చుకునే సమయం. 2,3 తేదీల్లో బంధువిరోధాలు అనుకోని ఖర్చులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE