సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

నూతనోత్సాహంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. సహచర మిత్రులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. ఆదాయం మరింత సంతప్తికరంగా ఉంటుంది. ఊహించని రీతిలో కొంత ధనప్రాప్తి కలిగే అవకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు పట్టుదల పెరుగుతుంది. 25,26 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

 కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  బంధువులతో వివాదాలు తీరతాయి.  కాంట్రాక్టులు పొందుతారు.  అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తారు.  నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఇంతకాలం వేధించిన సమస్య నుంచి బయటపడతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.  వ్యతిరేక వర్గీయులు  అనుకూలంగా మారతారు.  వ్యాపారులకు  లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి.  పారిశ్రామిక, రాజకీయవేత్తలకు క్లిష్టమైన వివాదాలు తీరతాయి.   26,27  తేదీల్లో దూరప్రయాణాలు. అనారోగ్యం, ఔషధసేవనం. చోరభయం.  గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

అనూహ్యమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి చేస్తారు.ఆత్మీయులు అన్ని విధాల సహకరిస్తారు.  చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.  కాంట్రాక్టులు పొందుతారు.  జీవితాశం నెరవేరుతుంది.  ఇంటిలో వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు.  గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం.  రాబడి పెరుగుతుంది.  వ్యాపారులు కొన్ని ఆటుపోట్లు అధిగమిస్తారు. ఉద్యోగులకు విధులు ప్రశాంతంగా జరుగుతాయి. రాజకీయవేత్తలు, రచయితలకు శుభవార్తలు అందుతాయి. 28,29 తేదీలలో దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు.  అంగారక స్తోత్రం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

అనుకున్న కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.  ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించని పరిస్థితి.  ఆలోచనలు స్థిరంగా ఉండవు.  ఆస్తి వ్యవహారంలో చికాకులు తప్పవు.  ఒక సంఘటన కొంత కలవరపరుస్తుంది.  బంధువులతో తగాదాలు.   ఆరోగ్యపరంగా చికాకులు.  విలువైన వస్తుసామగ్రి జాగ్రత్తగా చూసుకోండి.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారులకు  లాభాలు కష్టంపై రావచ్చు. ఉద్యోగులకు మార్పులు తథ్యం.  పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నిరుత్సాహమే.  27,28 తేదీల్లో ఆకస్మిక ధనలాభం, ప్రముఖులతో పరిచయాలు.   ఆంజనేయునికి అర్చన చేయించుకుంటే మంచిది.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

కొత్త కార్యక్రమాలు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆలోచనలు మరింత కలసివస్తాయి. దేవాలయ దర్శనాలు చేస్తారు. సమాజంలో విశేషంగా గౌరవం పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటారు. మిత్రుల చే•••తతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. శత్రువులను కూడా ఆకట్టుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు సైతం తగినంతగా దక్కుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. 30,31 తేదీల్లో దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తారు. అదనపు రాబడితో ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల నుంచి అతిముఖ్య సమాచారం అందుతుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలోచనలు కొంత కలసివస్తాయి. ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారస్తులకు అదనపు లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగస్తులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మరిన్ని విజయాలు చేకూరతాయి. 29,30  తేదీల్లో లేనిపోని ఖర్చులు. ప్రయాణాలు. శివాలయంలో 11 ప్రదక్షణలు చేయండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

వారమంతా శుభదాయకమైన కాలమనే చెప్పాలి. ఆర్థికంగా క్రమేపీ బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. సోదరులతో వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వాముల నుంచి మరింత చేయూత అందుతుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు విశేష ఆదరణ. 30,31 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు.  శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

అంచనాలు నిజమవుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.   ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.  మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.  ఇంతకాలం చికాకు పర్చిన సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.  విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు.  చాకచక్యంగా ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు.  వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.  గత సంఘటనలు నెమరువేసుకుంటారు. కుటుంసభ్యులతో వివాదాలు పరిష్కారం. ఆరోగ్యపరంగా కొంత చికాకులు తప్పకపోవచ్చు.  వ్యాపారులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.  ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి.  పారిశ్రామికవేత్తలు, రచయితలకు యోగవంతమైన కాలమనే చెప్పాలి. 27,28తేదీల్లో మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు. ధననష్టం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలు  చకచకా పూర్తి చేస్తారు.  ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.  ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  బంధువుల నుంచి శుభవర్తమానాలు.  ఇంతకాలం వేధిస్తున్న సమస్యలు కొన్ని పరిష్కారం.  భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. మీ ఆశయాలు నెరవేరతాయి.  ఆహ్వానాలు, శుభాకాంక్షలు అందుకుంటారు.  వ్యాపారులు విస్తరణ యత్నాలలో అవరోధాలు అధిగమిస్తారు.  ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  పారిశ్రామికవేత్తలు, వైద్యులకు అనూహ్యమైన అవకాశాలు.  కళాకారులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందుతాయి. 25,26 తేదీల్లో దూరప్రయాణాలు. అనారోగ్యం. సోదరులతో వైరం.  ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

మీరు ఊహించని విధంగా కార్యక్రమాలు పూర్తి కాగల అవకాశం.  బంధువులు సైతం సమస్యల పరిష్కారంలో చేయూత నిస్తారు.  ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు.  ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త ఆశలు.  వాహనాలు, ఆభరణాలు కొంటారు.  అందరినీ ఆకర్షించే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో అపార్ధాలు తొలగుతాయి. వ్యాపారులకు  విశేషంగా లాభిస్తుంది. ఉద్యోగులకు నూతనోత్సాహం, విధుల్లో అనుకూల మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులకు మరిన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి.  27,28 తేదీలలో  చికాకులు. అనారోగ్యం. బంధువిరోధాలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

 శుభకార్యాలపై ఆలోచనలు సాగిస్తారు.  ఆత్మీయులు మరింతగా దగ్గరవుతారు.  సేవాభావం పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు సమసిపోతాయి.  ప్రయాణాలలో కొత్త పరిచయాలు.  సమాజంలో గౌరవానికి లోటు ఉండదు.  ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఎటువంట  కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు.  ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.  విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం.  వైద్యులు, రచయితలకు అరుదైన అవకాశాలు.వ్యవసాయదారులకు ఊహించని పెట్టుబడులు. 29,30 తేదీల్లో ధననష్టం. కుటుంబసమస్యలు. వివాదాలు. శివస్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

పరిస్థితులు అనుకూలించి నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీరతాయి. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో చర్చలు సాగిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు సంతప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు సమస్యల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు శుభవార్తలు 30,31 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

About Author

By editor