సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

దూరప్రయాణాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించని స్థితి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణయత్నాలు సాగిస్తారు. కుటుంబసభ్యులతో  కొన్ని వివాదాలు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారులకు కొంత అసంతృప్తి. ఉద్యోగులు ఆకస్మిక మార్పులు పొందుతారు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. 23,24 తేదీలలో శుభవార్తలు. వాహనయోగం. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. కొన్ని బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. కొన్ని వివాదాలు, సమస్యలు సర్దుబాటు కాగలవు.  వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు కొత్త అంచనాలు ఫలిస్తాయి. రచయితలు, క్రీడాకారులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు.. 20,21 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. .  కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారులు అనుకున్న విధంగా లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొద్దిపాటి ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు నిర్దేశించిన లక్ష్యాలు అందుకుంటారు. రచయితలు, క్రీడాకారులకు కొత్త  ఆహ్వానాలు రాగలవు.18,19 తేదీల్లో మానసిక అశాంతి. లేనిపోని వివాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి..

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న ఇబ్బందులు అధిగమిస్తారు. మీ మాటే చెల్లుబాటు కాగలదు. కొన్ని నిర్ణయాలలో మార్పులు చేస్తారు. వ్యాపారులకు మరింత ఉత్సాహవంతమైన సమయం. ఉద్యోగులు  సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవేత్తల ప్రయత్నాలలో విజయం. కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 23,24 తేదీలలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. కనకధారా స్తోత్రాలు పఠించండి..

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

సన్నిహితులతో కొన్ని వివాదాలు తీరతాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. కొత్త  కాంట్రాక్టులు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. కుటుంబంలో ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. గృహం, వాహనాలు కొనుగోలులో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు కొత్తపెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కళాకారులు, వైద్యుల సేవలకు విస్తృత గుర్తింపు లభిస్తుంది. 21,22తేదీలలో బంధువులతో విభేదాలు. అదనపు ఖర్చులు.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

సన్నిహితుల సాయం పొందుతారు. కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.  ఆలోచనలు మరింత కలసివస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి.. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు. దేవాలయాలు సందర్శిస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులు మరింతగా లాభాలు పొందుతారు.  కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయ,పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. కళాకారులు, రచయితల ఆశలు ఫలిస్తాయి. 19,20 తేదీల్లో వృధా ఖర్చులు. మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.  నిరుద్యోగుల యత్నాలు సఫలం. భూములు, వాహనాలు కొంటారు. రుణబాధల నుంచి విముక్తి. ఆకస్మిక ధనలబ్ధి. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. కొన్ని రుగ్మతల నుంచి విముక్తి. వ్యాపార విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు.  ఉద్యోగులకు కీలక సమాచారం.  పారిశ్రామిక, రాజకీయవర్గాలు అనుకున్నది సాధిస్తారు. రచయితలు, క్రీడాకారులకు కొంతలో కొంత నయంగా కనిపిస్తుంది. 20,21 తేదీలలో బ్యాధ్యతలు పెరుగుతాయి. అదనపు ఖర్చులు.. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

కొత్త విధానాలు, అంచనాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు సిద్ధపడతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలులో ఇబ్బందులు తొలగుతాయి. కొత్త ఆలోచనలు స్పురించి వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం  కుదుటపడుతుంది.  రావలసిన మొండిబాకీలు కూడా వసూలవుతాయి.  వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. కళాకారులు విజయాల బాటలో పయనిస్తారు. పరిశోధకులు, వైద్యులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. 21,22 తేదీలలో దూరప్రయాణాలు. బంధువిరోధాలు.. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో మరింత సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అంది ఆశ్చర్యపడతారు. కొన్ని అప్పులు తీరతాయి. కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు విధుల్లో మార్పులు చూస్తారు. రాజకీయవేత్తలకు విశేష గుర్తింపు లభిస్తుంది. రచయితల యత్నాలు సఫలమవుతాయి.22,23 తేదీల్లో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు.. విష్ణుధ్యానం చేయండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. స్నేహితులతో వివాదాల పరిష్కారం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన, భూయోగం. రావలసిన డబ్బు అందుకుంటారు. కొన్ని సమస్యలు యుక్తితో  పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వ్యాపారులకు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితిలోని వారి నుంచి ప్రోత్సాహం. కళాకారులు కాస్త ఊపిరిపీల్చుకుంటారు. వైద్యులు, క్రీడాకారులకు సంతోషకరమైన సమాచారం.19,20 తేదీల్లో అకారణ విరోధాలు. మానసిక అశాంతి. దేవీస్తుతి మంచిది.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఊహించని  కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వారు తోడ్పాటునందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయం కొంత పెరుగుతుంది. కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారుల అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహం.  పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శుభవార్తలు. రచయితలకు కొత్త అవకాశాలు లభించవచ్చు. 18,19 తేదీలలో దూరప్రయాణాలు. అనుకోని సమస్యలు. గణేశాష్టకం పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

కొన్ని క్లిష్టమైన కార్యక్రమాలు చాకచక్యంగా పూర్తి చేస్తారు. సమాజంలో విశేష ఆదరణ లభిస్తుంది. విలువైన సామగ్రి కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని ఒప్పందాలలో చర్చలు సఫలమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు.  ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన   వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులు పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగులు విధులలో మరింత నేర్పుతో వ్యవహరిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కీలక సందేశం అందుతుంది. పరిశోధకులు, వైద్యులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. 22,23 తేదీల్లో బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE