సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ద్వేషించిన వ్యక్తులే ఆదరిస్తారు. భూములు, ఇళ్లు కొంటారు. అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. అందరిలోనూ గౌరవమర్యాదలు లభిస్తాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆత్మీయులతో మనస్సులోని భావాలు పంచుకుంటారు. వ్యాపారస్తులకు నూతనోత్సాహం, లాభాలు దక్కుతాయి. ఉద్యోగుల దీర్ఘకాలిక శ్రమ ఫలిస్తుంది. రచయితలు, రాజకీయవేత్తలకు ప్రజాదరణ పెరుగుతుంది. 16,17 తేదీల్లో అనారోగ్యం. అనుకోని ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొత్త కార్యక్రమాలను సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి పిలుపు అందుతుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. రాబడి ఆశించినరీతిలో ఉంటుంది. కుటుంబసభ్యులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు మరింత రాగలవు. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి దక్కవచ్చు. వైద్యులు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలు సఫలం. 13.14 తేదీల్లో మానసిక అశాంతి. ఆస్తి వివాదాలు. బంధువులతో తగాదాలు. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త విషయాలు గ్రహిస్తారు. ఎటువంటి కార్యక్రమమైనా సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి విముక్తి. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాలపై సంప్రదిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది.. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. కళాకారులు కొత్త అవకాశాలు సాధిస్తారు. క్రీడాకారులు, పరిశోధకులకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది.12,13 తేదీల్లో అనారోగ్యం. దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. ఆంజనేయ దండకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ముఖ్యమైన•కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాల నుండి గట్టెక్కుతారు. అనుకున్న సమయానికి సొమ్ము అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. వ్యాపారులు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి రావచ్చు. రచయితలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వైద్యులు, సాంకేతిక నిపుణులకు సంతోషకరమైన సమాచారం. 11,12 తేదీల్లో దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొన్ని కార్యక్రమాలను ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. రాబడి మెరుగుపడి అవసరాలకు ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు విస్తరణ కార్యక్రమాలు కలసివస్తాయి. ఉద్యోగస్తులకు కీలక సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు తమ లక్ష్యాలను సాధిస్తారు. క్రీడాకారులు, కళాకారులకు శుభవార్తలు. 14,15 తేదీల్లో వృథా ఖర్చులు. ఆనారోగ్యం. మనశ్శాంతి లోపిస్తుంది. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. ఆప్తుల సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు.. వ్యాపారస్తులకు లాభాలు ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త విధులు లభిస్తాయి. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరమైన సమయం. 15,16 తేదీలలో అగ్రిమెంట్లు వాయిదా. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబంలో వివాదాలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి ఇబ్బందులు తీరతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వేడుకల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు అనుకున్న లాభాలను పొందుతారు. ఉద్యోగులకు విధులు తేలికపడతాయి. రాజకీయవేత్తలకు అంచనాలు ఫలిస్తాయి. క్రీడాకారులు, రచయితలకు నూతనోత్సాహం. 13,14 తేదీల్లో అనుకోని ఖర్చులు. స్నేహితుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీలక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
పట్టుదలతో కార్యక్రమాలు కొన్ని పూర్తి చేస్తారు. . ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల ఆదరణ చూరగొంటారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి మాటసాయం అందిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు శుభదాయకంగా ఉంటుంది. రాబడి గతంకంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పడిన శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వ్యాపారులు క్రమేపీ లాభాలు గడిస్తారు. ఉద్యోగులు విధుల్లో సత్తా చాటుకుంటారు. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురించవచ్చు. క్రీడాకారులు, కళాకారుల యత్నాలు ఫలిస్తాయి. 12,13 తేదీల్లో అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కొత్త కార్యక్రమాలను మరింత వేగంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్నేహితులతో విభేదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కించుకుంటారు. ఆదాయం పెరిగి ముఖ్య అవసరాలు తీరతాయి. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరట కలిగిస్తుంది. వ్యాపారులు భాగస్వాములతో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. వైద్యులు, రచయితలకు అన్ని విధాలా కలసివస్తుంది.14,15 తేదీల్లో స్వల్ప రుగ్మతలు. ఆప్తులతో విభేదాలు. దూరప్రయాణాలు. కాలభైరవాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వాహనాల కొనుగోలు యత్నాలు ఫలించవు. శారీరక రుగ్మతలు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. దైవకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందక నిరాశ చెందుతారు. స్నేహితులతో అకారణంగా వివాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు స్వల్పంగా దక్కుతాయి.. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. రచయితలు, రాజకీయవేత్తల అంచనాలలో పొరపాట్లు. 14,15 తేదీలలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కొత్త కార్యక్రమాలు చేపడతారు.కీర్తిప్రతిష్ఠలకు లోటు ఉండదు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూవివాదాలపై చర్చలు కొలిక్కి వస్తాయి. బంధువుల నుంచి పిలుపు రావచ్చు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. రాబడి కొంత ఊరటనిస్తుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరతాయి. వైద్యులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. 16,17 తేదీలలో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. విష్ణుధ్యానం చేయండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆర్థికంగా మరింత అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఇంటాబయటా సానుకూల ప్రభావం కనిపిస్తుంది. వివాదాలు ఎంతటి వైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తా శ్రవణం. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారు మీకు చేదోడుగా నిలుస్తారు. వ్యాపారస్తులు పోటీదారులను అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, వైద్యులు, రచయితలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. 12,13 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ముఖ్యులతో కొన్ని వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.