సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. కార్యక్రమాలలో విజయం చేకూరుతుంది. విద్యార్థుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. అప్పులు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి. కుటుంబంలో చికాకులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. శారీరక రుగ్మతలు చాలావరకూ తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. భాగస్వాములతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగులు బాధ్యతలు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. కళాకారులకు నూతన అవకాశాలు. రచయితలు, పరిశోధకులు అనుకున్న విజయాల సాధిస్తారు. 4,5 తేదీలలో ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థుల ఆశలు ఫలించే సమయం. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రుణబాధల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. రావలసిన సొమ్ము సైతం అందుతుంది. కుటుంబంలో మీ అభిప్రాయాలను అంతా గౌరవిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలకు విశేష ప్రజాదరణ లభిస్తుంది. రచయితలు, సాంకేతిక నిపుణులకు మరింత అనుకూలం. 6,7తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. హనుమాన్ చాలీసా పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగ, విద్యావకాశాలు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు.అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. సోదరులు, సోదరీలతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆరోగ్యపరంగా ఇంతకాలం పడిన చికాకులు తొలగుతాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు విశేష గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. కళాకారులు, రచయితలు మంచి గుర్తింపు పొందుతారు. 9,10తేదీల్లో స్నేహితులతో వివాదాలు. శ్రమాధిక్యం. గణపతిని పూజించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యలు తీరతాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారం. కాంట్రాక్టర్లు అనుకోని విధంగా దక్కుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. రుణబాధలు చాలావరకూ తొలగుతాయి. కుటుంబసభ్యుల ప్రేమ అధికమవుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. కొద్దిపాటి రుగ్మతలు బాధించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారులు ఉత్సాహంగా సాగుతాయి. భాగస్వాముల నుంచి పెట్టుబడులు అందుతాయి. సహోద్యోగులతో ఆనందంగా గడుపుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. కళాకారులకు సన్మానయోగం. 7,8 తేదీల్లో బంధువిరోధాలు. దూరప్రయాణాలు. శివాష్టకం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రముఖులతో పరిచయాలు. దేవాలయాలు సందర్శిస్తారు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తులపై కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. రావలసిన డబ్బు అందుతుంది. అప్పులు తీరతాయి. మీ కృషికి కుటుంబసభ్యులు సహకరిస్తారు.సోదరులు, సోదరీలతో సఖ్యత. స్వల అనారోగ్యం, ఔషధసేవనం. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. కొత్త భాగస్వాములను కలుపుకుంటారు. ఉద్యోగులు అదనపు విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులు, రాజకీయవేత్తలకు మంచి గుర్తింపు రాగలదు. రచయితలు, క్రీడాకారులకు పురస్కారాలు. 6,7 తేదీల్లో బంధువిరోధాలు. అనారోగ్యం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. కార్యజయం. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు మరింత కలసివస్తాయి. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. బంధువుల నుంచి కీలక సమాచారం రాగలదు. కొన్ని రుగ్మతలు తీరతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులు, పరిశోధకులు అనుకున్నది సాధిస్తారు. 7,8 తేదీల్లో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ముఖ్య కార్యక్రమాలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. కాంట్రాక్టర్లు అవకాశాలు చేజార్చుకుంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బందిపడతారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారాలు ఆశించిన లాభాలు కష్టమే. పెట్టుబడులకు అన్వేషిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు నిరాశ పరుస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు, రచయితలు కొంత నిరాశ చెందుతారు. 6,7 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు లభిస్తాయి.. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. కళాకారులు, రచయితలకు అవార్డులు. 7,8 తేదీలలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. శివపంచాక్షరి పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అదనపు ఆదాయంతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కొన్ని వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారులు మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 4,5 తేదీలలో బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. దేవీస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు అధికమొత్తంలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు నూతనోత్సాహం. 9,10తేదీలలో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. మీమాటకు ఎదురుండదు. బంధువర్గంతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూ, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చే•••తనందిస్తారు. వ్యాపారస్తులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు, క్రీడాకారులకు మరింత అనుకూల సమయం. 8,9 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం మరింత పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలు విస్తృతమవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు అందుతాయి. 8,9 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.