సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలో చనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విశేషంగా కలసివస్తుంది. 6,7 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. వాహ నాలు, భూములు కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకువస్తాయి. వ్యాపారులు లక్ష్యాల మేరకు లాభాలు అందుకుంటారు. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందు తాయి. కళాకారులు, పరిశోధకులు పట్టింది బంగారమే. 8,9 తేదీలలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

మీ ప్రతిపాదనలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. కొన్ని సమస్యలు సహనాన్ని పరీక్షిస్తాయి. ఆరోగ్యంపై దృష్టి సారించండి. విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. వ్యాపారులకు కొంత గందర గోళంగా ఉంటుంది. ఉద్యోగులకు మరింత పనిభారం తప్పదు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. పరిశోధకులు, రచయితలకు విదేశీ పర్యటనలు వాయిదా. 7,8 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

పరిచయాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వాహనసౌఖ్యం. మీ నిర్ణయాలపై కుటుంబంలో ఆమోదం లభిస్తుంది. వ్యాపారస్తులు గతం కంటే మరింత పుంజుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. 10,11 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితు లతో తగాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలు, కళా కారులు, రచయితలకు మరింత ఉత్సాహ వంతంగా ఉంటుంది. 6,7 తేదీల్లో దూర ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం. వ్యాపారస్తులు పెట్టుబడులు సమకూరి ఊరట చెందుతారు. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగి ముందుకు సాగుతారు. కళాకారులు, రచయితలకు శుభవార్తలు అందుతాయి. 9,10 తేదీల్లో సోదరులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. శివాష్టకం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 9,10 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

వాహనాలు కొనుగోలు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చు కుంటారు. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత ఉపశమనం. పారిశ్రామిక వర్గాలకు మరింత సానుకూలత. పరిశోధకులు, కళాకారుల ఆశలు ఫలిస్తాయి. 5,6 తేదీలలో అనారోగ్యం. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఆత్మీయుల ఆదరణ పొందుతారు. నిరుద్యోగులలో అనుకున్న లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. వ్యాపారులు తగినంత లాభాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ యానం. రచయితలు, వైద్యుల కృషి ఫలిస్తుంది. 7,8 తేదీల్లో కుటుంబంలో చికాకులు. దూర ప్రయాణాలు. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆలోచనలు వెంటనే కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. దైవకార్యాలు నిర్వహిస్తారు. గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. రాజకీయ వేత్తలకు కొద్దిపాటి పదవులు లభిస్తాయి. కళాకారులు, క్రీడాకారులకు ఆహ్వానాలు రాగలవు. 9,10 తేదీల్లో వ్యయప్రయాసలు. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు అనుకూల స్థితి. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. కళాకారులు, వైద్యులకు ఒత్తిడులు తొలగుతాయి. 10,11 తేదీల్లో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహా న్నిస్తుంది. వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగులకు విధుల్లో మరింత సానుకూలత. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శుభవార్తలు. రచయితలు, క్రీడాకారులకు విశేష ఆదరణ. 5,6 తేదీల్లో వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE