సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తుల వివాదాల నుంచి కాస్త గట్టెక్కుతారు. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు సానుకూలం. ఉద్యోగులకు ముఖ్య సమా చారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కళాకారులు, పరిశోధకులకు యత్నాలు 29,30 తేదీల్లో బంధు విరోధాలు. శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. నూతన ఉద్యోగయోగం. బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులకు క్రమేపీ లాభాలు. ఉద్యోగులకు మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. కళాకారులకు కాస్త అనుకూల సమయం. రచ యితలు, పరిశోధకులకు ఆహ్వానాలు అందుతాయి. 31,జనవరి 1 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.్య ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో సమకూర తాయి. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు దక్క వచ్చు. రాజకీయవర్గాలకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. క్రీడాకారులు, కళాకారులకు విశేషంగా కలసి వస్తుంది. జనవరి 3,4 తేదీల్లో సోదరులతో వివాదాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు ఫలితాలు కొంత ఊరట. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వ్యాపారు లకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వా నాలు. క్రీడాకారులు, పరిశోధకులు కొత్త ఆశలతో ముందడుగు. జనవరి 2,3 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో భాగస్వాము లవుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందు కుంటారు, లాభాలు అందుతాయి. రాజకీయ వేత్తలకు ఊహించని అవకాశాలు. రచయితలు, క్రీడా కారుల అంచనాలు కొంత ఫలిస్తాయి. 30,31 తేదీల్లో ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. స్నేహితులతో తగాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆలో చనలు కార్యరూపం. పరిచయాలు విస్తృత మవు తాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగు లకు సమస్యలు తీరతాయి. కళాకారులు, పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రగతి. సాంకేతిక వర్గాల వారికి నూతనోత్సాహం. 31, జనవరి 1 తేదీల్లో సోదరులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. కాలభైరవాష్టకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఇంటిలో సంతోషకరంగా గడుపుతారు. శత్రు వులు సైతం స్నేహితులుగా మారతారు. భూములు, భవనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. పరిస్థితులు అనుకూ లిస్తాయి. ఉద్యోగులకు ఒడిదుడుకుల నుంచి విముక్తి. రాజకీయ వేత్తలు, కళాకారులు, రచయితలకు విశేష ఆదరణ. జనవరి 2,3 తేదీల్లో అనారోగ్యం. స్నేహితు లతో వివాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. విద్యా ర్థులకు ఆశ్చర్యకర ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపా రులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులకు శ్రమ పడ్డా ఫలితం ఉంటుంది. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రచయితలు, క్రీడా కారులకు ఊహించని ప్రగతి కనిపిస్తుంది. 29,30 తేదీల్లో ఆరోగ్యసమస్యలు. బంధువులతో వివాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
రాబడి మరింత పెరిగి ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ సమస్యలు తీరతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు. నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగులకు క్లిష్ట పరిస్థితుల నుంచి ఉపశమనం. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని ప్రగతి. రచయితలు, క్రీడాకారులకు అంచనాలు నిజమవుతాయి. 30,31 తేదీల్లో అనా రోగ్యం. శివాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిగ్ధీ యమై సహక రిస్తారు. వ్యాపారులకు మరింత ఉత్సాహంతో సాగు తారు. పెట్టుబడులకు ఢోకా ఉండదు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలత ఉంటుంది. పరిశోధకులు, క్రీడాకారులకు ఆశాజనకమైన కాలం. జనవరి 1,2 తేదీల్లో వృథాఖర్చులు. ఆరోగ్యభంగం. విష్ణుసహస్ర నామ పారాయణ చేయండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలలో ప్రతి ష్ఠంభన. ఆధ్యాత్మిక కార్యక్రమా లలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహి తులను కలుసు కుంటారు. వ్యాపారులకు కొంత సామాన్యంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొద్దిపాటి చికాకులు. రచయితలు, క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది. 31, జనవరి 1 తేదీల్లో శుభవార్తలు. వాహన యోగం. గణేశాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీర తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల యత్నాలలో కొంత పురోగతి కని పిస్తుంది. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. రచయితలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. జనవరి 3,4 తేదీలో ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.