సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విశేషంగా కలసివస్తుంది. 14,15 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
పరిచయాలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వాహనసౌఖ్యం. వి• నిర్ణయాలపై కుటుంబంలో ఆమోదం లభిస్తుంది. వ్యాపారస్తులు గతం కంటే మరింత పుంజుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. 17,18 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితులతో తగాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్న విధంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు లేదా ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 16,17 తేదీల్లో దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం సంతృప్తినిస్తుంది. ఖర్చులు తగ్గిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటర్వ్యూలు ఆందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 12,13 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్ధిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారులు సంస్థలను విస్తరిస్తారు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, రచయితలకు అవార్డులు. 15,16 తేదీల్లో దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. ఆంజనేయ దండకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. భూములు, వాహనాల కొనుగోలుయత్నాలు వాయిదా. బంధువులతో అకారణంగా విభేదాలు. వి• ప్రతిపాదనలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. కొన్ని సమస్యలు సహనాన్ని పరీక్షిస్తాయి. ఆరోగ్యంపై దృష్టి సారించండి. విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. వ్యాపారులకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు మరింత పనిభారం తప్పదు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. పరిశోధకులు, రచయితలకు విదేశీ పర్యటనలు వాయిదా. 14,15 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. విష్ణుధ్యానం చేయండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 9,10 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి తరఫున ఆస్తిలాభం ఉంటుంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కలసివచ్చే కాలం. వ్యాపారులు తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతస్థితితో పాటు, మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 17,18తేదీల్లో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కాలభైరావష్టకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. స్నేహితులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు. దూరమైన ఆప్తులు దగ్గరకు చేరుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. బ్యధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారులు ఆశించినంతగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. రచయితలు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత అనుకూలత ఉంటుంది. 16,17తేదీల్లో భూవివాదాలు. ఖర్చులు అధికం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
అనుకున్న కార్యక్రమాలు కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కొంతమేరకు కలసివస్తాయి. వేడుకలలో పాల్గొంటారు. ఒక కీలక సమాచారం ఆకట్టుకుంటుంది. స్నేహితులు మరింత సహకరిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. అనుకున్న విధంగా ధనలాభాలు కలుగుతాయి. అందరితోనూ సంతోషంగా గడుపుతారు. విమర్శల నుంచి బయటపడతారు. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అంది ఊరట చెందుతారు. ఉద్యోగులకు విధి నిర్వహణ సాఫీగా సాగుతుంది. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు మరింత అనుకూలత. రచయితలకు అనుకూలత. 13,14 తేదీలలో విచిత్ర సంఘటనలు. అనారోగ్య సూచనలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
శ్రమను భరించి ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. అవసరాలకు డబ్బు అందుతుంది. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. గతం కంటే ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు విధుల్లో మరింత ప్రోత్సాహం. రాజకీయవేత్తలు, పరిశోధకులకు మరింత సానుకూల సమయం. కళాకారులకు నూతన అవకాశాలు. 16,17 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. విష్ణుధ్యానం చేయండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
నూతనంగా పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వి• మనోగతాన్ని అందరితోనూ పంచుకుంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. శుభకార్యాలపై చర్చలు సఫలం. అనూహ్యంగా కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే సూచనలు. పారిశ్రామికవేత్తలు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 12,13తేదీలలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.