సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కొత్త కాంట్రాక్టులు దక్కించు కుంటారు. ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి కొను గోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు సంభవం. రాజకీయ వేత్తలకు ఆహ్వానాలు. కళాకారులు, రచయితలకు అనుకూలత. 13,14 తేదీల్లో వృథా ఖర్చులు. లేనిపోని వివాదాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
వాహనాలు, ఆరోగ్యవిషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొం టారు. రావలసిన సొమ్ము సకాలంలో అందక నిరాశ చెందుతారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు కష్టమే. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలు, కళా కారులకు అవకాశాలు. క్రీడాకారులు, పరిశోధకులకు ఒత్తిడులు. 12,13 తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. అవసరాలకు సొమ్ము అందుకుంటారు. కుటుంబంలో మీ మాటే పైచేయిగా ఉంటుంది. కొద్దిపాటి శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపారులు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులకు విధి నిర్వహణ ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయ వేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతం. క్రీడాకారులు, పరిశోధకులకు కార్యసిద్ధి. 15,16 తేదీల్లో వ్యయ ప్రయాసలు. శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు చేజారిన అవకాశాలు తిరిగి దక్కుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. శారీరక రుగ్మతలు బాధించినా కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపా రులకు కొత్త ఆశలు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహిస్తారు. సాంకేతిక, పారిశ్రామిక వర్గాలవారి యత్నాలు ఫలిస్తాయి. రచయితలు, క్రీడా కారులకు ఉత్సాహం. 10,11 తేదీల్లో బంధువులతో విరోధాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణబాధలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారులు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు. రచయితలు, కళాకారులకు కొత్త ఆశలు. 13,14 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కాంట్రాక్టర్లకు అప్రయత్నంగా అవకాశాలు. భూములు, వాహనాలు కొనుగోలు. ఆదాయానికి ఇబ్బందిలేకుండా గడిచిపోతుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. రాజకీయవర్గాల శ్రమ ఫలిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు అనుకున్న కార్యాలు నెరవేరతాయి. 14,15 తేదీల్లో అనుకోని ఖర్చులు. ఆంజనేయ దండకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అందరిలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కొంత అనారోగ్య సూచనలు. వ్యాపారస్తులకు నూత నోత్సాహం. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. రాజకీయ వర్గాలకు కొత్తగా పదవులు లభించే సూచనలు. రచయితలు, క్రీడాకారులకు అంచనాలు నిజం కాగలవు. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
రుణబాధలు తొలగుతాయి. వాహనసౌఖ్యం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. సోదరులతో మరింత సఖ్యత. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంత ఊరట లభిస్తుంది. కళాకారులకు ఊహించని అవకాశాలు. పరిశోధకులు, రచయిత లకు కొత్త ఆశలు. 12,13 తేదీల్లో కుటుంబంలో చికాకులు. వినాయకుని స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం. క్రీడాకారులు, రచయితల యత్నాలు సఫలం. 13,14 తేదీల్లో వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆకస్మిక ధనలాభాలు. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కి ఊరట చెందుతారు. వ్యాపారస్తులకు లాభాలు తథ్యం. ఉద్యోగస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు, పరిశోధకులకు మంచి గుర్తింపు. 15,16 తేదీల్లో దుబారా ఖర్చులు. బంధువిరోధాలు. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొద్దిపాటి అనారోగ్యం. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అనుకోని అభివృద్ధి కని పిస్తుంది. రాజకీయవర్గాలకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రచయితలు, కళాకారులకు శుభవార్తలు. 15,16 తేదీల్లో ధనవ్యయం. దూరప్రయాణాలు. శివస్తుతి మంచిది.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
శుభకార్యాల నిర్వహణపై చర్చలు జరుపుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ప్రముఖు లతో పరిచయాలు. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. కళాకారులకు శ్రమానంతరం అవకాశాలు.పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు. 11,12 తేదీల్లో విచిత్రమైన సంఘటనలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.