సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగు తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మనస్సులోని భావాలను వెల్లడిస్తారు. వ్యాపారులకు నూతన పెట్టు బడులు అందుతాయి. ఉద్యోగులకు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయ వేత్తలు, సాంకేతికవర్గాలకు సమస్యలు తీరతాయి. పరిశోధకులు లక్ష్యాలు సాధిస్తారు 27,28 తేదీల్లో మానసిక అశాంతి. ప్రయాణాలలో మార్పులు. శారీరక రుగ్మతలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆస్తుల వ్యవహారాలలో మధ్య వర్తిత్వం వహిస్తారు. వ్యాపా రులకు పెట్టుబడులతో పాటు లాభాలు అందుతాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు అరుదైన అవకాశాలు. క్రీడాకారులు, రచయితలు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. 22,23 తేదీల్లో కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. భూములు, వాహనాలు సమకూరతాయి. వివాహ యత్నాలు అనుకూలం. ప్రముఖుల నుంచి సమాచారం కొంత ఊరటనిస్తుంది. వ్యాపారులు లాభాల దిశగా కొనసాగుతారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు దక్కవచ్చు. 24,25 తేదీల్లో వృథా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. హనుమాన్ ఛాలీసా పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. విలువైన వస్తువులు కొంత జాగ్రత్తపర్చుకోండి. దైవకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారులకు కొంత నిరుత్సాహం. ఉద్యోగస్తులకు పనిభారం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పారిశ్రామిక వర్గా లకు గందరగోళంగా ఉంటుంది. రచయితలు, కళా కారులకు సమస్యలు పెరుగుతాయి. 25,26 తేదీల్లో శుభవర్తమానాలు. వాహనసౌఖ్యం.ముఖ్య నిర్ణయాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చిరకాల స్వప్నం నెరవేరే సూచనలు. వ్యతిరేకులు సైతం స్నేహితులుగా మారవచ్చు. వ్యాపారులు అధికంగా లాభపడతారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళా కారులకు విశేష గౌరవం దక్కుతుంది. క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. 26,27 తేదీల్లో కాంట్రాక్టులు అనుకూలించవు. విలువైన వస్తువులు కొంత జాగ్రత్తపర్చుకోండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. వ్యాపారులు లాభాలబాటలో పయనిస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఊహించని అవ కాశాలు. పరిశోధకులు, సాంకేతికనిపుణులు అంచనాలు నిజం చేసుకుంటారు. 23,24 తేదీల్లో ప్రయాణాలలో మార్పులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారులు ముందుకు సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు రాగలవు. కళాకారులకు అవకాశాలు మరింత పెరుగుతాయి. రచయితలు, క్రీడాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 25,26 తేదీల్లో ఆరోగ్యసమస్యలు. బంధువులతో విరోధాలు. గణేశ్‌ను పూజించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు. పరిశోధకులకు నూతనోత్సాహం. 25,26 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
దీర్ఘకాలిక రుణాలు తీరి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు దక్కే అవ కాశం. కోర్టు వ్యవహారాలలో కొంత ప్రగతి. వ్యాపా రులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామిక వేత్తల యత్నాలు సఫలమవుతాయి. క్రీడాకారులు, రచయితలకు అన్ని విధాలా అనుకూల సమయం. 27,28 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శివస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. కుటుంబంలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణపై శ్రద్ధ. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 23,24 తేదీల్లో వ్యయప్రయాసలు. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
భూవివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు కార్యసిద్ధి. వ్యాపారులకు భాగస్వాముల నుంచి ప్రోత్సాహం. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు. పరిశోధకులు, సాంకేతిక రంగాల వారికి కొత్త ఆశలు. 25,26 తేదీల్లో దేవాలయ దర్శనాలు.ఆంజనేయ దండకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మీ ఊహలు కొన్ని నిజమవుతాయి. కొంత కాలంగా ఎదుర్కొంటున్న సమస్య ఒకటి పరిష్కార మవుతుంది. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారులు భాగస్వాముల నుంచి మరిన్ని పెట్టు బడులు సమకూర్చుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు లక్ష్యాలు సాధిస్తారు. రచయితలు, క్రీడాకారులు ఊహించని అవకాశాలు పొందుతారు. 24,25 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.