సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలు సమయానికి పూర్తి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవు తారు. బంధువులు, శ్రేయోభిలాషులతో ఆనందంగా గడుపు తారు. ఉద్యోగార్ధుల యత్నాలు సఫలం. బంధువుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వేత్తల కృషి ఫలిస్తుంది. 20,21 శారీరక రుగ్మతలు. మానసిక అశాంతి. గణేశాష్టకం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ఆస్తుల విషయంలో వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. కాంట్రాక్టులు కొన్ని చేజారవచ్చు. వ్యాపా రులకు పెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు ఒడి దుడుకులు. రచయితలు, వైద్యుల సేవలకు గుర్తింపు కష్టమే. 18,19 తేదీల్లో శుభవార్తలు, ధనలాభం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

శారీరక రుగ్మతలు తీరి ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. పలుకు బడి పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కళాకారులకు నూతన అవకాశాలు. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 17,18 తేదీల్లో చిత్రమైన సంఘటనలు. కుటుంబంలో చికాకులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సాయం అందిస్తారు. రాబడి మరింత పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. భాగస్వాములతో విభేదాలు పరిష్కారం. ఉద్యోగులకు విధినిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. క్రీడాకారులు, పరిశోధకులకు నూతనోత్సాహం. 15,16 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

రాబడి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది.  పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. రాజకీయవేత్తలకు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. కళాకారులు, రచయితలకు మరింత గుర్తింపు లభిస్తుంది. 20,21 తేదీల్లో శారీరక రుగ్మతలు. ఖర్చులు పెరుగుతాయి. శివాష్టకం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కారవుతాయి. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులు బాధ్యతలను సమర్థనీయంగా పూర్తిచేస్తారు.  రచ యితలు, క్రీడాకారులకు శుభవార్తలు. 17,18 తేదీల్లో వృథాఖర్చులు. ఆరోగ్య సమస్యలు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

ఇంటి నిర్మాణయత్నాలు తిరిగి ప్రారంభిస్తారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. అందర్నీ మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు వ్యిధుల్లో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు నూతన పదవులు. క్రీడాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు. 15,16 తేదీల్లో స్వల్ప రుగ్మతలు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలు, క్రీడా కారులకు పురోగతి. శాస్త్రవేత్తలకు విశేష గుర్తింపు లభిస్తుంది. 17,18 తేదీల్లో శారీరక రుగ్మతలు. ఇంట్లో ఒత్తి డులు. ఆకస్మిక ప్రయాణాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కళా కారులకు అవకాశాలు మరిన్ని దక్కుతాయి. రాజకీయ వేత్తలు, క్రీడాకారులకు అంచనాలు నిజం కాగలవు. 19,20 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబ సభ్యులతో తగాదాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

భూవివాదాల పరిష్కారం. ఊహించని ఆహ్వా నాలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు ఆప్తులు మరింత దగ్గ రవుతారు. వ్యాపారులకు లాభాలు మరింతగా ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమా చారం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వైద్యులు, రచయితలకు శుభవార్తలు. 20,21 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల నుంచి విమర్శలు. సూర్యారాధన చేయండి..

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అందరిలోనూ సత్తా చాటుకుంటారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సమాజ సేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. రాజకీయవేత్తలకు అన్ని విధాలా అనుకూల సమయం. క్రీడాకారులు, పరిశోధకులకు మరింత ప్రగతి కనిపిస్తుంది. 16,17 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

దేవాలయాలు సందర్శిస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపా రులకు అవాంతరాలు తొలగి విస్తరణ కార్యక్రమాలు ఫలప్రదమవుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి.పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందు తాయి. రచయితలు, వైద్యుల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. 17,18 తేదీల్లో మనశ్శాంతి లోపిస్తుంది. శారీరక రుగ్మతలు. హనుమాన్‌ ‌చాలీసా పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE