సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

దేవాలయాలు సందర్శిస్తారు. రాబడి అనూహ్యంగా పెరిగి అవసరాలు తీరతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులకు విశేష ఆదరణ లభిస్తుంది. పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. రచయితలు, క్రీడాకారుల అంచనాలు ఫలిస్తాయి. 13,14 తేదీల్లో శారీరక రుగ్మతలు.  శ్రీరామరక్షా స్తోత్రాలు పఠిం చండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావన ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు మరింత లాభపడతారు. భాగస్వాము లతో సఖ్యత. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు చేపడ తారు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. పరి శోధకులు, కళాకారులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. 11,12 తేదీలలో కష్టానికి ఫలితం కని పించదు. సోదరులతో విభేదాలు. ఖర్చులు. అన్న పూర్ణాష్టకం పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఇళ్లు, వాహనాలు కొంటారు. స్నేహితులు, బంధు వులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పనిభారం  తగ్గవచ్చు. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు. క్రీడా కారులు, పరిశోధకులకు అనుకోని ఆహ్వానాలు రాగ లవు. 8,9 తేదీల్లో కుటుంబంలో తగాదాలు.  ఖర్చులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

గృహనిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. దేవాలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. విద్యా ర్థులకు అనుకున్న అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు గందరగోళం తొలగి లాభాలు దక్కు తాయి. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారులకు శుభవార్తలు. 10,11 తేదీల్లో కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలో చనలు స్థిరంగా ఉండవు. విష్ణుధ్యానం చేయండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

చిన్ననాటి స్నేహితుల నుంచి కొంత సహాయం అందే అవకాశం. కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి. రాజకీయవేత్తలకు నూత నోత్సాహం. 12,13 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. స్నేహితులతో వివాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

సన్నిహితులు, సోదరుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరు కుంటాయి. వ్యాపారులకు మరింతగా లాభాలు దక్క వచ్చు. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగ మిస్తారు. రాజకీయ వేత్తలకు శ్రమ ఫలిస్తుంది. రచయితలు, క్రీడా కారులకు నూతనోత్సాహం. 13,14 తేదీల్లో బంధు విరోధాలు. అనుకోని ఖర్చులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. విద్యార్థుల యత్నాలలో అనుకూలత. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింత లాభిస్తుంది. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవేత్తలు అనుకున్నది సాధిస్తారు. కళాకారులు, పరిశోధకుల కృషి కొంత ఫలిస్తుంది. 8,9 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

భూవివాదాలు కొల్కిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుం టారు. గృహనిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధి స్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సమాజంలో గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతుంది. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. రచయితలు, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. 9,10 తేదీల్లో స్నేహితుల నుంచి ఒత్తిడులు. ఖర్చులు అధికంగా ఉంటాయి. దుర్గా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. కళాకారులు, క్రీడాకారులకు విజయాలు 10,11 తేదీల్లో కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

కుటుంబంలో ఒత్తిడులతో సతమతమవుతారు. వ్యాపారులు లాభనష్టాలు సమానంగా భరించాల్సిన సమయం. ఉద్యోగులు మరిన్ని బాధ్యతల ఉక్కిరిబిక్కిరి కాగలరు. రాజకీయవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారుల కృషి ఫలించదు. 12,13 తేదీలలో శుభవర్తమానాలు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వాహనాలు, ఆభరణాలు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు క్రమేపీ లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించి దూసుకువెళతారు. కళాకారులు, రచయితలు అనుకున్నది సాధిస్తారు. 13,14 తేదీలలో బంధువర్గంతో తగాదాలు. మానసిక అశాంతి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించు కుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు పెట్టుబడుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు. రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహ వంతంగా ఉంటుంది. కళాకారులు, రచయితలు విజయాలు సాధిస్తారు. 8,9 తేదీల్లో స్నేహితుల నుంచి ఒత్తిడులు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఆదిత్య హృదయం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE