సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. అందరిలోనూ పేరుప్రతిష్టలు పొందుతారు. మీ ఆశ యాలు నెరవేరే సమయం. నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారులు సమస్యల నుండి గట్టెక్కుతారు. ఉద్యోగులకు పైస్థాయివారి సహాయం. కళాకారులు, శాస్త్రవేత్తల కృషిఫలించి కొన్ని అవకాశాలు దక్కించు కుంటారు. 2,3 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

సమాజసేవలో మీ పాత్ర పోషిస్తారు.  పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు సమ కూరతాయి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. అందరిలోనూ మీ అనుభవాన్ని చాటు కుంటారు. వ్యాపారులు మరింత విస్తృతికి చేసే యత్నాలు. ఉద్యోగులకు హోదాలు. రచయితలు, వ్యవసాయదారులకు సంతోషదాయకంగా గడుస్తుంది. 4,5 తేదీల్లో దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. శివస్తుతి మంచిది.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

ఆప్తులు మీకు చేదోడుగా నిలుస్తారు. నిరుద్యోగుల యత్నాలలో మరింత పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వాహ నాలు, ఆభరణాలు కొనుగోలు. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఉద్యోగులకు ఒక సమాచారం వరంగామారనుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీపర్యటనలు. 6,7 తేదీల్లో వృథాఖర్చులు. మానసిక అశాంతి. కాలభైరవాష్టకం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

కొన్ని అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల చిరకాల స్వప్నం నెరవేరతుంది. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. సొంత ఆలోచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు దక్క వచ్చు. ఉద్యోగుల విధుల్లో చిక్కులు. ఆధ్యాత్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. రచయితలు, క్రీడా కారులకు కీర్తి పెరుగుతుంది. 1,2 తేదీల్లో బంధు విరోధాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

బంధువులనుంచి ధనలాభం. వాహనాలు కొను గోలు చేస్తారు. ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా ఉప శమనం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారస్తులు లావాదేవీలను విస్తృతం చేస్తారు. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. క్రీడా కారులు, వ్యవసాయదారుల శ్రమ ఫలించే సమయం. 3,4 తేదీల్లో మిత్రులతో వివాదాలు. ఒప్పందాలు వాయిదా. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసు కుంటారు. భూములు, వాహనాల కొనుగోలుకు సమాయత్తమవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే వీలుంది. వ్యాపారస్తులు ఉత్సాహంగా సాగు తారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండ వచ్చు. క్రీడాకారులు, రచయితలు కొన్ని శుభవార్తలు వింటారు. 5,6 తేదీల్లో అనారోగ్యం. కొన్ని క్లిష్ట సమస్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని ధ్యానించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

కుటుంబ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. దూరప్రయాణాలు. సోదరులతో అకారణంగా విభేదాలు. వ్యాపారులకు లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మరింత పనిభారం మీద పడవచ్చు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. రాజకీయవేత్తలు, కళాకారులకు సామాన్య స్థితి. 3,4 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. కొత్త పరిచయాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

మీపై వచ్చిన అపవాదులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారస్తులు తగినంతగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరే సమయం. రచయితలు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. 6,7 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. స్నేహితులే శత్రువులుగా మారతారు. సూర్యారాధన మంచిది.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలలో విజయం వ్యాపా రస్తులు సొంత ఆలోచనలతో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు అనుకూలస్థితి మధ్య విధులు నిర్వర్తిస్తారు.  వైద్యులు, శాస్త్రవేత్తలకు ఉత్సాహకరంగా ఉంటుంది. 2,3 తేదీల్లో వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. శివాష్టకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగు తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని సమస్యల నుంచి అనూహ్యంగా బయటపడతారు. గతంలోని సంఘటనలు కొన్ని గుర్తుకువస్తాయి. శత్రువులు సైతం మిత్రులు మారతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. నిరుద్యోగుల యత్నాలు కార్య రూపం దాలుస్తాయి. వ్యవసాయదారులకు తగిన ప్రోత్సాహం. 5,6 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుం బంలో చికాకులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆప్తులు మరింత దగ్గరకువస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకివచ్చే అవకాశాలు విస్తృతమవు తాయి. ఇంటి నిర్మాణయత్నాలు, పుణ్యక్షేత్రాలు సంద ర్శిస్తారు. వ్యాపారస్తులు నైపుణ్యతను చాటు కుంటారు. ఉద్యోగులు బాధ్యతలను సక్రమంగా నిర్వ హిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలు అంచనాలు నిజంచేసుకుంటారు. 6,7 తేదీల్లో అనుకోని ప్రయా ణాలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ఆప్తులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందు కుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి కొంత లబ్ధి చేకూరు తుంది. ఒక కోర్టు కేసు విషయంలో రాజీపడతారు. వ్యాపారస్తులు కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు తీరతాయి. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు కొంత ప్రయోజనం పొందుతారు. 2,3 తేదీల్లో సన్ని హితులతో విభేదాలు. ఆంజనేయ దండకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE