సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.  ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్పశారీరక రుగ్మతలు ఇబ్బంది పెట్టవచ్చు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి. పారిశ్రామిక, రాజకీయవేత్తల శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు కొత్త ఆశలు. 25,26 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఒత్తిళ్లు. కుటుంబ సమస్యలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

సన్నిహితులు, సోదరులతో కష్టసుఖాలు విచా రిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో ఒత్తిడులు తగ్గవచ్చు. వ్యాపారుల శ్రమ ఫలిస్తుంది. తగినంతగా పురోగతి. ఉద్యోగులకు విధినిర్వహణ ప్రశాంత వాతావరణంలో గడు స్తుంది. రాజకీయ వేత్తలకు ఒక సమా చారం ఊరట నిస్తుంది. క్రీడాకారులు, వైద్యులకు శుభవార్తలు. 27,28 తేదీల్లో అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

రాబడి అవసరాలకు తగి నంతగా దక్కు తుంది. ఆప్తులనుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు మరింతగా లాభాలు. ఉద్యోగులసేవలు మరింత విస్తృతమవుతాయి. రాజకీయవర్గాలు, పరిశోధకుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. రచయితలు, క్రీడాకారులు చేజారిన అవకాశాలు దక్కించుకుంటారు. 27,28 తేదీల్లో బంధువిరోధాలు. దత్తాత్రేయ స్తోత్రం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆకస్మికప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. విద్యా ర్థులకు కొంత నిరాశ. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శారీరకరుగ్మతలు. వ్యాపారులకు పెట్టు బడులు నిరాశపరుస్తాయి. ఉద్యోగులకు హఠాత్తుగా మార్పులు. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు పర్య టనలు వాయిదా. పరిశోధనలు, క్రీడాకారులకు ఒడి దుడుకులు. 28,29 తేదీల్లో శుభవార్తలు. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

శుభకార్యాల నిర్వహణకు ఏర్పాట్లు చేసు కుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు ఉత్సాహంగానే గడుపుతారు. క్రీడాకారులు, కళా కారు లకు కొత్త ఆశలు చిగురించి ముందడుగు వేస్తారు. రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. 30,31 తేదీల్లో మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు. దక్షిణా మూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.  దైవ కార్యాలలో పాల్గొంటారు. వ్యాపారులు విస్తరణ కార్య క్రమాలు చేపడతారు. ఉద్యోగులకు వ్యిధి నిర్వహణ ఆశాజనకంగా ఉంటుంది. పారిశ్రామిక వేత్తలు, కళా కారులు అనుకున్న విజయాలు సాధిస్తారు. రచయితలు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. 26,27 తేదీల్లో అనారోగ్యం. స్నేహితులతో తగాదాలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూల. ప్రత్యర్థులను సైతం ఆకట్టు కుంటారు. వ్యాపారులకు మరింత ఉత్సాహ. ఉద్యో గులకు ప్రోత్సాహకరంగాఉంటుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విశేష ఆదరణ. వైద్యులు, శాస్త్ర వేత్తలు సత్తా చాటుకునే సమయం. 29,30 తేదీల్లో బంధువులతో విభేదాలు. కుటుంబంలో గందర గోళం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు. ధార్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు. పాత విషయాలు గుర్తుకువస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టు బడులు అందుతాయి. విస్తరణ కార్యక్రమాలలో పాల్గొంటారు. క్రీడాకారులు, కళాకారులకు ఉత్సాహ వంతంగా ఉంటుంది. 28,29 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు. శ్రీరామస్తోత్రాలు పఠిం చండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. విద్యార్థుల యత్నాలలో కొంత పురోగతి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కష్టానికి తగ్గ ఫలం. వ్యాపారులు భాగస్వాములతో కొత్త ఒప్పం దాలు. పారిశ్రామిక వేత్తలకు కొత్త ఆశలు. క్రీడా కారులు, రచయితలకు అంచనాలు నిజమవుతాయి. 25,26 తేదీల్లో మానసిక ఆందోళన. వృథా ఖర్చులు. దేవీస్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆదాయం మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధు వులతో సంభాషిస్తారు. దైవకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారులు ముందడుగు వేసి లాభాలు సాధిస్తారు. కొత్తపెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగుల పురోగతి. రాజకీయవేత్తలు, కళాకారులు గతంకంటే కొంత మెరుగైన పరిస్థితులలో గడుపుతారు. క్రీడా కారులు సత్తా చాటుకుంటారు. 25,26 తేదీల్లో సోద రులతో కలహాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

సన్నిహితులు, సోదరులతో మరింత సఖ్యత నెల కొంటుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే. వ్యాపారులకు లాభాలు దక్కి మరింత విస్తరిస్తారు. ఉద్యోగులు సమర్థతతో విధులు చక్కబెడతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. పరిశోధకులు, రచయితలకు ఒత్తిడులు తొలగుతాయి. 27,28 తేదీల్లో దూరప్రయాణాలు.  శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల ద్వారా ధనలాభ సూచనలు. వాహనయోగం. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు విశేష గుర్తింపు లభిస్తుంది. కళాకారులు, రచయితలకు మంచి గుర్తింపు. 29,30 తేదీల్లో స్నేహితులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆదిత్యహృదయం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE