సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం, ఔషధసేవనం. ఉద్యోగ ప్రయత్నాలకు విరామం. వ్యాపారులు పెట్టుబడుల్లో తొందరపాటు వీడాలి. ఉద్యోగులకు అదనపు పని భారం మీదపడ వచ్చు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి. రచయితలు, క్రీడాకారులు కొంత అసంతృప్తి చెందుతారు. 23,24 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆర్థిక లావాదేవీలు క్రమేపీ మెరుగుపడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నేర్పుగా కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. వివాహాది శుభకార్యాలపై బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారులు భాగస్వాముల నుంచి ఒత్తిడులు అధిగమిస్తారు. ఉద్యోగస్తులు ప్రతిభ చాటుకుంటారు. కళాకారులు,రచయితల కృషి ఫలిస్తుంది. 20,21 తేదీల్లో అనారోగ్యం. లేనిపోని చికాకులు. వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్న సమయానికి ఆదాయం సమకూరుతుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. భూయోగం కలిగే సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడులు మరింత పెంచుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవేత్తలు ఆశించిన పదవులు. రచయితలు, కళాకారులకు తగినంత గుర్తింపు లభిస్తుంది. 18,19 తేదీలలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కార్యసాధనదిశగా సాగి ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక వేత్తలలో నూతనోత్సాహం, ప్రభుత్వపరంగా ప్రోత్సాహం. క్రీడా కారులు, పరిశోధకులు స్వీయాను భవాలతో ముంద డుగు వేస్తారు. 22,23 తేదీలలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చీటికీమాటికీ ఎదురవుతున్న ఆరోగ్యసమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలు సాధిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కళాకారులు, రచయితలు సత్తా నిరూపిం చుకుంటారు. 21,22 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శివస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. ఇంట• నిర్మాణయత్నాలలో వేగం పెంచుతారు. వ్యాపారస్తులకు నూతనోత్సాహం, కొత్తగా పెట్టు బడులకు అనుకూలం. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వేత్తలు మంచి గుర్తింపు. క్రీడాకారులు, పరిశోధకులకు అన్ని విధాలా కలసివస్తుంది. 18,19 తేదీల్లో ఖర్చులు పెరుగు తాయి. ఆరోగ్యసమస్యలు. గణపతి స్తుతి మంచిది.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కీలకదశలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు పూర్తి చేయడంలో బంధువుల చేదోడు లభిస్తుంది. వ్యాపారులు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తులపై ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు. కళాకారులు, రచయితలకు కొత్త అవ కాశాలు. 20,21 తేదీల్లో దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కు తారు. వ్యాపారులు క్రమేపీ లాభాల దిశగా పయ నిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి రావచ్చు. రాజకీయ వేత్తలు విదేశీ పర్యటనలు జరుపుతారు. క్రీడాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. 21,22 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
నూతనోత్సాహంతో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రాబడి మరింత మెరుగుపడుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కొత్త విషయాలు గ్రహి స్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటాయి. క్రీడాకారులు, పరిశోధకులు శుభవార్తలు వింటారు. 23,24 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
చిన్ననాటి స్నేహితులనుకలిసి ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుం టారు. వ్యాపారస్తులు పెట్టుబడుల అన్వేషణలో విజయం. ఉద్యోగులకు ముఖ్య సమాచారం. రాజకీయవేత్తలు కొన్ని ఆశయాలు సాధిస్తారు. వైద్యులు, క్రీడాకారులు ప్రతిభ నిరూపించుకుంటారు. 19,20 తేదీల్లో ఆప్తులతో కలహాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయంకోసం ఎదురుచూసే అవసరం ఉండదు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభి స్తాయి. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలను సాఫీగా పూర్తిచేస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు. రాజకీయవేత్తలు కొన్ని పదవులు పొందుతారు. క్రీడాకారులు, రచయితలకు ఎదురుచూడని అవకా శాలు. 18,19 తేదీల్లో బంధువులతో వివాదాలు. సూర్యారాధన మంచిది.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
రాబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచి పోతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. కోర్టు వ్యవహారాలు ఎట్టకేలకు కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు కళాకారులు మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటారు. వైద్యులు, క్రీడా కారులకు శుభవార్తలు అందుతాయి. 20,21 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. మనశ్శాంతి లోపిస్తుంది. శ్రీరామ రక్షాస్తోత్రాలు పఠించండి.