సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

శత్రువులను సైతం స్నేహితులుగా మార్చు కుంటారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్క రించుకుంటారు. భూములు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు సాధిస్తారు. వ్యాపా రులకు అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగు లకు కొన్ని మార్పులు సంభవం. రాజకీయవేత్తలకు ఒక కీలక సమాచారం అందుతుంది. 28,29 తేదీల్లో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

దేవాలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి కొన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు లాభాలు మరింత అందుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవేత్తలకు చిక్కులు తొలగుతాయి. క్రీడాకారులు, పరిశోధకుల ఆశలు ఫలిస్తాయి. 27,28 తేదీల్లో బంధువిరోధాలు. వృథా ఖర్చులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరు ద్యోగులు అనుకున్న ఉద్యోగాలుసాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు పొందుతారు. భూముల విషయంలో అగ్రి మెంట్లు కుదురుతాయి. సోదరులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారులు పెట్టుబడులు సమ కూర్చుకుంటారు. ఉద్యోగులకు చిక్కులు తొలగు తాయి. కళాకారులు, రచయితల యత్నాలు ఫలి స్తాయి. 29, 30 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శారీరకరుగ్మతలు. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

ఓర్పు, నేర్పుగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారులకు మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. రచయితలు, పరిశోధకులకు అవకాశాలు మరిన్ని దక్కుతాయి. 1,2 తేదీల్లో కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

చిన్ననాటి స్నేహితుల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం. ఉద్యోగార్థుల యత్నాలు సఫలం. వ్యాపా రులు గతం కంటే పుంజుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత సానుకూలం. రచయితలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. 31,1 తేదీల్లో ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. గత సంఘటనలు గుర్తుకువస్తాయి. వ్యాపారులు కొత్త భాగ స్వాముల సహాయం అందుకుంటారు. ఉద్యోగు లకు విధుల్లో ప్రోత్సాహకరం రాజకీయవేత్తలకు శుభవార్తలు. పరిశోధకులు, క్రీడాకారులకు అంచనాలు ఫలిస్తాయి 28,29 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

నిరుద్యోగుల కృషి సఫలం. చిన్ననాటి స్నేహి తులతో ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కు తాయి. వ్యాపారులకు అనుకూల పరిస్థితి. ఉద్యోగు లకు ప్రమోషన్లు లభించే సమయం. కళాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు అందుతాయి. 30,31 తేదీల్లో స్నేహితులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. గణేశాష్టకం పఠించండి..

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. మీమనస్సులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. వ్యాపారస్తులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు తప్పవు. కళాకారులకు ఒడిదుడుకులు. 29,30 తేదీల్లో శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో సమర్థత చాటుకుంటారు. రాజకీయవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు ఉత్సాహవంతమైన కాలం. 1,2 తేదీల్లో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్యమైన కార్యాలు కొంత ఆలస్యమైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కే సూచ నలు. కళాకారులు అనుకున్న అవకాశాలు పొందు తారు. రచయితలు, క్రీడాకారులకు అంచనాలు నిజం కాగలవు. 29,30 తేదీల్లో కష్టానికి ఫలితం కని పించదు. ఆస్తి వివాదాలు. సూర్యారాధన చేయండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారులు అనుకున్న సమయానికి పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు పనిభారంతగ్గుతుంది. రాజకీయ వేత్తలు కొత్త పదవులు. పరిశోధకులు, కళాకారులకు అవ కాశాలు పెరుగుతాయి. 30,31 తేదీల్లో మనశ్శాంతి లోపం. శివపంచాక్షరి పఠించండి..

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలలో కొంత అనుకూల పరిస్థితి. వ్యాపారస్తులు సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వేత్తలు లక్ష్యసాధనలో ముందుకు సాగుతారు. రచయితలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 29,30 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE