సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
సన్నిహితుల నుంచి అనుకూల సమాచారం రాగలదు. ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరే సమయం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. కుటుంబంలో ఇబ్బందులు అధిగమిస్తారు. అందరికీ మీ సలహాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులతో పాటు లాభాలకు లోటురాదు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను చేపడతారు. సహచరుల సాయం లభిస్తుంది. కళాకారులు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. పరిశోధకులు, వైద్యులకు మరింత అనుకూల సమయం..4, 5 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు. ప్రముఖుల నుంచి పిలుపు రావచ్చు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారులు ఆశించిన మేర లాభాలు దక్కి ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థత నిరూపించుకుంటారు. పారిశ్రామికవేత్తలు సంస్థలను వికే ంద్రీకరిస్తారు. క్రీడాకారులు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 6,7తేదీల్లో్య ఖర్చులు. దూరప్రయాణాలు. శ్రీమహావిష్ణుధ్యానం మంచిది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ముఖ్య వ్యవహారాలు వేగంగా పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది.ఆస్తి విషయాలలో గందరగోళం తొలగుంది. ఆలయాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన విధంగా పెట్టుబడులు అందుతాయి. రాజకీయవర్గాలు సన్మానాలు, సత్కారాలతో బిజీగా గడుపుతారు. రచయితలు, క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. 8,9 తేదీలలో వృథా ఖర్చులు.ఇంటాబయటా సమస్యలు. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. •సొమ్ము సకాలంలో అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వేడుకలు, ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలలో మరింత లాభాల కోసం యత్నిస్తారు. విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న కొత్త హోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వైద్యులు, క్రీడాకారులకు శుభవర్తమానాలు. 9,10 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. శ్రీశివప్రార్ధన మంచిది.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొన్ని వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. స్నేహితులతో నెలకొన్న తగాదాలు పరిష్కారం. పనులు నెమ్మదించినా సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వివాహాది వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు. వైద్యులు, వ్యవసాయదారుల కృషి ఫలిస్తుంది.5,6 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం. శ్రీదక్షిణామూర్తి ప్రార్ధన మంచిది.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి ఊపిరిపీల్చుకుంటారు. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. పైస్థాయి అధికారుల ప్రశంసలు సైతం అందుకుంటారు. కళాకారులకు మంచి గుర్తింపు, రచయితలు, పరిశోధకులకు సత్కారాలు. 8,9 తేదీల్లో కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. శ్రీవేంకటేశ్వరస్తుతి మంచిది.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు. నిరుద్యోగుల కృషి ఫలించదు. మానసిక ఆందోళన చెందుతారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. మీ నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురుకాగలదు.ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. ఉద్యోగులు కొంత శ్రమపడాల్సిన సమయం. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలలో మార్పులు. రచయితలు, వైద్యుల సేవలు గుర్తింపు పొందుతాయి. 9,10 తేదీలలో అనుకోని ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. దేవీస్తుతి మంచిది.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.స్నేహితులతో మరింత ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి. వ్యాపారులు సత్తా చాటుకుని లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. కళాకారులు, రచయితల సేవలకు గుర్తింపు లభిస్తుంది. 7,8 తేదీల్లో ఖర్చులు. అనారోగ్యం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
స్నేహితులతో వివాదాల పరిష్కారం. వేడుకలు నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఊహించని అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఊహించని ఉద్యోగాలు సాధిస్తారు. రావలసిన డబ్బు చేతికంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో వివాహ విషయాలలో సంప్రదింపులు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆరోగ్యసమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులు విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులు క్లిష్ట బాధ్యతల నుంచి బయటపడతారు. కళాకారులకు కొన్ని అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. క్రీడాకారులు, పరిశోధకుల శ్రమ ఫలిస్తుంది. 4,5 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. శివపంచాక్షరి పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు తీరి కొంత లబ్ధి చేకూరుతుంది. స్నేహితుల నుంచి ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు,ఆభరణాలు కొంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగిస్తారు. రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. క్రీడాకారులు, పరిశోధకులు నైపుణ్యాన్ని చాటుకుంటారు. 8,9 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనారోగ్య సూచనలు. గణేశ్స్తోత్రాలు పఠించండి
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో్య ధిగమిస్తారు. సమాజంలో గౌరవానికి లోటు ఉండదు. ప్రముఖులతో పరిచయాలు కొంత ఊరటనిస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. వ్యాపారులు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు పైస్థాయి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితల యత్నాలు సఫలం. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. తులసీదాస శ్రీగణేశ్స్తుతి చేయండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. . ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమై సాయపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించిన విధంగానే డబ్బు అందుతుంది. కుటుంబంలోని అందర్నీ మెప్పించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వైద్యసేవలకు నిలిపివేస్తారు. వ్యాపారాలలో లాభాల బాటలో సాగుతారు. నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గి ఉపశమనం పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారుల ఆశలు నెరవేరతాయి. 5,6 తేదీల్లో వృథా ఖర్చులు. వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. శ్రీ నృసింహధ్యానం మంచిది.