– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కొన్ని ఇబ్బందులు, సమస్యలు పరిష్కార మవుతాయి. ఆదాయం ఆశాజనకం. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. హఠాత్తుగా నిర్ణయాలు తీసు కుంటారు. ఉద్యోగులకు విధుల్లో ప్రశాంత వాతా వరణం. రాజకీయవేత్తల యత్నాలు కలసివస్తాయి. కళాకారులు, క్రీడాకారులకు శ్రమ ఫలిస్తుంది. 18,19 అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. దూరప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కుటుంబంలో చికాకులు తొలగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుం టారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగు లకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు ఒక సంతోషకర సమాచారం రాగలదు. కళాకారులు, పరిశోధకులకు నూతనోత్సాహం. 19, 20 తేదీల్లో స్నేహితుల నుంచి ఒత్తిడులు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గృహ నిర్మాణ యత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూల పరిస్థితులు. రాజకీయ వేత్తలకు కొత్త ఆశలు. కళాకారులు, రచయితలు సత్తా చాటుకుంటారు. 14, 15 తేదీల్లో అనారోగ్యం. శ్రమాధిక్యం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలు సోదరుల సహకారంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు మరింత అందుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కవచ్చు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 16, 17 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. అనుకోని ప్రయాణాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కించుకుం టారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభసాటి. ఉద్యోగులకు పనిభారం కాస్త తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలకు అనుకున్న లక్ష్యాలు నెరవేర తాయి. కళాకారులు, రచయితలకు మరింత అనుకూలం. 18,19 తేదీలలో దూర ప్రయాణాలు. శ్రమపెరుగుతుంది. గణేశాష్టకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆదాయం ఆశాజనకం. వాహనాలు, స్థలాలు కొను గోలు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు ఉత్సాహంగా ఉండడంతో పాటు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థ నీయంగా నిర్వహిస్తారు. 15,16 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువులు,స్నేహితులతో విభేదాలు. హనుమాన్ చాలీసా పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
స్నేహితులు, బంధువుల నుంచి శుభవర్తమా నాలు వింటారు. విద్యార్థులకు కాస్త ఊరట కలుగు తుంది. వ్యాపారులకు తగినంత లాభాలు అందు తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. పరిశోధకులు, క్రీడాకారులకు విశేష గుర్తింపు. 14,15 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ధార్మికకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుం బంలో మీదే పైచేయి. సన్నిహితులతో తగాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఉద్యోగ యత్నాలు ఫలి స్తాయి. వ్యాపారులనుకున్న లాభాలు. పెట్టు బడులకు లోటురాదు. ఉద్యోగులు ఒడి దుడుకులు, సమస్యల నుంచి గట్టెక్కుతారు.16,17తేదీల్లో స్వల్ప అనారోగ్యం. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. విష్ణుసహస్రనామస్తోత్రం పారాయణ చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య మైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారులకు ఒడిదుడుకులు తప్పక పోవచ్చు. ఉద్యోగులకు వ్యిధుల్లో ప్రతిబంధకాలు ఎదురై సవాలుగా మారతాయి. పారిశ్రామికవేత్తలు నిరాశాజనకంగా గడుపుతారు. రచయితలు, క్రీడా కారుల యత్నాలు ముందుకు సాగవు. 17,18 తేదీల్లో శుభవర్తమానాలు. ఆంజనేయ దండకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు తొలగు తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నా లలో మరింత అనుకూలత. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామిక వేత్తలకు కొన్ని సమస్యలు తీరతాయి. కళాకారులు, క్రీడాకారులకు అంచనాలు నిజమవుతాయి. 19, 20 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయంలో చికాకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. భూములు, ఆభరణాలు కొంటారు. ఉద్యోగ ప్రయత్నా లలో పురోగతి. వ్యాపారులకు పెట్టుబడులు అంది సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. కళాకారులు, రచయితలకు నూత నోత్సాహం. 14,15 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితు లతో విరోధాలు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆస్తుల విషయంలో సమస్యలనుంచి గట్టెక్కు తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మీ ఆశయాలు నెరవేరి ఊరట. వ్యాపారులకు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహిస్తారు. రచయితలు, పరిశోధకులకు విజయ వంతంగా గడుస్తుంది. 15,16 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువులతో తగాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.