– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీర తాయి.  ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపు తారు. కాంట్రాక్టర్లకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవు తాయి. వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  కళాకారులు, క్రీడాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు అందుతాయి. 5,6 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. శారీరక రుగ్మ తలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొన్ని  కార్యక్రమాలలో కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. . కొత్త కాంట్రాక్టులు పొందుతారు.  అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు  చేస్తారు.  వ్యాపారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.  పారిశ్రామికవర్గాలు, కళాకారులు, పరిశోధకుల యత్నాలు సఫలం.9,10 తేదీల్లో  ఆకస్మిక ప్రయాణాలు. బ్యధువులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం ఆశా జనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు, సమస్యల నుంచి బయటపడతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు ఉద్యోగులకు ఊహించని  బాధ్యతలు దక్క వచ్చు. పారిశ్రామిక వేత్తలకు మరింత అనుకూల పరి స్థితులు. 10,11తేదీల్లో  వ్యయప్రయాసలు. కుటుంబ సభ్యులతో తగాదాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

అనుకున్న కార్యక్రమాలు స్నేహితుల సహ కారంతో పూర్తి చేస్తారు. ఆదాయం గతం కంటే కాస్త పుంజుకుంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలుచేస్తారు. విద్యార్థులకు కొంత ఊరట లభి స్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపా రులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. క్రీడా కారులు, పరిశోధకులు, రచయితలకు శుభవార్తలు అందుతాయి. 6,7తేదీల్లో  దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అనుకున్న కార్యక్రమాలు  సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆశించిన రాబడి.వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు కాస్త ఫలిస్తాయి. వ్యాపా రులకు లాభాలు,  పెట్టుబడులు సమకూరతాయి.  రాజకీయ, పారిశ్రామికవర్గాలు, రచయితలకు కీలక సమాచారం అందుతుంది. 5,6 తేదీల్లో శారీరక రుగ్మతలు. సోదరులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

లక్ష్యాల సాధనలో ముందడుగు వేస్తారు.  సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగుల శ్రమఫలించే సమయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది.  పారిశ్రామిక,  రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. 8,9తేదీల్లో బంధువులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. ఆదిత్య హృదయం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగాఉండవు. ఆధ్యాత్మిక కార్య క్రమా లలో పాల్గొంటారు. ఆదాయ,వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడవచ్చు. ద్యోగులకు కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు.  7,8 తేదీల్లో శుభవార్తలు.  విష్ణుధ్యానం చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

సన్నిహితులు మీకు మరింత చేదోడుగా నిలుస్తారు.  ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటినిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు గతం కంటే మెరుగ్గాఉంటాయి. పారిశ్రామికవర్గాలు, రచయితలు,  శ్రమ ఫలి స్తుంది. 10,11 తేదీల్లో ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు.  వ్యాపారులకు • మరింత అనుకూల పరిస్థితి ఉంటుంది. రాజకీయ, పారిశ్రామివర్గాలు, పరిశోధకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 6,7తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

వీరికి పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.  నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  ఆధ్యాత్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింత లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు విశేష గుర్తింపు పొందుతారు. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహ కరంగాఉంటుంది. 10,11తేదీల్లో కుటుంబ సభ్యు లతో విభేదాలు. అశాంతి. లక్ష్మీస్తుతి మంచిది.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

నూతన ఉద్యోగయత్నాలు సానుకూలం. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.   విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు నిరుత్సాహం.కళాకారులు, రచయితలు, అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. 8,9 తేదీల్లో వృథాఖర్చులు.దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగ మిస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు  పూర్తి చేసే వరకూ విశ్రమించరు.   వ్యాపారులు సంస్థలను లాభాల దిశగా నడిపిస్తారు. ఉద్యోగులకు ఇంతకాలంగా ఉన్న గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహం. రచయితలు, కళాకారులకు కాస్త అను కూలత ఉంటుంది. 5,6 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

About Author

By editor

Twitter
Instagram