– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడు తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహ నాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు దక్కుతాయి. రాజకీయ వేత్తలకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, క్రీడాకారుల యత్నాలు సఫలం. 29,30 తేదీల్లో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. ఆవు పాల పొంగలిని……….నివేదించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు. కార్య క్రమాలలో జాప్యం. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగం. వ్యాపారులకు చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. క్రీడాకారులు, వైద్యుల కృషి ఫలిస్తుంది. 30,31 తేదీల్లో ధనవ్యయం. అనారోగ్యం. ఆవునేతితో గణేశుని వద్ద  దీపం వెలిగించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందర్నీ మెప్పిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు.  వాహనాలు కొంటారు. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశాలు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుతారు. వ్యవసాయదారులు, అంచనాలు ఫలిస్తాయి. 31,1 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. దేవీ స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆదాయానికి కొంత ఇబ్బంది తప్పదు. కార్య క్రమాలలో అవాంతరాలు ఎదురవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అనుకోని ఖర్చులు.   వ్యాపారస్తులు కొంతవరకూ లాభపడతారు. ఉద్యోగస్తులకు విధులు సమస్యలు తప్పవు. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. క్రీడాకారులు, రచయితలకు ఒత్తిడులు. 2,3 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కార్యక్రమాలల్లో విజయం సాధిస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి.  పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారులకు విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. పారిశ్రామివేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు అనుకూల పరిస్థితి. 3,4 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఎటువంటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించు కుంటారు. చిరకాల మిత్రుల నుంచి ముఖ్య సమా చారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లావాదేవీలు పుంజు కుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. వైద్యులు, వ్యవసాయ దారులకు నూతనోత్సాహం. 29, 30 తేదీలలో ఖర్చులు తప్పవు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది.  పనులు అనుకున్నవిధంగాసాగుతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం.శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. రాజకీయ వేత్తలకు ఊహించని ఆహ్వానాలు. 3,4తేదీల్లో కుటుం బంలో చికాకులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కార్యశూరులై అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్వచ్ఛంద కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.  తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, భూములు కొం టారు. వ్యాపారులకు విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. రచయితలు, సాంకేతిక నిపుణులకు ఉత్సాహం పెరుగుతుంది. 2,3 తేదీలల్లో అనారోగ్యం. ధనవ్యయం. గణేశాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఆప్తులు నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరు ద్యోగులకు శుభవార్తలు.   వ్యాపారులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి మెప్పు పొందుతారు. వ్యవసాయదారులు, వైద్యులు కొంత ఊరట చెందుతారు. 30,31 తేదీల్లో ఖర్చులు. కుటుంబసమస్యలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆత్మ విశ్వాసం, పట్టుదలతో అధిగమిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వ్యాపా రస్తులు సంస్థలను కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగు లకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రచ యితలు, సాంకేతిక నిపుణులు సత్తా చాటుకుంటారు. 31,1 తేదీలలో మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. ఆంజనేయ దండకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కార్యక్రమాలు కొంత నెమ్మదించినా పూర్తి కాగ లవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.  వాహన యోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు పెట్టు బడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు సరైన గుర్తింపురాగలదు. వైద్యుల సేవలకు గుర్తింపు. 1,2 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితులతో వివాదాలు. అనారోగ్యం. శివపంచాక్షరి పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.  విద్యార్థులకు నూతనోత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలకు శుభవార్తలు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు. 2,3 తేదీల్లో శ్రమ తప్పదు. అనారోగ్యం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

About Author

By editor

Twitter
YOUTUBE