– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

మీ ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి. అనుకున్న విధంగా సమయానికి డబ్బు సమకూరుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులు కొత్త హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, ర చయితలకు మరింత ఆదరణ లభిస్తుంది. 8,9తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపడతారు. యుక్తిగా వివాదాల నుంచి బయటపడతారు. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది.వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు అందుకుంటారు.  ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది.  రాజకీయవర్గాలకు పదవీయోగం. కళాకారులు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 10,11 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు.  శివపంచాక్షరి పఠించండి


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయం కొంత సంతృప్తినిస్తుంది. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. ప్రముఖుల నుంచి  ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు కొత్త ఆశలు. కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. క్రీడాకారులు, పరిశోధకులకు సమస్యలు తీరే సమయం. 3,4 తేదీల్లో ధనవ్యయం. సూర్యారాధన చేయండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో సఖ్యత రీ• లకొంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విశేషంగా కలసివస్తుంది. 13,14 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో ఎట్టకేలకు పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసభ్యుల సలహాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు సంస్థలను విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు విజయవంతమైన కాలం. 2,3 తేదీల్లో అనారోగ్యం, కుటుంబంలో చికాకులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

అనుకున్న విధంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు లేదా ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 11,12తేదీల్లో దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. ఆదిత్య హృదయం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.  ఆర్ధిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారులు సంస్థలను విస్తరిస్తారు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, రచయితలకు అవార్డులు. 11,12తేదీల్లో దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. ఆంజనేయ దండకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి తరఫున ఆస్తిలాభం ఉంటుంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు కలసివచ్చే కాలం. వ్యాపారులు తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతస్థితితో పాటు, మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 9,10తేదీల్లో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కాలభైరావష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలో పట్టింది బంగారమే కాగలదు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. రచయితలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 10,11తేదీల్లో అనుకోని ప్రయాణాలు. రుణఒత్తిడులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలలో  పురోగతి కనిపిస్తుంది. అనుకున్నది సాధించాలన్న తపనతో ముందడుగు వేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు లాభదాయకంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు పోటీపరీక్షలలో విజయం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు మరింత అనుకూల సమయం.  ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు సన్మానయోగం. రచయితలు, క్రీడాకారులు నైపుణ్యతను చాటుకుంటారు. 12,13తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆశించినంత ఆదాయం సమకూరుతుంది. రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆత్మీయులతో  వివాదాలు తీరతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు.  ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, క్రీడాకారులకు మంచి గుర్తింపు. 13,14 తేదీల్లో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆదాయం సంతృప్తినిస్తుంది. ఖర్చులు తగ్గిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటర్వ్యూలు ఆందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 10,11 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE