– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

సమాజసేవలో భాగస్వాములతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  వాహనాలు, స్థలాలుకొంటారు. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. క్రీడాకారులు, రచయితలకు ప్రత్యేక ఆహ్వానాలు. 30, అక్టోబర్‌ 1‌తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ధననష్టం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. దూరపు బంధువుల ద్వారా ధనలాభం. కోర్టు వ్యవహా రాలలో చిక్కులు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు సమస్యలు తీరుతాయి. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం, పదవీయోగం. 2,3 తేదీ లలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. బంధు వులతో తగాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ప్రముఖుల పరిచయం. శత్రువులు కూడా స్నేహితులుగా మారవచ్చు. స్థిరాస్తివివాదాలు కొలిక్కి వస్తాయి. వాహన యోగం. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందు తారు. ఉద్యోగస్తులకు ఉన్నతపోస్టులు. రాజకీయ వేత్తలకు కొత్త పదవులు.  రచయితలకు శుభవార్తలు. 4,5తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. అనారోగ్యం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ముఖ్య కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. దేవాలయాల సందర్శన. నిరుద్యోగుల కృషి ఫల వంతం. సన్నిహితులతో వివాదాలు. కొన్ని నిర్ణయాలలో మార్పు. ఆస్తుల విషయంలో చికాకులు. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా. వ్యాపారాలలో ఒడి దుడుకులు. ఉద్యోగస్తులకు మరిన్ని బాధ్యతలు. కళా కారులకు అవకాశాలు చేజారవచ్చు. పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు. 3,4 తేదీల్లో శుభవర్తమానాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

మీ ఆశయాలు నెరవేరే సమయం. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు అన్నింటా చేదోడు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆస్తి వివాదాలు పరిష్కార. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు. పరిశోధకులకు విదేశీ పర్యటనలు. 5,6 తేదీల్లో  అనుకోని ఖర్చులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

యత్నకార్యసిద్ధి. కుటుంబసభ్యులు,స్నేహితుల నుంచి మాటసహాయం. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంత. అందరిలోనూ మీ సత్తా చాటుకుం టారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు. రాజకీయవేత్తల కృషి. పరిశోధకులకు ఆహ్వానాలు. 30,1తేదీల్లో ధననష్టం. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

దూరపు బంధువుల రాకతో కుటుంబంలో సందడి. భూ,గృహయోగాలు. అందర్నీ ఆశ్చర్య పరిచేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితు లతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగు తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవార్డులు లభించే వీలుంది. 4,5 తేదీలలో దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆలోచనలు అమలు. శత్రువులు  స్నేహితులవుతారు. దేవాలయ దర్శనాలు. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి. గృహనిర్మాణ యత్నాలు. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. రచయిత లకు మంచి గుర్తింపు లభిస్తుంది. 3,4 తేదీల్లో దూర ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొన్ని అద్భుతాలు ఎదురవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. వాహనయోగం. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారులకు చిక్కులు తొలగు తాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. కళాకారులకు ఉత్సాహం. 1,2 తేదీల్లో ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థుల నైపుణ్యానికి తగిన గుర్తింపు. ప్రముఖులతో పరిచయాలు.  శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. దేవాలయాల సందర్శన. వ్యాపారులు ప్రగతి సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. పరి శోధకులు, కళాకారులకు ఊహించని అవకాశాలు. 30,1 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. గణేశాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

నిరుద్యోగులు ఇంతకాలం చేసిన కృషి ఫలించే సమయం. కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు. కళాకారులకు పురస్కారాలు. క్రీడాకారులు, పరిశోధకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 4,5తేదీల్లో అనుకోని ఖర్చులు.  ఆదిత్య హృదయం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలను మార్చుకుంటారు. వ్యాపారులు మరింత లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు సమస్యలు తీరి ఊరటచెందుతారు. రాజకీయవేత్తలకు అనుకోని పదవీయోగం. కళాకారులు, రచయితలకు అనుకోని ఆహ్వానాలు రావచ్చు. 5,6 తేదీలలో అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE