– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. సమాజంలో విశేష గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన అవకాశాలు పొందుతారు. పలుకుబడి కలిగినవారు పరిచయాలు ఏర్పడవచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమా చారం. క్రీడాకారులకు కొంత ఊరట. 17,18 తేదీల్లో శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి..


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపట్టి సజావుగా సాగుతాయి. రాబడి విషయంలో గందరగోళం తొలగుతుంది. విద్య, ఉద్యోగయత్నాలు అనుకూ లిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని వివాదాలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, రచయితలకు ఆశ్చర్య కరమైన ఫలితాలు ఉంటాయి. 14,15 తేదీల్లో దూరప్రయాణాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు.  నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. వ్యాపారులకు ప్రోత్సాహకరం. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. క్రీడాకారులు, రచయితలకు శుభవార్తలు. 12,13 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములమవుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు తగినంత లాభాలు దక్కు తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు క్రమేపీ తొలగు తాయి. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. రచయితలు, క్రీడాకారులకు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 12,13తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. విష్ణుధ్యానం చేయండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. సోదరులు, స్నేహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యో గులకు విధుల్లో అనుకూలమైన వాతావరణం నెల కొంటుంది. 16,17 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. కనకధారా స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొన్ని సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుం టారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు కృషి ఫలిస్తుంది. 17,18 తేదీల్లో శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ముఖ్యకార్యక్రమాలలో ముందడుగు పడుతుంది. విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుంది. బంధువులు మీపై మరింత అభిమానం పెంచుకుంటారు. ఆదాయం ఆశాజకనంగా ఉంటుంది. వ్యాపారులు ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకూలం. రచయితలకు కొత్త ఆలోచనలు వస్తాయి. 12,13 తేదీల్లో వృథా ఖర్చులు. గాయత్రీ ధ్యానం చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

మధ్యమధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగ మించి ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు ఇచ్చిన హామీలు నిలుపుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారులు లాభాల దిశగా నడుస్తారు. ఉద్యోగులకు అవాంతరాలు తొలగుతాయి. 14,15 తేదీల్లో ఆరోగ్యసమస్యలు. సూర్యారాధన చేయండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

రాబడి మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. ఊహించని కాంట్రాక్టులు లభిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. 13,14 తేదీల్లో ఖర్చులు అధికం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదు రవుతాయి. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. స్నేహితులతో అకారణంగా విభేదాలు నెలకొం టాయి. ఆస్తులపై ఒప్పందాలలో మార్పులు ఉద్యోగా యత్నాలు నిరాశ పరుస్తాయి. మంచికి వెళితే చెడుగా మారే సూచనలు. కళాకారులు, పారిశ్రామిక వేత్త లకు, క్రీడాకారులకు గందగోళపరిస్థితి. 14,15 లల్లో వాహనసౌఖ్యం. శుభవార్తలు. విష్ణుధ్యానం చేయండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కీలక సమాచారం అందుతుంది. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ఇంతకాలంపడిన కష్టంఫలిస్తుంది. స్థిరాస్తి విష యంలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. కళాకారులు, రచ యితలకు నూతనోత్సాహం. 17,18లలో వృథా ఖర్చులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొన్ని వివాదాలు ఎదురైనా నేర్పుగా పరిష్క రించుకుంటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. అదనపు రాబడి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆవ్యాపారులకు కొత్త పెటుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. రచయితలకు ఉత్సాహ వంతంగా ఉంటుంది. 12,13 లలో ఆకస్మిక ప్రయా ణాలు. సూర్యారాధన చేయండి.

About Author

By editor

Twitter
Instagram