– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

 చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.  విద్యార్థులకు ఆశించిన అవకాశాలు తథ్యం. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు, రచయితలు, కళాకారులకు పట్టింది బంగారమే. 12,13 తేదీల్లో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.  ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. కొత్త  ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. రావలసిన సొమ్ము కొంత జాప్యమైనా పూర్తిగా అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగులకు  అనుకూల మార్పులు. 10,11 తేదీల్లో అనారోగ్యం. బంధువులతో వివాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు.  చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.  వ్యాపారులు అనుకున్న విధంగా విస్తరణ పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు మరింత అనుకూల కాలం. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు లక్ష్యాలు సాధిస్తారు. 10,11 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. ఆర్థికంగా బలం చేకురుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో జాప్యం తొలగుతుంది. పారిశ్రామివేత్తలు,కళాకారులు, క్రీడాకారులకు విస్తృత అవకాశాలు. 12,13 తేదీల్లో దుబారా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

పరిస్థితులు అనుకూలిస్తాయి. స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు సాధిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులను అందుకుంటారు.  7.8 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆంజనేయ దండకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

 కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విలువైన సమాచారం అందుతుంది.  ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది.  కాంట్రాక్టులు దక్కుతాయి.ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 9,10 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువులతో వివాదాలు. శివాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.  అప్పగించిన  బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  నిరుద్యోగులకు శుభవర్తమానాలు.  వ్యాపారులకు పెట్టుబడులరు లోటు రాదు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు విశేష గుర్తింపు పొందుతారు. 11,12తేదీల్లో దూరప్రయాణాలు. సోదరులతో వివాదాలు.  శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

పెండింగ్‌లో పడిన కార్యక్రమాలను  పూర్తి చేస్తారు.రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారదశకు చేరతాయి.  ఇంటి నిర్మాణాలు కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టర్లకు శుభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలదిశగా అడుగులేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల సమాచారం రాగలదు.  8.9 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి.  విద్యార్థులు, నిరుద్యోగులకు విజయాలు సొంతమవుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో  అందుతుంది.  ఉద్యోగవర్గాలు నూతనోత్సాహంతో విధులు నిర్వర్తిస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి.7,8 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు.  అనారోగ్యం. బంధువిరోధాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఉద్యోగులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు,రచయితలకు విశేష గుర్తింపు లభిస్తుంది. 9,10 తేదీల్లో వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు.  వేంకటేశ్వరస్వామిని పూజించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్య కార్యక్రమాలలో కొద్దిపాటి అవరోధాలు.  బంధువులు, స్నేహితులతో తగాదాలు నెలకొంటాయి.   ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు.  రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇక్కట్లు తప్పవు. ఉద్యోగులకు స్థానచలనం. వ్యాపారులకు సామాన్య లాభాలు దక్కుతాయి. కళాకారులు, పరిశోధకులు, క్రీడాకారులకు పురస్కారాలు అందుతాయి.  9.10 తేదీల్లో ఆకస్మిక ధనలాభం, యత్నకార్యసిద్ధి.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం.రావలసిన సొమ్ము అందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 12,13 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఖర్చులు. కుటుంబంలో చికాకులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE