– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

పట్టుదల, నేర్పుతో ఎంతటి కార్యాన్నైనా చక్కదిద్దుతారు. ఆశించిన రాబడి పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ తొలగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు అధిగమిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 1,2 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త కార్యక్రమాలను సమయానికి పూర్తి చేస్తారు.  ఆత్మీయుల ప్రేమానురాగాలు పొందుతారు.  ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. అదనపు ఆదాయం లభిస్తుంది.  వాహనాలు, భూములు సమకూరతాయి. కొన్ని వివాదాల నుంచి  బయటపడతారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని  హోదాలు లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులకు కార్యసిద్ధి. ఊహించని అవకాశాలు. 31,1 తేదీల్లో వివాదాలు. వృథా ఖర్చులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరిచుకుంటారు.  కొత్త నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తారు.  అంచనాలు నిజమవుతాయి. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళాకారులు, రచయితలు, కళాకారులకు పురస్కారాలు అందుతాయి.  2,3తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి కలిగే అవకాశం. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలకు అనుకూల సందేశాలు రావచ్చు. 4,5 తేదీల్లో వివాదాలు. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. శ్రీరామరక్షాస్తోతాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొన్ని సమస్యలను నేర్పు, ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విదేశీ పర్యటనలు. 5,6 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు క్రమేపీ తొలగుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనాలు, భూములు కొంటారు. ఆశించినంత ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారులకు భాగస్వాముల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్లతో ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామిక,రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 31,1 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

అనుకున్న ఆదాయం సమకూరుతుంది. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు అందుతాయి.  3,4తేదీల్లో ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆదిత్య హృదయం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కొన్ని  ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు,స్నేహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. నిరుద్యోగుల యత్నాలు నతనడకన సాగుతాయి. గృహ  నిర్మాణాలలో స్వల్ప అవాంతరాలు. వివాదాలకు దూరంగా ఉండండి. శారీరక రుగ్మతలు కొంత బ్యాధిస్తాయి. వ్యాపారులు లాభాలపై నిరాశ చెందుతారు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం తప్పదు. రచయితలు, పరిశోధకులు, కళాకారులకు  కొన్ని ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.  4,5 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుని పొదుపు చర్యలు పాటిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. స్నేహితులు, శ్రేయోభిలాషులతో మంచీచెడ్డా విచారిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు, భవనాలు కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు హోదాలు రాగలవు. ఉద్యోగులకు కొన్ని సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి. 5,6 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో బంధువులతో  అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగుల లక్ష్యం నెరవేరే సమయం. వాహనసౌఖ్యం. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఉపశమనం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారుల యత్నాలు సఫలం. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు విదేశీ పర్యటనలు జరుపుతారు. 2,3 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ, విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. వివాహాది వేడుకలకు సన్నద్ధమవుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. సమయానుసారం నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారులు మరింత ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు పురస్కారాలు అందవచ్చు. 3,4 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆప్తుల సలహాలు పొంది ముందడుగు వేస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి లబ్ధి పొందుతారు. ఆదాయానికి మించి ఖర్చులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలతో పాటు, మంచి గుర్తింపు లభించవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు యత్నాలు సఫలం. 4,5 తేదీల్లో దుబారా వ్యయం. అనారోగ్యం. ప్రయాణాలు. సుబ్రహణ్యాష్టకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE