– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఎంతటి వ్యక్తినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. కుటుంబసమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభాలు కలిగే సూచనలు. మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు.  రాబడి గతం కంటే కాస్త మెరుగుపడుతుంది. మిత్రులు మీకు మరింత సహకరిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఊహలు, అంచనాలు నిజం కాగలవు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ఊహించని విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు శుభవార్తలు అందుతాయి. 28,29 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. శివపంచాక్షరి పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి అనుకూల సందేశం అందుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబంలో మీపై ప్రేమాభిమానాలు పెరుగుతాయి. రాబడి సంతృప్తినిస్తుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల,  ఆత్మవిశ్వాసం పెరిగి ముందుడుగు వేస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు మరింత అందుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు కొన్ని సమస్యలు తీరతాయి, 24, 25  తేదీల్లో ఆస్తి వివాదాలు. కుటుంంబంలో సమస్యలు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ప్రారంభంలో కొన్ని సమస్యలతో సహవాసం చేస్తారు. అయితే క్రమేపీ వాటి నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయం గతం కంటే కొంత మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రుల సహాయసహకారాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి వారి నుంచి మరింత ప్రోత్సాహం. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, రచయితలకు ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. 26,27 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో వివాదాలు సమసిపోయి ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి అనుకూల వార్తలు అందుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 27,28తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములకు సంబంధించిన వివాదాలు చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. చిరకాల ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోండి. వ్యాపారస్తులు సామాన్య లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు గందరగోళ పరిస్థితి.  26,27 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమై సహకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలకు అవకాశం. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు కొన్ని దక్కవచ్చు. 29,30 తేదీల్లో వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, రచయితలకు కొత్త విషయాలు తెలుస్తాయి.  24,25 తేదీల్లో ఖర్చులు అధికం. శారీరక రుగ్మతలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఏ కార్యక్రమం చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. మిత్రుల నుంచి పిలుపు అందుతుంది. నిరుద్యోగులు ఎంతోకాలం ఎదురుచూస్తున్న అవకాశం దగ్గరకు వస్తుంది. ప్రత్యర్థులు కూడా మీపై విధేయులుగా మారతారు. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు సంతోషకరమైన సమాచారం. 25,26 తేదీల్లో దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శివాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

మీఖ్యాతి మరింత పెరుగుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలపై బంధువర్గంతో సమాలోచనలు జరుపుతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. యుక్తితో వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు కాస్త ఉపశమనం పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు దక్కే సూచనలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. 27,28 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. హనుమాన్‌ఛాలీసా పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

రావలసిన సొమ్ము అందుకుంటారు. క్రీడలు, వైజ్ఞానిక అంశాలపై ఆసక్తి చూపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.  వాక్పటిమ, నేర్పుతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు అనుకోని ఉపాధి అవకాశాలు దక్కుతాయి. స్థిరాస్తి విషయంలో అనుకూల పరిస్థితులు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు తోడవుతారు.  రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారాంతంలో దుబారా ఖర్చులు. మానసిక అశాంతి. గణేశ్స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ప్రముఖుల సలహాలు ఉపకరించి ముందుకు సాగుతారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగావకాశాలు. దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారస్తులు గతం కంటే లాభాలు మరింత దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 24,25 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. ఆదిత్య హృదయం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరీలు, సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. భూవివాదాలు కొంత పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు లభిస్తాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు లక్ష్యాలు నెరవేరతాయి. 27,28 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. ప్రయాణాలు వాయిదా. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE