– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. సోదరులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.భూములు, భవనాలు కొంటారు. ఆస్తుల విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. రాజకీయవేత్తలు, రచయితలు, కళాకారులకు మరింత అనుకూల సమయం.  15,16 తేదీలలో దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆదిత్యహృదయం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి.  కష్టపడ్డా ఫలితం దక్కనిస్థితి. విద్యార్థుల యత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. అవసరాలు పెరిగి కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. .  వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. ఉద్యోగులు మరింత శ్రమపడాల్సిన సమయం. పారిశ్రామికవేత్తలకు అనుకోని విదేశీయానం. కళాకారులు, రచయితలకు కొంత నిరాశాజనకమే. 16,17 తేదీలలో శుభకార్యాలకు హాజరు. ఆస్తి లాభం.  నృసింహస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. తండ్రి తరఫు వారితో వివాదాలు తీరతాయి. విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు.  సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి.వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు.  ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కి కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రచయితలు, కళాకారులు విశేష పేరుప్రతిష్ఠలు పొందుతారు. 19,20 తేదీల్లో అనుకోని ఖర్చులు, స్నేహితులతో విభేదాలు. శివపంచాక్షరి పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం.  ఆస్తి వివాదాలు నుంచి కొంత గట్టెక్కుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు.  దేవాలయ దర్శనాలు. ఖర్చులు పెరిగినా తట్టుకుని ముందుకు సాగుతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త విధులు సంతృప్తికరంగా ఉంటాయి. రచయితలు, క్రీడాకారులు సత్తా చాటుకుని పేరుప్రతిష్ఠలు పొందుతారు. 14,15 తేదీల్లో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు.  స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.  మీ సత్తా గ్రహించి ప్రత్యర్థులు సైతం స్నేహహస్తం అందిస్తారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పురస్కారాలు అందుతాయి. రచయితలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 18,19 తేదీల్లో్య ఖర్చులు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఊహించని వ్యక్తులతో పరిచయాలు.  కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. అవసరాలకు డబ్బు సమకూరి రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.  పరిశోధకులు, క్రీడాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 17,18 తేదీల్లో మానసిక ఆందోళన. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కార్యక్రమాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి విషయాలలో బంధువులతో వివాదాల పరిష్కారం.  రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారులవిస్తరణ యత్నాలు కలసివస్తాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు సన్మానాలు, సత్కారాలతో బిజీగా గడుపుతారు. రచయితలు, పరిశోధకులకు మరింత అనుకూల సమయం. 14,15 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. గణేశాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి. సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారమవుతాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు.  దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. . ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి.  15,16 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శివాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

విద్యార్థులు, నిరుద్యోగులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. రావలసిస డబ్బు అందుతుంది, రుణబాధలు తొలగుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందడమే కాకుండా తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పరిశోధకులు, వైద్యులకు పట్టింది బంగారమే. 17,18 తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఖర్చులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.  వాహనాలు, భూములు కొంటారు. రుణభారాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు, చికాకులు తొలగుతాయి.రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు.రచయితలు, పరిశోధకులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి.19,20 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

యత్నకార్యసిద్ధి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు విజయాలు వరిస్తాయి.  రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా సాగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రచయితలు, పరిశోధకులకు మరింత గుర్తింపు లభిస్తుంది. 15,16 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ముఖ్య కార్యక్రమాలలో విజయం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. శ్రేయోభిలాషులు సలహాలను స్వీకరిస్తారు. సమాజంలో గౌరవమర్యాలు పెరుగుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు.  వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన సమయం. ఉద్యోగులకు ఊహించని రీతిలో పదోన్నతులు లభిస్తాయి.  రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 14,15 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE