– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆరోగ్యభంగం. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు పెరుగుతాయి. నిర్ణయాలు మార్చుకుం టారు. వాహనాలు, గృహం కొనుగోలలో ప్రతి బంధకాలు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు. ఉద్యోగులు విధుల పట్ల అప్రమత్తంగా మెలగాలి. రచయితలు, క్రీడాకారులకు చికాకులు ఎదురవుతాయి. 26, 27 తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విందువినోదాలు. విష్ణుధ్యానం చేయండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం ఆశాజనకం. కార్యక్రమాలలో ప్రతి బంధకాలు తొలగి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి ఊరటలభిస్తుంది. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవేత్తలకు సంతోషకర సమాచారం. కళాకారులు, వైద్యులకు విశేష లబ్ధి. 29,30 తేదీల్లో ఊహించని ఖర్చులు. సోదరులతో అకారణంగా తగాదాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

శుభకార్యాల నిర్వహణలో మీ సలహాలు అందిస్తారు. రాబడి సంతృప్తికరం. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఎటువంటి కార్యక్రమా లైనా చకచకా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ఉద్యోగులు ఆశించిన విధంగా అవకాశాలు పొందు తారు. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహ కరంగా ఉంటుంది. 24,25 తేదీల్లో ఆరోగ్య సమ స్యలు. కుటుంబంలో ఇబ్బందులు. కనకధారా స్తోత్రం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. నిరు ద్యోగులకు ఉద్యోగలాభం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. గృహ,వాహనయోగాలు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులురావచ్చు. వైద్యులు, సాంకేతిక నిపుణుల శ్రమ కొలిక్కి వస్తుంది.25,26 తేదీలలో ఆస్తి వివాదాలు, మానసిక అశాంతి. దేవీఖడ్గమాల పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కొత్త కార్యక్రమాలు ప్రారంభించి హుషారుగా పూర్తి చేస్తారు. రాబడి అనూహ్యమైన రీతిలో పెంచు కుంటారు. ప్రముఖులతో పరిచయాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం కాగలవు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభించవచ్చు. 27,28 తేదీల్లో సోదరులతో కలహాలు. వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. అంగారక స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

రాబడి మరింత సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు పనిభారం చాలావరకూ తగ్గుతుంది. రచయితలు, క్రీడాకారులకు శ్రమ ఎట్ట కేలకు ఫలించే సమయం. 25,26 తేదీల్లో మానసిక ఆందోళన. బంధువులతో విరోధాలు. ఆంజనేయ దండకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఉత్సాహంగా అనుకున్న కార్యక్రమాలను కొలిక్కి తెస్తారు. ఆదాయానికి ఇక ఇబ్బందులు తొలగినట్టే. ఇంటాబయటా అనుకూల వాతావరణం నెలకొం టుంది. శుభకార్యాలరీత్యా కొంత ఖర్చులు ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు అవకాశాలు సాధిస్తారు. పారిశ్రామివేత్తల కృషి ఫలించే సమయం. కళాకారులు, రచయితలకు శుభవార్తలు అందుతాయి. 24,25 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. గణేశాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

రుణఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గృహనిర్మాణ యత్నాలు కార్య రూపం దాలుస్తాయి. ఒక సమాచారం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. కీడాకారులు, వైద్యులకు విదేశీ పర్యటనలు.26,27 తేదీల్లో  కుటుంబ సమస్యలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొన్ని వివాదాలు, సమస్యలు కొంత మేర పరిష్కారమవుతాయి. సమయానికి కార్యక్రమాలు పూర్తి చేసి సమర్థతను చాటుకుంటారు.  విద్యార్థులు ఫలితా లపై సంతృప్తి. ఎంతోకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న వ్యతిరేకులు కొందరు తిరిగి స్నేహహస్తం అందిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.  27,28 తేదీల్లో ఆరోగ్యం సహకరించదు. బంధువులతో తగాదాలు. దుర్గాదేవిని పూజించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు తప్పనిసరి. రచయితలు, వైద్యులు సత్తా చాటుకుంటారు. 24,25 తేదీల్లో ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

రాబడి గతం కంటే మెరుగుపడుతుంది. సన్ని హితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. గతంలోని సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు మెరుగు. ఉద్యోగు లకు చికాకులు తొలగి ఊరట. క్రీడాకారులు, వైద్యు లకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. 26,27 తేదీల్లో వృథాఖర్చులు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

రాబడి మరింత మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహి తులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు వింటారు. సమాజసేవ. వాహనయోగం. తీర్థ యాత్రలుచేస్తారు. వ్యాపారస్తులకు లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. 25,26 తేదీల్లో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. శ్రమ పెరుగుతుంది. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
Instagram