– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. రావలసిన బాకీలు అందుతాయి. కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు హోదాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. రచయితలు, క్రీడాకారుల యత్నాలలో కదలికలు. 11, 12 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు. అన్నపూర్ణదేవీ స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. వాహనయోగం. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఎదురుచూస్తున్న సొమ్ము అందుతుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. కళాకారులకు పట్టిందల్లా బంగారమే. క్రీడాకారులు, వ్యవసాయదారుల ఆశలు ఫలిస్తాయి. 13,14 తేదీల్లో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవసరాలకు లోటు లేని విధంగా సొమ్ము సమకూరుతుంది. కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుని సోదరులతో సఖ్యతగా మసలుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు ఉత్సాహవంతంగా గడుపుతారు. 10, 11 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. వ్యయ ప్రయాసలు. శివాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ముఖ్య పనుల్లో అవాంతరాలెదురైనా అధైర్యపడకుండా ముందుకు సాగండి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు ముమ్మరం చేస్తారు. ఆశలు వదులుకున్న బాకీలు సైతం అందుతాయి. వ్యాపారులకు లాభాలు. పెట్టుబడులకు తగిన సమయం. క్రీడాకారులు, రచయితలకు శుభవార్తలు. 11, 12 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

చేపట్టిన పనులు విజయవంతం. అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. సోదరులతో మంచీచెడ్డా విచారిస్తారు. వ్యాపారులు కొంత వరకూ లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడులు చాలావరకూ తగ్గవచ్చు. రాజకీయవేత్తల యత్నాలు కొలిక్కి వస్తాయి. రచయితలు, వైద్యులకు శుభవార్తలు. 13, 14 తేదీల్లో ఆరోగ్యం మందగిస్తుంది. కష్టమే మిగులుతుంది. దేవీఖడ్గమాల పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

మీపై వచ్చిన అపవాదుల నుంచి బయటపడతారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వాహన, గృహయోగాలున్నాయి. కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. 12,13 తేదీల్లో వ్యయప్రయాసలు, బంధువిరోధాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై అప్పులు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. మీ మాటలతో ఆప్తులను ఆకట్టుకుంటారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. తరచూ ప్రయాణాలు సంభవం. ఉద్యోగులు విధుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. రచయితలు, క్రీడాకారులకు సామాన్యంగా గడుస్తుంది. 13,14తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. శ్రీరామ స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

మీ నిర్ణయాలను తక్షణం అమలు చేస్తారు. కొంత సొమ్ము అనూహ్యంగా అందుకుంటారు. వ్యాపారులు కొత్త భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగులకు ఒక కీలక సమాచారం రావచ్చు. కళాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. రచయితలు, క్రీడాకారులకు హుషారుగా గడుస్తుంది. 15,16 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. శివపంచాక్షరి పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రాజకీయవేత్తలకు కీలక సమాచారం. పరిశోధకులు, వ్యవసాయదారులకు కొంత అనుకూల సమయం. 10, 11 తేదీల్లో మానసిక అశాంతి. స్నేహితులతో వైరం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

వాహనాలు, భూములు కొంటారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. సొమ్ముకు లోటు లేకుండా గడుపుతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు శుభవార్తలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు విజయం సాధిస్తారు. కళాకారులు, రచయితల దీర్ఘకాలిక నిరీక్షణ ఫలిస్తుంది. 14, 15 తేదీల్లో దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వీరికి అన్నింటా విజయాలు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు కొంతమేర తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి. రుణాలు తీరతాయి. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు అందుకోనున్నారు. ఉద్యోగులకు స్థాయి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు. 13,14 తేదీల్లో స్నేహితులతో వివాదాలు. వృథా ఖర్చులు. శ్రీరామ రక్షాస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఏ పనైనా అవలీలగా పూర్తిచేస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. మొదట్లో కొంత గందరగోళం నెలకొన్నా క్రమేపీ సర్దుకుంటుంది. మీ విజయాలకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు. వ్యాపారులకు క్రమేపీ లాభాలు. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. 15, 16 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. మనస్సు స్థిరంగా ఉండదు. గణేశ్‌ ‌స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
Instagram