సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

ముఖ్యమైన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. బంధువులు, స్నేహితులతో విభేదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆదాయం కొంత తగ్గి అప్పులు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులు, పరిశోధకులు, రాజకీయవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. 23,24 తేదీల్లో విందులు, వినోదాలు. భూలాభాలు. వాహనసౌఖ్యం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

రాబడి ఆశించినంతగా ఉంటుంది. సన్నిహితులు, సోదరుల సూచనలు పాటిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు ఆశించింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఒక కీలక సమాచారం అందుతుంది. కళాకారులు, రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. 25,26 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు, పెట్టుబడులు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులు విధుల్లో ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు విశేష ఆదరణ. 20,21 తేదీల్లో వివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. గణపతి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. రాబడి మరింత పెరుగుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కాంట్రాక్టర్లకు మరింతగా లాభసాటిగా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రచయితలు, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీయానం. 24,25 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో తగాదాలు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

కొత్త కార్యక్రమాలను చేపడతారు. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రాబడి మరింత సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రచయితలు, పారిశ్రామికవేత్తలకు సమస్యల నుంచి విముక్తి. 23,24 తేదీల్లో ఒత్తిళ్లు. మానసిక అశాంతి. కుటుంబసమస్యలు. శ్రీరారక్షాస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి తెస్తారు. వాహనాలు కొంటారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రచయితలు, కళాకారులు, రాజకీయవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. 21,22 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో కలహాలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. ఆకస్మిక ధనలబ్ధి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న కార్యక్రమాలలో విజయం. ఇంటి నిర్మాణాలు చేపడతారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులు ప్రమోషన్లు దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులు, కళాకారులకు పురస్కారాలు. 20,21 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

రాబడి మరింత పెరుగుతుంది. ముఖ్య పనులలో అవాంతరాలు తొలగుతాయి. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహపరుస్తాయి. ఉద్యోగులు సమర్థత నిరూపించుకుంటారు. రచయితలు, పరిశోధకులు, కళాకారులకు పురస్కారాలు అందుతాయి. 23,24 తేదీల్లో అనుకోని ఖర్చులు. మానసిక ఆందోళన. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

సకాలంలో వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. బ్యధువులతో సఖ్యత. తీర్థయాత్రలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు అనుకున్న హోదాలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు రాగలవు. 25,26 తేదీల్లో వృథా ఖర్చులు. సోదరులతో కలహాలు. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ధనలాభం. ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలలో పురోగతి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు మరింత గుర్తింపు లభిస్తుంది. పరిశోధకులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 21,22 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు, శారీరక రుగ్మతలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్య వ్యవహారాలలో వేగం తగ్గుతుంది. సంఘంలో పేరుప్రతిష్ఠలకు లోటు రాదు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. రాబడి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు విధుల్లో మరింత అనుకూలత ఉంటుంది.. పారిశ్రామికవేత్తలు, కళాకారులు,వైద్యులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 14,15 తేదీల్లో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సన్నిహితులు, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు కొత్త అవకాశాలు. వ్యాపారుల శ్రమ ఫలిస్తుంది, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. రచయితలు, క్రీడాకారులు, కళాకారులకు సత్కారాలు. 23,24 తేదీల్లో అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి. సుబ్రహ్యణ్యాష్టకం పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE