సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

కొత్త కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులు మరింత ఆదరణ చూపుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. . శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు మరింత ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ప్రయత్నాలు సఫలం. 17,18 తేదీల్లో ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ప్రముఖ వ్యక్తులు పరిచయాలు ఎంతో ఉపకరిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు. వ్యాపారస్తులకు మరింత లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం కొంత తగ్గుతుంది. రచయితలు, క్రీడాకారులు, కళాకారులు అంచనాలు నిజమవుతాయి. 13,14 తేదీల్లో వృథా ఖర్చులు. స్వల్ప అస్వస్థత. మానసిక అశాంతి. దత్తాత్రేయుని పూజించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆత్మీయుల ఆదరణ చూరగొంటారు. మీ కష్టం ఫలించే సమయం. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ప్రయాణాలలో మార్పులు. వాహనాలు, భూములు కొంటారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కార్యసిద్ధి. 14,15 తేదీలలో దేవాలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. ఏ బాధ్యత అప్పగించినా నేర్పుగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రచయితలు, కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరమైన కాలం. 15,16 తేదీల్లో స్వల్ప శారీరక రుగ్మతలు. ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఏ కార్యక్రమైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. కుటుంబసమస్యల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు చేస్తారు. కాంట్రాక్టర్లకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారస్తులకు అనూహ్యమైన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఊహించనిఆహ్వానాలు అందుతాయి.18,19 తేదీల్లో ఇంటాబయటా ఒత్తిడులు. దుబారా వ్యయం. ఆరోగ్య సమస్యలు. దుర్గాదేవిని పూజించండి..

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆదాయానికి లోటు రాదు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. రియల్టర్లకు మరింత సానుకూలమైన కాలం. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు హోదాలు. రచయితలు, క్రీడాకారులు, కళాకారులకు విశేష గుర్తింపు లభిస్తుంది. 17,18 తేదీల్లో అదనపు ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి. ఆదాయం కంటే ఖర్చులు పెరిగి రుణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. కుటుంబంలో చికాకులు తద్వారా మనశ్శాంతి లోపిస్తుంది. కాంట్రాక్టర్లు కొంత అసంతృప్తి చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు.  స్నేహితులతో  విభేదిస్తారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు పెరుగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారుల యత్నాలు ముందుకు సాగవు. 7,8 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. శివపంచాక్షరి పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆలోచనలు కలసిరాకున్నా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది.. నిరుద్యోగుల శ్రమ ఫలించే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వేడుకలకు హాజరై ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులకు ఆశించినరీతిలో లాభాలు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు.15,16 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి..

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. గతంలో జరిగిన లోటుపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. వ్యాపారస్తులకు మరింతగా పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు పనిఒత్తిడులు తగ్గవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. 17,18 తేదీల్లో లేనిపోని సమస్యలు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. కనకధారా స్తోత్రం పఠించండి..

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు. తరచూ ప్రయాణాలు సంభవం. నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో వివాదాలు రావచ్చు. ప్రతి విషయంలో అప్రమత్తత అవసరం.. విద్యార్థుల శ్రమ కొంతమేర ఫలిస్తుంది. ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు ఎట్టకేలకు అనుకూలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారస్తులకు లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.15,16 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సాగిస్తారు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యర్థులను కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. సమయానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. వివాహాది వేడుకల నిర్వహణకు సన్నద్ధమవుతారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. 18,19 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. గణేశాష్టకం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్య వ్యవహారాలలో వేగం తగ్గుతుంది. సంఘంలో పేరుప్రతిష్ఠలకు లోటు రాదు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. రాబడి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు విధుల్లో మరింత అనుకూలత ఉంటుంది.. పారిశ్రామికవేత్తలు, కళాకారులు,వైద్యులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 14,15 తేదీల్లో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆదాయం మరింత సమకూరి అవసరాలు తీరతాయి. కీలక సమావేశాలలో పాల్గొంటారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. కొన్ని సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు లక్ష్యాలు సాధిస్తారు.17,18 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. హనుమాన్ఛాలీసా పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE