సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

అదనపు రాబడి  లభించి అవసరాలు తీరతాయి. స్నేహితులతో కీలక విషయాలు  చర్చిస్తారు. ఆస్తి విషయంలో నెలకొన్న స్తబ్ధత తొలగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల అన్వేషణలో సఫలమవుతారు. ఉద్యోగులకు  ప్రమోషన్లు లభించవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరమైన సమయం.  6,7 తేదీల్లో మానసిక ఆందోళన. అనారోగ్య సూచనలు. దక్షిణామూర్తి స్తోతాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ఆదాయం విషయంలో సంతృప్తి చెందుతారు. ముఖ్య కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు.  విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులు అనుభవాలతో మరింతగా లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు  విధుల్లో మరింత ప్రోత్సాహం. కళాకారులకు  కీలక సమాచారం రాగలదు. రచయితల ఆశలు నెరవేరతాయి. 9,10 తేదీల్లో సోదరులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

రావలసిన సొమ్ము అంది ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో గౌరవం మరింత పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారులు భాగస్వాములతో అంగీకారానికి వస్తారు. లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలు ఊహించని అవకాశాలు సాధిస్తారు. పరిశోధకులు, వైద్యుల నైపుణ్యం వెలుగు చూస్తుంది. 11,12 తేదీల్లో  దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. ఆదాయానికి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు లాభాలతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగస్తులు  సత్తా చాటుకునే సమయం. రాజకీయవేత్తలకు  నూతనోత్సాహం. 7,8 తేదీల్లో  అనుకోని ఖర్చులు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. స్నేహితులు, బంధువులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తుల విషయంలో చిక్కులు వీడతాయి. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల యత్నాలు ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు అంచనాలు ఫలిస్తాయి. రాజకీయవేత్తలు పదవులు పొందే సూచనలు. క్రీడాకారులు, పరిశోధకులకు మరింత ఉత్సాహం .6,7 తేదీల్లో ఆప్తులతో కలహాలు. శ్రమాధిక్యం. గణేశాష్టకం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కాంట్రాక్టులు లభిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు ఆశించినమేర లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు   హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. క్రీడాకారులు, వైద్యులు లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. 10,11  తేదీల్లో  ఖర్చులు అధికం. మానసిక ఆందోళన. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం కంటే ఖర్చులు పెరిగి రుణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. కుటుంబంలో చికాకులు తద్వారా మనశ్శాంతి లోపిస్తుంది. కాంట్రాక్టర్లు కొంత అసంతృప్తి చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు.  స్నేహితులతో  విభేదిస్తారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు పెరుగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారుల యత్నాలు ముందుకు సాగవు. 7,8 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. శివపంచాక్షరి పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. విచిత్రమైన సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో మరింత ఉత్సాహంతో గడుపుతారు. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. కళాకారులు, పరిశోధకులకు  కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.  11,12 తేదీల్లో  వృథా  ఖర్చులు. అనారోగ్య సూచనలు. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త వ్యక్తులతో పరిచయాలు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో  పూర్తి కాగలవు.స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాక్చాతుర్యంతో కుటుంబసభ్యులను మెప్పిస్తారు. రాబడి కోసం ఇబ్బందులు తొలగుతాయి. గృహయోగం. నిరుద్యోగులకు  అనుకూల సమాచారం. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు.  ఉద్యోగులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు దక్కుతాయి. రచయితలు, వైద్యుల ఆశలు నెరవేరతాయి. 7,8 తేదీల్లో  స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్థిరాస్తి విషయంలో సమస్యలు, చికాకులు తొలగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు.  ముఖ్య నిర్ణయాలు తీసుకుని బంధువులను ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు.  ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా సాగుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. క్రీడాకారులకు శుభవార్తలు.  10,11 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. పనిఒత్తిడులు. ఖర్చులు. విష్ణుధ్యానం చేయండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

నూతన కార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. ఆదాయం గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ప్రముఖులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు లాభాలు దక్కి ఉత్సాహంగా అడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తలకు శుభవార్తలు.  రచయితలు, క్రీడాకారుల అంచనాలు ఫలిస్తాయి. 9,10 తేదీలలో మానసిక అశాంతి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆదిత్య హృదయం పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడికి లోటు రాదు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కి లబ్ధి పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.   పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు ఆశించిన లక్ష్యాల మేరకు లాభం పొందుతారు. భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులు ఊహించని హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు  కొత్త ఆశలు చిగురిస్తాయి.  8,9 తేదీల్లో సోదరులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE