సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యవహారాలు  విజయవంతంగా కొనసాగుతాయి. కుటుంబసభ్యులు మీపై కొత్త బాధ్యతలు ఉంచుతారు. విద్యార్థులు నైపుణ్యతను చాటుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు.  సోదరులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. చిత్రవిచిత్రమైన విషయాలు తెలుస్తాయి. వివాహాది వేడుకులు నిర్వహిస్తారు.  వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు రాగలవు. రచయితలు, పారిశ్రామికవేత్తలు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. 30,31 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యం సహకరించదు. మానసిక ఆందోళన. సుబ్రణ్యేశ్వరుని పూజించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

పరపతి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి  బయటపడతారు.  విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త ఆలోచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపారస్తులు కోరుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. వ్యవసాయదారులు, క్రీడాకారులకు మరింత అనుకూల కాలం. 31,1 తేదీల్లో  ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తులు, వ్యాపారాలలో చిక్కులు. గణపతి ఆరాదన మంచిది.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్య వ్యవహారాలు  నెమ్మదిగా కొనసాగుతాయి. నూతన ఉద్యోగాల అన్వేషణలో జాప్యం. ఆదాయం కొంత తగ్గి ఇబ్బంది పడతారు. బంధువులు, స్నేహితులతో అకారణంగా తగాదాలు. కాంట్రాక్టులు తుది క్షణంలో చేజారవచ్చు. తరచూ ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన సమయం. కుటుంబబాధ్యతలు పరీక్షగా మారవచ్చు.   వ్యాపారస్తులకు కొంతమేరకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు జరుగవచ్చు. రచయితలు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా 1,2 తేదీల్లో  శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. విందువినోదాలు.. శ్రీకాలభైరవాష్టకం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

ఆదాయం తగినంతగా లభించి అవసరాలు తీరతాయి. కొన్ని సమస్యలు  తెలివిగా పరిష్కరించుకుంటారు. మీ భావాలను అందరితో పంచుకుంటారు. వివాహయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఇంటి నిర్మాణాలు ముమ్మరం చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వ్యాపారులకు సమస్థాయిలో లాబాలు దక్కుతాయి. ఉద్యోగస్తులు మార్పులను చూడాల్సి వస్తుంది. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. 4,5 తేదీల్లో ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించండి.  విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణాలు. శివాష్టకం పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

చిరపరిచితులు మీకు చేదోడుగా నిలుస్తారు. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ప్రముఖులతో చర్చలు సాగిస్తారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. నూతన ఉద్యోగావకాశాలు దక్కవచ్చు.  రాబడి మరింత అనుకూలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారస్తులకు అనుకోని పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులు మంచి గుర్తింపు పొందుతారు. ర చయితలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు విజయాలు సాధిస్తారు. 30,31 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన.. శ్రమాధిక్యం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు  జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆదాయం విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వివాహాది వేడుకలకు హాజరవుతారు. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు మంచి గుర్తింపు పొందుతారు.  2,3 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. కుటుంబంలో ఇబ్బందులు. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

చేపట్టిన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.  విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని ఆశయాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు.  వ్యాపారస్తులు అనుకున్న విధంగా లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 1,2 తేదీల్లో ధననష్టం. చోరభయం. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. నిర్ణయాలు సైతం అందర్నీ ఆకర్షిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలించే సమయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వ్యాపారస్తులు కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రచయితలు, రాజకీయవేత్తలు, కళాకారులు ఉత్సాహవంతంగా గడుపుతారు. 30,1 తేదీల్లో  స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు సంభవం. దుర్గా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఎంతటి సమస్య  ఎదురైనా ధైర్యం వీడరు.  వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. తరచూ ప్రయాణాలు ఉండవచ్చు. బంధువులతో విభేదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు.  వాహనయోగం. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు మరింత ప్రోత్సాహం. కళాకారులు,  క్రీడాకారులు విదేశీ పర్యటనలు జరుపుతారు. 1,2 తేదీల్లో కొంత మేర చికాకులు. అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి..

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్య  వ్యవహారాలు  స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు.  అదనపు రాబడి కొంత ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబసభ్యులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగయత్నాలలో విజయం సాధిస్తారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారస్తులు మరింత శ్రద్ధ వహిస్తే లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవేత్తలు, రచయితల సేవలు గుర్తింపులోకి వస్తాయి.2,3 తేదీల్లో చోరభయం. మానసిక అశాంతి. కుటుంబ  సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆదాయం సమకూరినా అవసరాల నిమిత్తం అప్పులు కూడా చేస్తారు. బంధువులు, స్నేహితులతో కొన్ని వివాదాలు తీరతాయి.  విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మరింత వేగవంతంగా కాగలవు. పరిస్థితులను కొంత అనుకూలంగా మార్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు.  వ్యాపారస్తుల యత్నాలు సఫలం. ఉద్యోగస్తులకు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ప్రతిభ చాటుకుంటారు. 4,5 తేదీల్లో  మానసిక అశాంతి. చోరభయం. కుటుంబంలో చిక్కులు.  శ్రీరామ స్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆదాయం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. వ్యాపారస్తులు మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటుపోట్లు అధిగమిస్తారు. రచయితలు, కళాకారులు, క్రీడాకారులు ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. 30,31 తేదీల్లో దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. మానసిక అశాంతి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.యప్రయాసలు. బంధువిరోధాలు. కుటుంబంలో ఇబ్బందులు. ఆంజనేయ దండకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE