సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

వ్యయప్రయాసలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. బంధువులు, స్నేహితులతో  స్వల్ప వివాదాలు నెలకొంటాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టండి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. కళాకారులు, రచయితలకు నిరుత్సాహం.   25,26 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగప్రాప్తి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. సమాజంలో ఆదరణ  పెరుగుతుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. బంధువులు, మిత్రులతో విభే దాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితుల  నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. క్రీడాకారులు, వైద్యులకు మరింత వెసులుబాట్లు కలుగుతాయి. 28,29 తేదీల్లో అనారోగ్యం. శ్రమాధిక్యం. ఇంటాబయటా సమస్యలు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు మరింత ఉత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. రచయితలు, సాంకేతికవర్గాల యత్నాలు సఫలం. 23,24 తేదీల్లో అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శివపంచాక్షరి పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మరింత  గౌరవమర్యాదలు పొందుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువులు సహకరిస్తారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై కొంత లాభపడతారు.  ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. కళాకారులు,క్రీడాకారులకు ఒత్తిడులు తగ్గుతాయి. 27,28 తేదీల్లో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు.  గణేశాష్టకం పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు  చకచకా పూర్తి చేస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి తెస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. రచయితల ఆశయాలు నెరవేరతాయి.  27,28 తేదీల్లో వస్తులాభాలు. నూతన పరిచయాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దేవీస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులు పరిచయమై సహకారం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం.  సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహం. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు  ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. రచయితలు క్రీడాకారులకు శుభవార్తలు. 24,25తేదీల్లో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. ధనవ్యయం. ఆరోగ్యభంగం.  శ్రీనృసింహధ్యానం చేయండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం కొంత నిరుత్సాహపరుస్తుంది. అయితే అవసరాలకు ఇబ్బందులు ఉండవు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. శుభకార్యాలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.్య ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు జతచేరతారు. ఉద్యోగులు మార్పులకు సిద్ధంగా ఉండాలి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం. 5,6 తేదీల్లో సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో సంతోషకరంగా గడుపుతారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. వైద్య, కళారంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది.  23,24 తేదీల్లో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. పంచాక్షరి పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేరుకుంటాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. క్రీడాకారులు,రచయితల శ్రమ ఫలిస్తుంది. 25,26 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. మానసిక ఆందోళన. విష్ణుధ్యానం చేయండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

కొత్త  కార్యక్రమాలకు  శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఒక ఆహ్వానం మరింత ఉత్సాహాన్నిస్తుంది. , కుటుంబంలోనూ మీరంటే మరింత ఇష్టపడతారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో  కొత్త అవకాశాలు రావచ్చు. .క్రీడాకారులు,  కళారంగం వారికి పురస్కారాలు దక్కుతాయి. 26,27 తేదీల్లో  స్నేహితులతో తగాదాలు. అంచనాలలో పొరపాట్లు.  శ్రమ పెరుగుతుంది.  కనకధారాస్తోత్రం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కొందరు స్నేహితులను  కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. వైద్యులు, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 24,25 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. కష్టపడ్డా ఫలితం కనిపించదు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

మీ అంచనాలు నిజం చేసుకుంటారు.కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులకు ఒత్తిడులు తగ్గుతాయి.  26,27 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. బంధువిరోధాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE