సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. ప్రముఖుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటుపై దృష్టి పెడతారు. రచయితలు, క్రీడాకారులు ఆశయాలను నెరవేర్చుకుంటారు. 27,28తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. శివాష్టకం పఠించండి
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఎంతోకాలంగా సవాలుగా మారిన కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రాబడి గతంతో పోలిస్తే మరింత మెరుగుపడుతుంది. ఆశ్చర్యకర సంఘటనలు ఎదురుకావచ్చు. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుని ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సంఘసేవలో పాల్గొంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. వ్యాపారరంగం వారు తమ సంస్థల విస్తృతికి మరిన్ని చర్యలు చేపడతారు. ఉద్యోగస్తులు మరింత సంతోషదాయకంగా గడుపుతారు. కళాకారులకు అవకాశాలు ఊహించనిరీతిలో లభిస్తాయి. రచయితలు, శాస్త్రవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. 28,29 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బ్యాధ్యతలు పెరుగుతాయి. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని వివాదాలు నెలకొన్నా మీ సమర్థతతో పరిష్కరించుకుంటారు. ఏ కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సందేశం అందుతుంది. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కొన్ని విషయాలలో అంచనాలు నిజం చేసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. సంఘసేవలో భాగస్వాములవుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. కీలక వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారస్తులు భాగస్వాముల నుండి సహాయం స్వీకరిస్తారు. ఉద్యోగులు విధుల్లో తమ సత్తాను చాటుకుంటారు. రాజకీయవేత్తలు సంతోషకరంగా గడుపుతారు. రచయితలు, కళాకారులు కొన్ని అవకాశాలు సాధిస్తారు. 30,1 తేదీల్లో దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్య సూచనలు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏ కార్యక్రమమైనా చేపట్టేముందుకు యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. ఆలోచనలు అమలులో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొని కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. తరచూ ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మీదపడే అవకాశం. పారిశ్రామికవేత్తలు ఒడిదుడుకుల మధ్య గడుపుతారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలు అనుకున్న అవకాశాలు పొందలేక నిరుత్సాహపడతారు. 29,30 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీరంటే వ్యతిరేకులు కూడా ఇష్టపడతారు. ఆదాయం ఆశించిన విధంగా సమకూరుతుంది. కొత్త ఉద్యోగయత్నాలు ఫలించే సమయం. సోదరులతో సత్సంబ్యధాలు నెలకొంటాయి. ఎటువంటి సమస్య ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు విస్తరణ యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు ఒక సంతోషకర సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు తమ కృషితో మరింత వృద్ధి చెందుతారు. పరిశోధకులు, వైద్యరంగం వారికి మరింత గుర్తింపు లభిస్తుంది. 2,3 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. శివాష్టకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ప్రారంభంలో కొన్ని వివాదాలు నెలకొని సవాలుగా మారవచ్చు. అయినా మనోనిబ్బరంతో వాటిని పరిష్కరించుకుంటారు. రాబడి గతం కంటే మరింత అనుకూలించి ఖర్చులు అధిగమిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారస్తులు మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయవేత్తలు యుక్తితో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కళాకారులు, క్రీడాకారులు ఊహించని విధంగా కొన్ని అవకాశాలు దక్కించుకుంటారు. 27,28 తేదీల్లో ధన వ్యయం. కుటుంబంలో సమస్యలు. దేవీస్తుతి మంచిది.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఎంతటి కార్యక్రమమైనా దీక్షగా పూర్తి చేస్తారు. బంధువులతో సత్సబంధాలు నెలకొంటాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు సహాయపడాలని ముందుకు వస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపారులు లాభాల దిశగా పయనిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 1,2 తేదీల్లో దూరప్రయాణాలు. ఆస్తులపై వివాదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కార్యక్రమాలను చకచకా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కుటుంబబాధ్యతలు సమర్థనంతంగా నిర్వహిస్తారు. మీ ఓర్పు సమస్యల పరిష్కారంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎవరినీ నొప్పించకుండా మీ లక్ష్యాలను సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు మరింతగా పెట్టుబడులు పొందుతారు. ఉద్యోగులు వ్యిధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. రచయితలు, క్రీడాకారులు ఆహ్వానాలు అందుకుంటారు. 30,1తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. నవగ్రహస్తోత్రాలు పఠించండి
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సమావేశాల్లో పాల్గొని మీ అభిప్రాయాలను తెలియజేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడి అనూహ్యంగా దక్కుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలలో పురోగతి. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలు తమ సత్తా చాటుకుని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. శాస్త్రవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 28,29 తేదీల్లో అనారోగ్యం. దూరప్రయాణాలు. కుజగ్రహస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణవిముక్తి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ప్రస్తుతం పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు కొన్ని విషయాలలో రాజీమార్గం అనుసరిస్తారు. పరిశోధకులు, టెక్నాలజీ రంగం వారికి చెప్పుకోతగిన ప్రగతి కనిపిస్తుంది. 28,29 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. సోదరులు,, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో మీకంటూ మరింత గౌరవం లభిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులు చేయూతనిస్తారు. ఒక ఆహ్వానం అంది ఉత్సాహంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు కొన్ని హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు ప్రతిభను చాటుకుంటారు. కళాకారులు శాస్త్రవేత్తలు మంచి గుర్తింపు పొందుతారు. 30,1 తేదీల్లో ధనవ్యయం. మానసిక ఆందోళన. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
చాకచక్యంగా వ్యవహరించి వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. విద్యార్థులకు భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. సంఘంలో గౌరవానికి లోటు రాదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సహచరుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారులు అనూహ్యమైన రీతిలో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు సంతోషకర సమాచారం రావచ్చు. రాజకీయవేత్తలు కొత్త పదవులు దక్కించుకుంటారు. వైద్య, సాంకేతిక రంగాల వారు మరిన్ని అవకాశాలు పొందుతారు. 2,3 తేదీల్లో వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.