భారతదేశంలో ఐటీ దిగ్గజంగా పేరు గాంచిన టీసీఎస్‌ ‌నాసిక్‌ ‌క్యాంపస్‌లో మత శక్తులు పన్నిన కుట్రలు దేశంలో సంచలనం రేపాయి. ఈ క్యాంపస్‌లో కొంతమంది సిబ్బంది మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని లైంగికంగా వేధించడమే కాకుండా మత మార్పిడులకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలపై కొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంతో యావత్‌ ‌దేశం కలవరపడింది. కేవలం మహిళలనే కాకుండా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ పురుష సిబ్బందిని కూడా వేధించినట్టు వార్తలున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలకు కాపాడాల్సిన హెచ్‌ఆర్‌ ‌మేనేజర్‌ ‌సహా ఏడుగురు ఉద్యోగులను ఈ కుట్రలో భాగస్వాములుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి విచారణకు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసింది.

మహిళా ఉద్యోగులను నయానా భయానా లొంగదీసుకొని అనంతరం వారిని మచ్చిక చేసుకున్న కొందరు ఉద్యోగులు లైంగిక వేధింపులతో పాటు మత మార్పిడులకు ప్రోత్సాహించారు. 2022 నుండి 2026 వరకు నాలుగేళ్లుగా ఈ ప్రముఖ కంపెనీలో ఇలాంటి ఘటనలు జరుగుతుండగా ఇటీవల కొందరు మహిళలు ధైర్యంతో ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో ఇక్కడి దుర్మార్గాలు వెలుగు చూశాయి. లైంగికంగా వేధిస్తూ మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చినట్టు 8 మంది మహిళలతో పాటు హిందూ ధర్మాన్ని అవమానించారని మరో వ్యక్తి కూడా చెప్పడంతో మొత్తం మీద 9 ఫిర్యాదులపై స్థానిక పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.

దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలమానంలో అన్ని రంగాల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు జరుగుతున్న వార్తలు తరచూ భయటపడుతున్నా టీసీఎస్‌ ‌ఘటనలో మరింత బయంకరమైన అంశాలు వెలుగుచూశాయి. ఇక్కడ మహిళా సిబ్బందిని లైంగికంగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా లవ్‌ ‌జిహాద్‌ ‌లక్ష్యంగా మతం మారాలనే ఒత్తిడి తెచ్చి వేధించారు. విచారణ చేపట్టిన పోలీసులు కంపెనీ హెచ్‌ఆర్‌ ‌మేనేజర్‌ ‌నిదాఖాన్‌తో పాటు అసిఫ్‌ అన్సారీ, షఫీ షేక్‌, ‌షారుఖ్‌ ‌ఖురేషి, రజా మేమన్‌, ‌తౌసిఫ్‌ అత్తర్‌, ‌డానిష్‌ ‌షెక్‌లను అరెస్టు చేశారు. మరికొందరు ఉద్యోగులు పరారీలో ఉన్నారు. పారిపోయిన ఉద్యోగుల్లో ఒక మహిళా ఉద్యోగి కూడా ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరందరూ హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకొని సంస్థలో కుట్రలు పన్నారనేది బహిరంగ రహస్యం. అనుచితంగా తాకడం, అసభ్యకరంగా మాట్లాడడం, బాడీ షేమింగ్‌ ‌చేయడం, ఇష్టంలేకపోయినా మాంసాహారం బీఫ్‌ ‌తినాలని ఒత్తిడి తేవడం, హిందూదేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. వీరిపై బాధిత మహిళలు హెచ్‌ఆర్‌ ‌డిపార్ట్‌మెంట్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోక పోవడంతో ఈ దుష్టశక్తులు మరింత రెచ్చిపోయాయి. వేధిస్తున్న వారిని చూసీ చూడనట్టు వదిలేయాలని, వారితో సన్నిహితంగా ఉండాలని, లేకపోతే వారితో మరిన్ని సమస్యలొస్తాయని హెచ్‌ఆర్‌ అధికారులు ఉద్యోగులకు ఉచిత సలహా లిస్తూ ఇలాంటి ఘట నలను ప్రోత్సాహించారు. మరోవైపు నిందితుల్లో కొందరు టీమ్‌ ‌లీడర్లుగా ఉండడంతో విధుల్లో ఇబ్బందులో కలిగిస్తారేమోనని బాధితులు మౌనం దాల్చారు. ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన హెచ్‌ఆర్‌ ‌విభాగాధిపతే కుట్రలో భాగస్వామ్యం కావడంతో బాధితుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. చివరికి ఒక మహిళా ఉద్యోగి తనను పెళ్లి పేరుతో మోసం చేశారని ఒకరిపై ఫిర్యాదు చేయడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది.

నాసిక్‌ ‌టీసీఎస్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఘటనలను పోలీసులు సినిమా ఫక్కీలో బట్టబయలు చేశారు. క్యాంపస్‌లో అరాచకాలపై మహిళా ఉద్యోగులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కోవర్ట్ ఆపరేషన్‌ ‌చేపట్టారు. ఏడుగురు మహిళా పోలీసులు మారువేషంలో పనిమనిషుల్లా విధులు నిర్వహిస్తున్నట్టు నటించారు. వారు టీఎసీఎస్‌ ‌క్యాంపస్‌లో ఒక వ్యక్తి ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో రెడ్‌ ‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో మిగిలిన వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను, వాట్సప్‌ ‌సమాచారాన్ని పరిశీలించి చర్యలు తీసుకున్నారు. మార్చి నెలలో ఓ మహిళా ఉద్యోగి పెళ్లి పేరుతో తనను శారీరకంగా లొంగదీసు కున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కోవర్ట్ ఆపరేషన్‌ ‌చేపట్టడంతో సంస్థలో పలు దారుణాలు వెలుగులోకివచ్చాయి. లోతైన దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఇది కేవలం వ్యక్తిగత నేరం కాదని వ్యవస్థీకృత వేధింపులని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్‌ ‌లోతైన దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేస్తూ ఆదేశించడంతో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకా శాలున్నాయి.

వైట్‌కాలర్‌ ఉద్యోగులుగా చెలామణి అయ్యే సాఫ్ట్‌వేర్‌ ‌సంస్థలో సహచర పైశాచిక ఉద్యోగుల అనాగరికమైన చర్యలకు బలైన ఒకరైన ఎస్సీ మహిళ తొలుత ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది. దనిష్‌ అనే ఉద్యోగి 2022లో ఆ మహిళతో పరిచయం పెంచుకొని కంపెనీలో ఉన్నత స్థానం కల్పిస్తానని బూటకపు మాటలతో నమ్మించి సన్నిహితంగా మెలుగుతూ లైంగికంగా వేధిస్తూ పెళ్లి పేరుతో ఆమెను మోస గించాడు. ఒకే కార్యాలయంలో పనిచేస్తుండడంతో భోజన సమయంలో, ఇతర సమయాల్లో దనిష్‌తో పాటు మరో సహచర ఉద్యోగి తౌషిఫ్‌ ‌హిందూ ధర్మం, ఇస్లాం మతం గురించి తరచూ చర్చిస్తూ తమ మతం హిందూ ధర్మం కంటే గొప్పదని చెబుతుండేవాడు. దీనిపై ఆమె అయిష్టత వ్యక్తం చేసినా వదిలిపెట్టేవారు కారు. ఈ చర్చల్లో సనాతన ధర్మాన్ని ఆవహేళన చేస్తూ శివలింగం రూపం గురించి అసభ్యంగా మాట్లాడేవారు. ద్రౌపదికి ఐదుగురు భర్తలు అని, శ్రీకృష్ణుడు స్త్రీలోలుడని అవమానించేవాడని ఆమె పేర్కొంది. వారు ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా బ్లాక్‌మెయిల్‌ ‌చేశారు. వీరికి హెచ్‌ఆర్‌ ‌నిదాఖాన్‌ ‌కూడా తోడై హిందూదేవుళ్లపై అవ మానంగా మాట్లాడేవాడు. ఈ మహిళ ధైర్యంగా వీరి ఆగడాలను బట్టబయలు చేయడంతో ఆమె స్ఫూర్తితో ఇతర బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాసిక్‌ ‌మత మార్పిళ్లలో మలేషియా లింక్‌ ‌కనిపించడం ఆందోళనకరం. మలేషియాలో ఒక ఇస్లాం మత ప్రచారకుడితో వీరికి సంబంధాలున్నట్లు విచారణలో బయటపడడంతో పోలీసులు విస్తు పోయారు. ఈ పరిణామాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే వీరి వెనుక అంతర్జాతీయ ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌కుట్రలున్నట్టు అనుమానాలున్నాయి.

విచారణలో జిహాదీల కుట్రలు ఒక్కొక్కటి వెలుగు చూస్తుండడంతో భారత సమాజం విస్తు పోయింది. మహిళలతో పాటు మరొక వ్యక్తి సనాతన ధర్మంపై కార్యాలయంలో ఒక బృందం చేస్తున్న దాడులను, తనను, తన భార్యను అవమానించిన తీరు గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీసీఎస్‌ ‌సంస్థలో మత ఛాందసవాదుల ఆగడాలపై హెచ్‌ఆర్‌ అధికారులకు సిబ్బంది మెయిల్‌ ‌ద్వారా ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని పలువురు తెలిపారు. ఈ ఘటనలపై టీసీఎస్‌ అధికారులు స్పందిస్తూ సీనియర్‌ అధికారుల నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. వాస్తవాలను నిర్థారించడంతో పాటు బాధ్యులను గుర్తించడం, బాధితులను అండగా ఉండడం కోసం చర్యలు తీసుకుంది. కంపెనీలో ‘జీరో టాలరెన్స్’-ఏ ‌మాత్రం ఉపేక్షించని విధానానికి చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ ప్రకటించింది.

అమరావతిలో 180 మంది బాలికలపై లైంగిక వేధింపులు

టీసీఎస్‌ ‌సంస్థలో మతమార్పిడి కుట్రలు దేశంలో సంచలనం రేపిన సమయంలోనే మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో 19 ఏళ్ల మహ్మద్‌ అయాన్‌ అలియాస్‌ ‌తన్వీర్‌ అనే యువకుడు 180 మంది బాలికలను లైంగికంగా వేధించి వారికి సంబంధించిన 350కు పైగా అశ్లీల వీడియోలను తీసిన భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఈ ప్రబుద్ధుడు మిత్రులతో పందెం కాసి అమ్మాయి లను ట్రాప్‌ ‌చేసి వీడియోలు రికార్డు చేసినట్టు విచారణలో తేలింది. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన ఈ నిందితుడికి మజ్లిస్‌ ‌పార్టీతో సంబంధా లున్నాయి. అమరావతిలో ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మజ్లీస్‌ ‌వెనుక తన్వీర్‌ ‌హస్తం కూడా ఉంది. అతడు పార్టీ సోషల్‌ ‌మీడియా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశాడు. నాసిక్‌, అమరావతి లైంగిక వేధింపుల ఘటనలు మన దేశంలో ప్రమాదకర శక్తుల పాత్రను తెలియజేస్తున్నాయి.

నాసిక్‌ ‌టీసీఎస్‌, అమరావతి ఘటనలను మన దేశంలోని కుహనా మేధావులు, సెక్యులరిస్టులు కొట్టిపారేస్తూ యువత పరస్పరం అవగాహనతో ప్రేమించుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం సర్వ సాధారణమని ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తు న్నారు. ఈ రోజుల్లో చాలాచోట్ల లైంగిక వేధింపులు, మహిళల పట్ల వివక్ష ఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలను సమాజానికి మచ్చగానే చూడాలని, వీటిని మత కోణంలో చూడకూడదని చెబుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన తీవ్రమైన అంశం ఏమిటంటే ఒక మత పైశాచిక ముఠా మరో సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడమే కాకుండా వారి ధర్మాన్ని అవహేళన చేయడం తగదు. సనాతన ధర్మాన్ని అవమాన పరుస్తూ, ఇస్లాం మతం గొప్పదని ప్రలోభాలకు గురి చేయడం మత కోణం కాదా? హిందూ దేవతలపై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేయడం మత జాఢ్యం కాదా..? నాసిక్‌ ‌టీసీఎస్‌ ‌క్యాంపస్‌లో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇస్లాం మతమౌఢ్యులు ప్రత్యేకంగా ఒక వాట్సప్‌ ‌గ్రూపు నిర్వహించుకుంటూ తరచూ సమాచారాన్ని చేరవేసుకోవడమే కాకుండా వారి లక్ష్యాలను నిర్ధే శించుకునే వారు. దేశంలో బుజ్జగింపు రాజ కీయాలకు పాల్పడే రాజకీయ పార్టీలు, కుహనా మేధావులు లవ్‌జిహాద్‌ అనే మాట అంటే మండి పడుతారు. ప్రేమకు కులం, మతం ఉండదని, ప్రేమించడం వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వాతంత్య్రం, చట్టబద్ధ హక్కులని వాదిస్తుంటారు. స్వేచ్ఛ అంటే ఇతర మతాలను, హైందవ ధర్మాన్ని కించపరచడమేనా? ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక బద్దంగా చేసిన ఈ ఘటనలన్నింటినీ జాతీయవాదులు చేస్తున్న అసత్య ప్రచారాలుగా కుహనా సెక్యులరిస్టులు సమర్థిస్తారా? లేదా బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడిన వీరు హిందూ ప్రజలకు మనో భావాలే ఉండవని భావిస్తూ, ముస్లిం మనోభావాలను పరిరక్షిస్తూ షరా మామూలుగానే ఈ ఘటన లన్నింటినీ జాతీయవాదులే సృష్టించారని ఆరోపిస్తూ చేతులు దులుపుకుంటారు.

లవ్‌ ‌జిహాద్‌ ‌పేరుతో దేశంలో హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ఇటీవల పరిపాటిగా మారింది. ప్రేమ పేరుతో ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడులు చేయిస్తున్న కేసులు దేశంలో తరచూ కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా భారత చట్టాల్లో లవ్‌ ‌జిహాద్‌ ‌పదం లేదు కాబట్టి అధికారికంగా ఆ పేరిట కేసులు నమోదు కావు. దేశంలో గత కొంతకాలంగా ఇదే తరహా ఘటనల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే ప్రలోభాలతో మతమార్పిడి ఘటనలు భారీగానే కనిపిస్తున్నాయి.

లవ్‌ ‌జిహాద్‌ ‌వంటి మత మార్పిడులకు సంబంధించి మధ్యప్రదేశ్‌లో 2020 నుండి 2025 మధ్య సుమారు 250కు పైగా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో దీనికి వ్యతిరేకంగా 2020లో ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చిన తర్వాత 400కు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కూడా భారీ సంఖ్యలో ఇలాంటి కేసులున్నాయి. ఈ గణాంకాలు సమాజంలో ఉన్న మతమౌఢ్యం ప్రమాదకరం తీవ్రతను తెలియజేస్తున్నాయి. దేశంలో ప్రేమ పేరుతో మోసం చేస్తున్న లవ్‌ ‌జిహాదీలను అరికట్టేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా చట్టాలు చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో 2020లో, మధ్యప్రదేశ్‌లో 2021లో, గుజరాత్‌లో, కర్ణాటకలో 2021లో ప్రత్యేక చట్టం చేశారు. ఈ చట్టాల ప్రకారం బలవం తపు లేదా మోసం ద్వారా మత మార్పిడి చేయడం నేరం. నేరం నిరూపిమైతే 3 నుండి 10 సంవత్సరాల వరకు శిక్షలుంటాయి. ఇలాంటి చట్టాలను అన్ని రాష్ట్రాలు చేసి కఠినంగా వ్యవహరించాలి. ఆలస్య మైనా నాసిక్‌ ‌టీసీఎస్‌ ‌బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి యావత్‌ ‌దేశాన్ని జాగృతం చేయడం అభినంద నీయం. ప్రధానంగా యువత ప్రలోభాలకు గురికాకుండా దేశ జాతీయత కోసం కట్టుబడడంతో పాటు సనాతాన ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యక తను ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి.

శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE