వక్రీకరించిన కథనాలను సరిదిద్దాలని డాక్టర్ మోహన్ భాగవత్ సమాజానికి విజ్ఞప్తి
“విశ్వ సృష్టితోనే మాతృత్వం ప్రారంభమైంది. ఇది అత్యంత శాశ్వతమైనది, ప్రకృతి సహజమైన ప్రవృత్తి. సృష్టి ఆవిర్భవించినప్పటి నుండి విస్తరిస్తూనే ఉన్నప్పటికీ, మాతృత్వం లేకుండా సృష్టి ప్రక్రియ ముందుకు సాగదు,” అని ఆరఎసఎస్ సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. సృష్టికి, పోషణకు, మానవ మనుగడ కొనసాగింపు నకు మాతృత్వమే ప్రాథమిక ఆధారమని అభివర్ణిస్తూ, అది నాగరికతకు పునాదిగా నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
జూలై 26న భాగ్యనగర్‌లో విశ్వమాంగళ్య సభ నిర్వహించిన రెండు రోజుల దక్షిణ భారత్ ప్రబోధన్ సమావేశంలో ముగింపు ప్రసంగం చేస్తూ డాక్టర్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సేవాలాల్ బంజారా భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన దక్షిణ భారతదేశం నలుమూలల నుండి వచ్చిన మహిళా ప్రతినిధులు, తల్లులు, ప్రతినిధులను ఉద్దేశించి ప్రసం గించారు.
ఏ విషయం గురించి మాట్లాడినా అనుభవం కన్నా గొప్ప బలం మరొకటి లేదని ఆయన వ్యాఖ్యా నించారు. మనది ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకటి కనుక, మన దేశంలో మాతృత్వం కూడా అంతే ప్రాచీనమైనది. తల్లులకు యుగాల అనుభవం ఉంది. అందువల్ల, అంతటి అపారమైన అనుభవం ఉన్న తల్లుల గురించి మాట్లాడమని తనను అడగడం, తనను పరీక్షించడం కంటే తక్కువ ఏమీ కాదని ఆయన చమత్కరించారు. అయితే, గత అనేక శతాబ్దాలుగా మన దేశం విదేశీ పాలకుల ఆధిపత్యంలోనే ఉండిపోయిందని ఆయన అన్నారు. విదేశీ సంస్కృతుల ప్రభావం మన సంస్కృతిలోనే కాకుండా మన దైనందిన జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులను తీసుకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో, మనందరికీ “యుగానుకూల/ సమకాలీన మాతృత్వం” గురించి చర్చించుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.
మాతృత్వానికి సంబంధించి తల్లులకు ఎన్నో యుగాల అనుభవం ఉంటుందని ఆయన అన్నారు. అందువల్ల, మాతృత్వం గురించి వారికి ఎక్కువగా బోధించాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ దానిపై చర్చించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. పరిస్థితులు, వాతావరణం మారాయని, అటువంటి మార్పు ఒక సహజమైన, నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. ఈ మార్పులన్నిటి మధ్య కూడా, తల్లులు మన శాశ్వత విలువల ఆధారంగా తమ పిల్లలను పెంచి పోషిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాతృత్వం గురించి చర్చిస్తున్నారని, అయితే ఈ ప్రశ్న ఎందుకు తలెత్తిందో విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సాధారణంగా, దేశంలో ఒకేసారి ఐదుతరాల వారు ఉండేవారు. మొదటి మూడు తరాల వారి వద్ద తాము ఇటువంటిది ఎప్పుడూ చూడలేదన్న భావన, ముందు ముందు ఏం జరుగుతుందన్న ప్రశ్న పీడిస్తుండేది. ఈ ప్రశ్నకు సమాధానం గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తిందో తెలుసుకోవాలన్నారు. దాని గురించి ఆలోచించాలి. మొత్తం అధ్యయనం చేసిన తర్వాత, ఎటువంటి పరిస్థితి తలెత్తిందంటే, దీనికి మనమందరమే కారణం. మాతృమూర్తులు సహా యావత్ సమాజం బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే, దీని గురించి మన ఆలోచన ఏమిటి? మనం కూడా ఈ ప్రపంచంలో ఒక దేశం, ఒక రాష్ట్రంగా, ఎన్నోయుగాలుగా ఇక్కడే నివసిస్తూ వచ్చాయి.
పైగా మనది అత్యంత ప్రాచీన దేశం, మాతృత్వం అనే భావనలో కూడా అంతే ప్రాచీనమైనది అని ఆయన తెలిపారు. అయితే, సమాజం మాతృత్వ స్ఫూర్తిని, సందేశాన్ని మరచిపోవడం వల్ల అది క్షీణిం చిందని, ఇది విదేశీ శక్తులు దేశాన్ని దోచుకోవడానికి, ఆధిపత్యం చెలాయించడానికి వీలు కల్పించిందని ఆయన అన్నారు. చివరి విదేశీ పాలకులైన బ్రిటిష్ వారు వెళ్ళిపోయే ముందు ఈ ఆత్మవిస్మృతి (మనను మనం మరిచిపోవడం) అన్న లోపాన్ని మరింత బలపరిచే వ్యవస్థను ఏర్పాటుచేశారని అన్నారు. అంతేకాక, మన దేశంలోని ప్రాచీన సంప్రదాయాలు, భావనలన్నీ విలువలేనివని నమ్మేలా వారు మన మనసులను ప్రభావితం చేశారన్నారు.
అయితే, గత రెండు వేల సంవత్సరాలుగా మాత్రమే మనం మన ఆచారాలు, సంప్రదాయాలను ప్రశ్నిస్తున్నామని చాలామంది నమ్ముతారని, కానీ నిజానికి విలువలను విస్మరించడం అన్నది మహాభారత కాలంనాటికే ప్రారంభమైందని ఆయన వివరించారు. అప్పటి నుండి మనం క్రమంగా మన ఆచారాలు, సంప్రదాయాలను మరచి పోయామని ఆయన అన్నారు.
ఆ తర్వాత దండయాత్రలు మొదలై, సమాజం అస్తవ్యస్థమైంది. వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి. అదే జరిగింది. చివరిసారి దాడి చేసిన ముష్కరులు మన మనసుల్లో మన సొంత సంప్రదాయాల పట్ల ద్వేషాన్ని నింపేశారు. మనస్సులను న్యూనత భావంతో నింపివేశారు. వారి ఆచారాలు, పద్ధతులే సరైనవని, మన సంప్రదా యాలు, జీవనవిధానాలు తప్పని వారు క్రమంగా మనలో నమ్మకాన్ని నాటారు. ఫలితంగా, మనం మన నిజమైన సంప్రదాయాలు, పద్ధతులపై అవగాహనను కూడా కోల్పోయాం.
ఈ అసంపూర్ణ దృక్పథం నుండి పుట్టుకొచ్చిన తప్పుడు భావనల కథనం విస్తృతంగా వ్యాపించి ఉంది. పాశ్చాత్య దేశాలలో దేని కారణంగా అక్కడ అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయో, ఆ ఆలోచనలలో కొన్నింటిని మనం వారి నుంచి స్వీకరించాం. అయినప్పటికీ ఆ సమస్యలకు వారికి పరిష్కారాలు లభ్యం కావడం లేదు, మనం కూడా ఏవీ కనుగొన లేదు. అయినప్పటికీ, ఇక్కడ మనం ఆ కథనాలను, ప్రమాణాలను ప్రామాణికంగా పరిగణిస్తూనే ఉన్నాం.
భారతదేశంలో ఎన్నడూ లేని కథనాలను విదేశీయులు సృష్టించి ఇక్కడ ప్రచారం చేశారని ఆయన అన్నారు. మన దగ్గర లేని పరిస్థితులను, మనకు అసలు సంబంధం లేని కథనాలను సృష్టిస్తున్నారు. వారు ఊహించినట్టుగా పరిస్థితి తయారైంది. ఉదాహరణకు, పురుషులు గొప్పవారా లేక స్త్రీలు గొప్పవారా అనే చర్చను వారు ప్రవేశపెట్టారు. పురుషులకు అనుకూలంగా ఉన్నవారు పురుషులే గొప్పవారని వాదిస్తుండగా, స్త్రీలకు మద్దతు ఇచ్చేవారు స్త్రీలే గొప్పవారని వాదిస్తున్నారు. ఈ విధంగా, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే వాదనలతో సమాజం నిండిపోయింది.
ఒకవేళ, స్త్రీలు శ్రేష్ఠులైతే, వారు కుటుంబంలో ఎందుకు బానిసలుగా మిగిలిపోయారు? తమను బానిసత్వంలో ఉంచే వివాహ వ్యవస్థను వారు ఎందుకు అంగీకరించాలి? స్త్రీలు ఏదైనా చేయగలరు. స్త్రీలు అన్నీ చేయగలరన్న వాదన కేవలం ఒక భ్రమ. అలాగే పురుషులు అన్నీ చేయగలరన్న వాదన కూడా అంతే భ్రమ అని ఆయన అన్నారు. ఏదైనా చేయాలంటే, ఇద్దరూ కలిసి ఉండాలన్నారు. ఇది వాస్తవ స్థితి అని పేర్కొన్నారు. కానీ, వారి కథనాన్ని మనం కళ్లకు గంతలు కట్టుకొని స్వీకరించాం. అసంపూర్ణ మైన దృష్టికోణం నుంచి ఆలోచన చేస్తారు. దాని ఆధారంగా అసంపూర్ణమైన వ్యవస్థలను స్వీకరించేందుకు సిద్ధమవుతారు. అందుకే, దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యన్నారు. దానికి సమాధానం లేదు.
అందుకే, మన దగ్గర ఈ ప్రశ్నలు తలెత్తాయి, ఇది ముఖ్యమైన చర్చలలో ఒకటిగా మారింది. ఇప్పుడు దీనినే స్వాతంత్య్రం అని పిలుస్తున్నారు. అవును కదా? అందుకే, “మహిళా విముక్తి” అనే పదాన్ని కూడా ప్రజా చర్చలోకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. ఈ పదం వినడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, బానిసత్వం అనే భావన నిజంగా ఉనికిలో ఉంటే, మహిళలు దాని నుండి తప్పకుండా విముక్తి పొందాలని ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషుడైనా బంధనాల నుంచి విముక్తమై ఉన్నారా. మనందరం బంధనాల్లో ఉన్నాం. కనుక అన్ని బంధాలను తెంచుకోవడం అసాధ్యం.
మీరు ఈ హాల్‌ను ఒకసారి పరికించండి, వర్ణమయంగా కనిపిస్తారు అందరూ. అప్పుడు ఇక్కడ సప్తవర్ణాలూ ఉన్నాయని అంటాం. కానీ, ఒక కోడి వచ్చి, ఏడు రంగులు ఎక్కడుంటాయి? రంగులు మÖడే ఉంటాయి అంటుంది. ఎందుకంటే, దాని మెదడుకు తన మÖడు రంగులే కనిపిస్తాయి. కాబట్టి, దాని దృష్టి కోణం నుంచి ప్రపంచంలో మÖడే ఉన్నాయంటుంది.
కుక్క అయితే నలుపు, తెలుపు అనే రెండు రంగులే ఉన్నాయంటుంది. అప్పుడు మనం ఏడురంగులున్నాయని కుక్కకి వివరిస్తాం. కానీ, ఇదంతా అర్థం లేని విషయం అని అంటుంది. రెండే రంగులున్నాయనేది నాకు అనుభవమైంది అంటుంది. ఏడురంగులున్నాయన్నది మా అనుభవం అంటాం. కానీ, మన అనుభవం ఎక్కడుంది. అంతర్గతంగా మనల్ని కట్టేశారు.
ప్రతి ముక్తి, ఒక కొత్త బంధనాన్ని స్వీకరించడమే. ప్రతి విముక్తి అనివార్యంగా మరో రకమైన బంధనానికి దారితీస్తుంది. కేవలం, “నేను అన్ని బంధాల నుండి విముక్తురాలిని; నాకు ఇకపై బంధనం లేదు,” అని ప్రకటిస్తే సరిపోదు. మనల్ని బంధించే బంధనంగా మనం భావించేది, వాస్తవానికి విముక్తి అనే మరో రకమైన బంధనమే.
దేశంలో మహిళా విముక్తి ఉద్యమం ప్రారంభమై, పెరిగి, కొందరు దానిని స్వీకరిస్తుండగానే, జెన్‌జెడ్(జెన్‌జీ) తరం వచ్చిందని, ఆ పదం వినడానికి బాగుంది. అది భావోద్వేగపూరితమైనదని, అనుకరిస్తుంది, కానీ అది పరిణతితో ఆలోచించదని ఆయన అన్నారు. వారితో సంపర్కంలో ఉన్నవారు వారు చూడటంలో నిజాయితీగా కనిపిస్తే వారిని ఆశ్రయిస్తుంది. తర్వాత వారి వ్యవస్థాపకులు ఒకరికి తాము ఒక తప్పుడు మార్గంలో అడుగులు వేశామని, ఒకటి లేదా రెండు తరాలను నాశనం చేశామని గ్రహించారు. అదే సందర్భంలో, ఒక జెన్‌జెడ్ మహిళ “మహిళా విముక్తి” పేరుతో విషపూరితమైన భావాలను నాటుతూ ఒక పుస్తకం రాసింది, దానివల్ల రెండు తరాలు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమె తన తప్పును గ్రహించి, దానికి ప్రతిగా మరో పుస్తకం రాసింది, అందులో ఆమె తన పొరపాటును అంగీకరించింది.
కనీసం రాబోయే తరాలు తప్పుడు మార్గంలో వెళ్లకూడదనే ఉద్దేశ్యంతో ఆమె మరిన్ని పుస్తకాలు రాశారని ఆయన అన్నారు. చివరగా, మాతృత్వం ఒక స్త్రీకి అత్యంత గొప్ప విషయం అని ఆమె అంగీకరించారు.
అయితే, అది ప్రగతిశీలమైనదని భావించి, మనం కూడా ఆ పాశ్చాత్య విధానాన్ని గుడ్డిగా అనుసరించాం. అందువల్ల, ప్రస్తుత కాలంలో “మాతృత్వం” గురించి చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. అన్ని పరిస్థితులకూ ఒక అంతర్లీన దృక్కోణం ఉంటుందని, ఆ దృక్కోణాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
మనం సహించగలిగినన్ని అడ్డంకులు మనకు ఉంటాయి. వాటిని అధిగమించగల గుణాలు మనలో ఉన్నాయి. మనకు యుగాý అనుభవం ఉంది. కానీ అది మనది అయినందువల్ల, దానిని నిరుపయోగ మైనదిగా భావిస్తున్నామనే విషయం మనకు తెలియదు. వారిది చాలా పురోగమన ప్రపంచం. అక్కడి నుంచి ఈ అంధుల వెనక మనం కూడా అంధులమై తిరుగుతున్నాం. అందువల్ల ఈ చర్చ చేయవలసి వస్తోంది.
కానీ, మీరందరూ కూడా అంతర్గతంగా ఒకసారి తొంగిచూసుకుని, ఆలోచన చేస్తే నేను చెప్పకుండానే మీకు సత్యం బోధపడుతుంది. ఇప్పుడు మీలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు మీకు దొరికి పోతాయి. ఎందుకంటే, మొత్తం పరిస్థితి వెనుక అసంపూర్ణత ఉంది, కానీ మన వద్ద సంపూర్ణమైన, సమగ్రమైన దృష్టి ఉంది.
ఎందుకంటే, మన పూర్వీకులు సృష్టికి సంబంధించిన సత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, దానిని స్వీకరించి, భవిష్యత్ తరాలకు అందించడం వల్లే, ప్రాచీన కాలం నుంచే భారత్ ఒక సంపూర్ణ, సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉందని ఆయన అన్నారు. అదే వారసత్వం నేటికీ మనతో ఉందని, మన మందరం ఒక్కటేనని అది మనకు బోధిస్తుందని పేర్కొన్నారు.
పురుషులు, స్త్రీలు, జీవులు, జడత్వం, చైతన్యం అన్నీ భ్రమలేనని ఆయన అన్నారు. అయితే, మనం వాటిని అధిగమించలేం. ఇవన్నీ మాయ అయిన ప్పటికీ, తపస్సు ద్వారా వాటిని జయించవచ్చు. అయితే, ప్రకృతి సహకారం, అనుమతితో మాత్రమే ఈ భ్రమను అధిగమించి, సత్యాన్ని చేరుకోగలం. కానీ, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇది మాయ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
కానీ వాస్తవికత ఏమిటి? ఏమిటంటే అందరూ ఒక్కటే, ఇదే మన వారసత్వం. ఈ చైతన్యం పరిమితమైనది కాదని, అది విశ్వవ్యాప్తమైనదని, విజ్ఞానశాస్త్రం కూడా ఇదే చెబుతుందని ఆయన నొక్కి చెప్పారు.
విజ్ఞాన శాస్త్రం కూడా అదే భావనకు వచ్చింది. ప్రతిదీ పూర్వమే ఉన్న ఒక విశ్వ చైతన్యంతో ప్రారంభమైంది. ఆ చైతన్యం స్థానికమైనది కాదు, అది విశ్వవ్యాప్తమైనది. అందువల్ల ప్రతిదీ ఒక్కటే, ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానితమై ఉంది. ఇదే విజ్ఞానం చెప్తుంది, ఇదే మన దృష్టి కూడా.
దీని ఆధారంగా ఆలోచన చేసినప్పుడు, స్త్రీ, పురుషుల విషయం గుర్తు వస్తుంది. అంతిమ సత్య (ఆబ్సల్యూట్ రియాలిటీ) స్థాయిలో అసలు ఈ తేడాయే లేదు. స్త్రీ, పురుషులందరూ ఆత్మలు లేదా శూన్యం. వేరు, వేరు పేర్లు, వేరు వేరు రూపాలతో. కానీ ప్రతి భారతీయ దర్శనం అది బేధమే కాదంటుంది. ప్రతి వారి మనస్సు, బుద్ధి వేరువేరుగా ఉంటుంది. కానీ, పూర్ణం ఒకటే. భావనల రూపంలో, ప్రవృత్తి రూపంలో, సామర్ధ్యాల రూపంలో ఉన్న తేడాలు అందరిలో ఉంటాయి. అవి పురుషుల్లోనూ, స్త్రీలలోనూ కూడా ఉన్నాయి. అందులో తేడా లేదు.
బాహ్యంగా కనిపించే దేహానికి ఆవరణ లభిస్తుంది, అది వేరు. ప్రకృతి వారిని విడిగా ఉంచింది. పునరుత్పత్తి అనే విధిని నిర్వర్తించడం ప్రకృతికే సాధ్యం. ఎందుకంటే, ప్రకృతి మరణాన్ని కోరుకోదు, శాశ్వతత్వంగా ఉండాలనుకుంటుంది. శాశ్వతంగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి. మీరు ఏదైనా చేసి, సజీవంగా ఉండండి లేదంటే మీ వంశాన్ని ఉత్పన్నం చేయండి. అప్పుడు మరణించిన తర్వాత కూడా మీరు వారిలో జీవిస్తారు. ఇది అన్ని జీవులకు వర్తించే బయాలజీ. అందుకే, స్త్రీ, పురుషుల శరీరాలను భిన్నంగా తయారు చేసింది ప్రకృతి.
కానీ దేహ స్థాయిలో ఆవశ్యకతలు భిన్నంగా ఉంటాయి. ఉపయోగాలు భిన్నం. కానీ, మందబుద్ధి స్థాయిలో అందరూ ఒకటే. అందుకే, పురుషుడు చేయగలవన్నీ, మహిళ కూడా చేయగలదు. కానీ, మహిళలకు ఉన్న ప్రత్యేక వరం ఉంది, పురుషులకు లేదు.
ఈ కార్యక్రమంలో విశ్వమాంగళ్య సభ వ్యవస్థాపకులు పూజ్య శ్రీ జితేంద్రనాథ్ మహరాజ్, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వృశాలి జోషి, అఖిల భారతీయ విశ్వమాంగళ్య సభ మార్గదర్శి ప్రశాంత్‌జీ హోల్కర్, విశ్వమాంగళ్య సభ జాతీయ అధ్యక్షురాలు నళినీ హవాడే, విశ్వమాంగళ్య కమిటీ, జాతీయ ఉపాధ్యక్షుడు సూరజ్ జీ దామోర్ పాల్గొన్నారు. ఆహ్వాన సంఘం కమిటీ అధ్యక్షుడు భగవత్‌జీ బల్ద్వా, సంయుక్త కార్యదర్శి శృతి బొడ్డుపల్లి ముఖ్యఅతిథులుగా పాల్గొని కార్యక్రమానికి మార్గదర్శనం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర దక్షిణ భారత రాష్ట్రాల నుండి సుమారు 150 మంది విశ్వమాంగళ్య సభ కార్యకర్తలు పాల్గొన్నారు.
దక్షిణ భారతదేశం నలుమూలల నుండి మహిళా ప్రతినిధులు, ప్రముఖులు, తల్లులు ఈ దక్షిణ భారత్ ప్రబోధన్ సమావేశాలలో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
– జాగృతి డెస్క్
విశ్వమాంగళ్య సభ
సమాజంలోని మహిళా సంఘటిత శక్తిగా విశ్వమాంగళ్య సభ ఉద్భవించింది. ఈ విశ్వంలోని ప్రతి కుటుంబానికి కేంద్ర బిందువు మాతృమÖర్తే అన్నది కాదనలేని వాస్తవం. కుటుంబంలో భావితరాలకు సంస్కారాన్ని అందించే కీలకపాత్రను ‘అమ్మ’ పోషిస్తుంది. ఈ స్థానాన్ని పటిష్టంచేస్తూ, ఈ మాతృత్వ భావన ద్వారా సమాజాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నది విశ్వమాంగళ్యసభ భావన. బాలికలకు సంస్కారవంతమైన తల్లులను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది. తద్వారా దేశ సంస్కృతిని పటిష్టం చేయగలం అన్నది ఈ సంస్థ విశ్వాసం. ప్రతి ఇంట్లోనూ ప్రతిభ, తత్వచింతన సంస్కారవంతులైన మాతృమూర్తి ఉన్నట్టయితే, ప్రతి ఇంటి నుంచి సంస్కారవం తులు, దేశభక్తులు, తేజోవంతమైన సంతతి నిర్మాణం కాగలదనేది సభ భావన.
ఈ భావనతోనే ప్రతివర్గంలోని తల్లినీ ఈ సూత్రానికి అనుసంధానం చేసేందుకు విశ్వమాంగల్య సభ పని చేస్తోంది. వ్యక్తి నుంచి సమష్టికి, సమిష్టి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమాజం, సమాజం నుంచి దేశానికి, దేశం నుంచి విశ్వానికి భారతీయ సంస్కృతిని విస్తరింపచేయడమే విశ్వమాంగళ్య సభ లక్ష్యం.
అమరావతి జిల్లా, అంజన్‌గావ్ సూర్ణేలోని శ్రీదేవనాథ పీఠం పీఠాధీశులైన పరమపూజ్య ఆచార్య అనంత శ్రీ విభూషిత 1008 స్వామి శ్రీ జితేంద్రనాథ్ మహారాజ్ ప్రేరణతో 2010, జనవరి 19 మాఘ శుద్ధ చతుర్ధి శ్రీ గణేష్ జయంతి పర్వదినాన విశ్వమాంగళ్య సభ ప్రారంభమైంది.
విశ్వమాంగళ్యసభ సదాచార సభ, విద్యార్థి సభ, బాల సభ విభాగాలలో కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
విదేశీ విభాగం: అమెరికా, కెనడా, సింగపూర్, నెదర్లాండ్, నార్వే, బెల్జియం, జర్మనీ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాతృనిర్మాణ కార్యక్రమాలను సభ విస్త్రతంగా నిర్వహిస్తోంది.
ధర్మ సంస్కృతి శిక్షా విభాగం: విలువలతో కూడిన వ్యక్తి జీవనం ధర్మబద్ధమైన సామాజిక రచనే, దేశ సాంస్కృతిక అభివృద్ధికి ప్రాతిపదిక కనుక, సమాజానికి ధర్మ భావనను, జ్ఞానాన్ని ప్రేరేపిస్తూ వ్యక్తి నిర్మాణం చేయడం ఈ విభాగం ముఖ్య లక్ష్యం. వివిధ ప్రచార, ప్రసార సాధనాల ద్వారా ధర్మ శిక్షా విభాగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వనవాసీ కళ్యాణ విభాగం: గిరిజన జీవన విధానాలకు భంగం కలిగించకుండా వాటిలో ఆధునికతను అందిస్తూ, అన్యులు మన సంస్కృతిపై చేసే దాడులను ధైర్యం ఎదుర్కొనే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
శ్రీనాథ్‌జీ రసోయి (వంటగది)
కాశీక్షేత్రంలో దుర్గాఘాట్‌లో ‘శ్రీనాథ్‌జీ రసోయి’ పేరిట నిత్యాన్నదాన క్షేత్రం ప్రారంభించారు. నిత్యం వేదాధ్యయనం చేసే విద్యార్ధులు, సాధుసన్యాసులు, యాత్రికులకు భోజన సౌకర్యాన్ని అందిస్తున్నారు. విశ్వమాంగల్యసభ చేపట్టే అన్ని మాతృకార్యక్రమాలు మాతృమూర్తి అన్నపూర్ణదేవి స్వరూపమని భావిస్తారు. కనుక, కాశీలాంటి పుణ్యక్షేత్రంలో విశ్వమాంగల్యసభ ‘అన్న క్షేత్రాన్ని’ ప్రారంభించింది.