‌ప్రపంచంలో అత్యధిక ఇంటెలిజెన్స్ ‌కోషెంట్‌ (‘ఐక్యూ’) గల దేశాలో దక్షిణకొరియా, చైనా, జపాన్‌ ‌నిలబడతాయని 2026లో జరిపిన సర్వే ఒకటి చెబుతోంది. ఇందుకు కారణం, ఈ దేశపు విద్యార్ధుల చదువు, సైన్సు, గణితంపై ఎక్కువ దృష్టి పెట్టడం, కఠినమైన విద్యా విధానం, సాంకేతికలో ముందుండడం. జపాన్‌లో అదృష్టంకన్నా కష్టపడి పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దాన్నే వారు గాంబత్తె (Ganbatte) అంటారు. జపనీయులు జన్యుపరంగా క్రమశిక్షణ కలిగిన మానవజాతి.

జపనీస్‌ ‌పదం గాంబత్తె అంటే ‘‘గట్టిగా ప్రయత్నించు’’ ‘‘పోరాడు’’ లేదా నీ శాయశక్తులా ప్రయత్నించు అని. గాంబత్తె కుడసాయి అంటే దయచేసి గట్టిగా ప్రయత్నించండి అని. ఎవరైనా కష్టమైన పని చేస్తున్నప్పుడు వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి గట్టిగా ప్రయత్నించు / ఆల్‌ ‌ది బెస్ట్ అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. అల్బర్ట్ ‌లీ బర్మాన్‌ ‌రాసిన Ganbatte; the Japanese Art of always moving forward” అనే పుస్తకంలో దీన్ని గురించి వివరించాడు.

అదృష్టం కన్నా ప్రయత్నమే ప్రధానమని చెప్పే ఈ విధానాన్ని అడుగడుగునా అన్వయించుకోవచ్చు. మనల్ని మనమే కాదు, మన చుట్టూ ఉన్నవారిని ఉత్సాహపరిచేందుకు ఇది తోడ్పడుతుంది. జపనీయుల సుదీర్ఘ ఆయుర్ధాయం, మనోనిబ్బరాలకు ఆధారం ఇదే.

టోక్యో సబ్‌ ‌వేలో సుషీ రెస్టారెంటులో కేవలం పదిమందికే చోటుంటుంది. ఆ రెస్టారెంట్‌కి 94 ఏళ్ల జీరో ఓనో జీవితం, గాంబెత్తెకు చక్కని ఉదాహరణ ‘‘నేను చేసే పనినే మళ్లీ మళ్లీ చేస్తాను. ప్రతిసారీ మరి కాస్త మెరుగు పరుచుకుంటూ, అవెక్కడున్నాయో తెలియదుగానీ ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఒక్కో మెట్టూ ఎక్కుతున్నాను’’ అంటుంది ఆమె. ఈ రెస్టారెంట్‌కు జపాన్‌ ‌ప్రధాని అమెరికా అధ్యక్షుడిని తీసుకువెళ్లాడు. ఇలాంటి వ్యక్తుల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదే గాంబత్తె తాత్వికత. రెండవ ప్రపంచయుద్దంలో ఛిద్రమైన జీవితాల్ని పునరుద్ధరించుకోవడానికి జపనీయులకు తోడ్పడింది, భూకంపంలో ధ్వంసమైన కోచె, తోహోకు లాంటి నగరాల్ని నిలబెట్టింది ఈ విధానమే. సంక్షోభం ఏదైనా ఎదుర్కొనే సాధనం గాంబత్తె. అది సమష్టి కృషికి అద్దం పడుతుంది, సమస్యను దాటి భవిష్యత్తు దిశగా ఆలోచింపజేస్తుంది. ఈ విధానం భారతదేశానికి అత్యవసరం. గాంబత్తె స్ఫూర్తితోనే తాను ఈ పుస్తకం రాయగలిగానని ఆ రచయిత పేర్కొన్నాడు. జపాన్‌ ‌వారి జన్యువులు అట్లాంటివి మరి.

మన పెద్దలు పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు..అది నిజమే. తాత ముత్తాతల లక్షణాలు, జీన్స్ ‌పుట్టబోయే పిల్లలకు వస్తాయి అని జన్యుశాస్త్రం నిరూపించింది. మానవ జన్యుశాస్త్రం మీద అధ్యయనాలు జరుగు తున్నాయి. ఎపి జెనిటిక్స్, ‌యూనీ జె•నిటిక్స్‌లలో మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధాశక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని, పిల్లలకు ఆలోచనా శక్తి ముందు తరాల నుండి సంక్రమిస్తుందని ఇజ్రాయిల్‌ ‌టెల్‌ అవీవ్‌ ‌విశ్వవిద్యాలయంలో డా।। ఒడెడ్‌ ‌రెచాలీ అనే జెనెసిటిస్టు నిరూపించాడు.

పిల్లలకు తల్లిదండ్రుల డి.ఎన్‌.ఎ., ఆర్‌.ఎన్‌.ఏ.‌తో పాటు వారి ఇరు కుటుంబాల, తాతముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుక తరాల మెదడు జన్యు శక్తి, వారి అనుభవాల సమూలశక్తి, క్రియాశీలశక్తి, భావ ప్రకటనా శక్తి ఇప్పుడు పుడుతున్న మెదళ్లకు సంక్రమిస్తుంది. భిన్న వృత్తుల వారి మధ్య వివాహాలు జరిగితే జన్యు మార్పులు వుంటాయి. ఒకే వృత్తి వారి మధ్య జరిగితే మానవ మెదళ్లు చిప్‌లాక్‌ అయ్యి వారిలో సృజనాత్మకత తగ్గుతుంది.

అమెరికాకు 39వ అధ్యక్షునిగా చేసిన జిమ్మీ కార్టర్‌ ‌తన ఆత్మ కథ ‘‘ఎ ఫుల్‌ ‌లైఫ్‌: ‌రిప్లెక్షన్స్ ఎట్‌ ‌నైంటీ’’లో ‘‘తన తండ్రి వేరుశనగ పండించే రైతు, ఇల్లు కట్టే వడ్రంగి, చెప్పులు తయారు చేసేవాడు. ప్లంబర్‌, ‌మంచి వ్యాపారి. తల్లి నర్సు, వంట పనిలో దిట్ట’’ అని వివరించాడు. జిమ్మీ కార్టర్‌ ‌చిన్న వయస్సులోనే మంచి రైతు, షూమేకరు, నేవీ ఎలక్ట్రికల్‌ ఇం‌జనీరు. ‘‘హాబిటాట్‌ ‌ఫర్‌ ‌హ్యుమానిటీ’’ సంస్థ తరపున వడ్రంగిగా ఎన్నో దేశాల్లో వేలాది ఇళ్లు కట్టించాడు. 22 పుస్తకాలు రాశాడు. 95వ ఏట వరకూ స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడు. గొప్ప ఉపన్యాసకుడు, జార్జియా స్టేట్‌ ‌గవర్నర్‌, అమెరికాకు 39వ అధ్యక్షునిగా పనిచేసి 100 సంవత్సరాలు బతికాడు, కారణం జన్యుపరంగా బలంగా ఉండటమే.

ఒక వ్యక్తి తెలివితేటలను తెలియజేసే సాధనం ఐక్యూ. ఈ ఐక్యూ సంఖ్య ఎంతపెద్దదైతే వారికి అన్ని ఎక్కువ తెలివితేటలు ఉంటాయన్నమాట. ఒక మనిషికి ఉండే ఐక్యూని బట్టి అతని తెలివితేటలను నిర్ధారిస్తారు. అతడు నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాడు? ఆలోచనా తీరు ఎలా ఉంది అనే విషయాన్ని ఈ పరీక్షలో పరిగణనలోనికి తీసుకుంటారు. చాలామందిలో ఐక్యూ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ విషయం వారికి తెలియడం లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఎక్కువ ఐక్యూ ఉందని తెలిపే నాలుగు లక్షణాలు; కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం, మంచి మాటతీరు, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, సృజనాత్మకత (క్రియేటివిటీ) అంటారు మానసిక శాస్త్రవేత్తలు.

పూర్వకాలం నుండి మెదడుకు పదునుపెట్టే పజిల్స్, ‌చదరంగం ఆడటం, కొత్త భాషలు నేర్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేయాలి. మెరుగైన పోషకాహారం, నిద్ర, యోగ, ధ్యానం మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ అలవాట్లు జ్ఞాపకశక్తిని, తార్కిక ఆలోచనా విధానాన్ని మెరుగు పరుస్తాయి.

మానసిక వ్యాయామం: ప్రధానంగా చదరంగం ఆడటం మీ ఐక్యూ స్థాయిని పెంచుతుందని వెనిజులాలో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. మీ దినచర్యలో చిన్నమార్పు తీసుకురండి, పళ్లు తోముకునేటప్పుడు రోజూ వాడే చేతినిగాక రెండవ  చేతిని వాడండి. అలవాటుపడిన చేతితోపాట అలవాటుపడిన చేతితోపాటు మరో చేతితో రాయడం సాధనచేయండి. మెదడును ఉత్తేజపర్చడానికి మనం దానికి శిక్షణనిచ్చి, మరింత సంక్షిష్టమైన పనులు అప్పగించాలి. కొత్త భాషను నేర్చుకోవడం, యుద్ద కళలు నేర్చుకోవడం, సంగీత వాద్యం నేర్చుకోవడం ఆ కోవలోకే వస్తాయి. సంగీతం కూడా మెదడుకు వ్యాయామం అని సంగీత అభ్యాసంపై పరిశోధకు రాలు అనితా కాలిన్య్ అం‌టున్నారు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌సంఘశాఖలో స్వయంసేవకులు వృత్తాకారంలో కూర్చొని ఆడే నంబర్‌ ఆటలో సంఖ్య చెప్పి, అందుకు బదులుగా ఒక పదాన్ని పలుకుతారు. ఇది ఏకాగ్రతను పెంచే ఆట. ఒకరు చెప్పిన వరస పేర్లను, అదే క్రమంలో చెప్తూ, అదనంగా ఒక పేరు చెప్పాలి. మూడవ వారు కూడా అంతే. ఇది వారి జ్ఞాపకశక్తికి ఉదాహరణ. సంఘశాఖలో కథ చెప్పడం కూడా ఒక ఏకాగ్రతకు గుర్తే. సంఘ ప్రార్థన ‘‘సదా వత్సలే మాతృభూమే’’ మర్చిపోకుండా, తడబడకుండా చెప్పడం కూడా వారి జ్ఞాపకశక్తికి ఉదాహరణ.

ఐదురోజులు వరసగా మంచి నిద్రలేకపోతే 10 లేదా 15 పాయింట్ల వరకూ ఐక్యూ పడిపోతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ‘సోమరిగా కూర్చోకండి ఏదో ఒకటి చేయండి’ అంటారు శాస్త్రవేత్తలు. తప్పనిసరిగా రోజూ ఒక పేజీ చదవండి, మెదడు అద్భుత శక్తులకు అనుగుణంగా మారగలదు. అద్భుతాలు చేయగలదు. శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వంటివి మీ జ్ఞానాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి.

పరిణామక్రమంలో మానవుడు సాధించిన ముఖ్యమైన మైలురాళ్లు ద్విపాదనడక, ‘నిప్పు’ను కనుగొనడం, ‘చక్రం’ రాతి పనిముట్లు, భాష, మేధస్సు, నాగరికత, వ్యవసాయం, వ్యవసాయ విప్లవం, నగరాల ఏర్పాటు, లిపి, రచన, శాస్త్రీయ, సాంకేతిక, పారిశ్రామిక, శాస్త్రీయ విప్లవాలు, ఆధునిక యుగంలో అంతర్జాలం, డిజిటల్‌ ‌యుగం, అంతరిక్షయానం, సాహస యాత్రలు మొదలైన వాటిని దాటి నేడు హ్యూమన్‌ ‌పొటన్షియల్‌ ‌మూవ్‌మెంట్‌కు వచ్చాం.

క్రిందటి శతాబ్దంలో హ్యూమన్‌ ‌పొటెన్షియల్‌ ‌మూవ్‌మెంట్‌ అనే ఉద్యమం మనిషిలో అపారమైన సామర్థ్యం ఉందని చెప్పింది. కానీ ఈ ఉద్యమం ఎక్కువగా భావోద్వేగ అనుభవస్థాయిలోనే నిలిచి పోయింది. దానికి నాడు శాస్త్రీయ సాధనాలు అందుబాటులో లేవు. తరువాత దశ సెల్ఫ్‌హెల్ప్, అనే మరో సామాజిక వికాస తరంగం, సక్సెస్‌ ‌సైన్సు, హ్యబిట్స్, ‌మైండ్‌సెట్‌ ‌వంటి పదాలు ప్రజల్లో బాగా విస్తరించాయి. అదే సందర్భంలో ఆ సైన్సు నిజమైన సైన్సు కాదు. వ్యక్తిగత స్థాయిలో పనిచేసే నమూనాలు ఉండవు. మార్పును నియమబద్దంగా సాధించే ప్రయత్నం ఉండదు. ఇక్కడొక కొత్త అవకాశం ఆవిర్భవించింది. అదే న్యూరో సైన్సు, కంప్యూటేష నల్‌ ‌న్యూరోసైన్సు, ఎ.ఐ. (ఆర్టిఫిషియల్‌ ఇం‌టిలి జెన్స్) ‌న్యూరో టెక్నాలజీ. ఈ నాలుగూ కలిసినప్పుడు మనిషి సామర్ధ్యం కొత్త కోణంలో చూడగలు గుతున్నాం. మన ప్రవర్తనను కొలిచి, ఆ డేటా ఆధారంగా నమూనాలను నిర్మించ గలుగుతున్నాం. అంటే మనిషి సామర్ధ్యం ఒక అస్పష్టమైన ఆలోచన కాదు. అదొక వ్యవస్థగా మారుతుంది. కానీ, ఇక్కడే ప్రమాదం పొంచివుంది.

సాంకేతికాభివృద్ధిలో మనం మరో మైలురాయి దగ్గర నిలబడ్డాం. దాని పేరే కృత్రిమమేధ (ఏ.ఐ). ఇది రాయడం, విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకో వటం వంటి పనులన్నీ చేయగలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనుషుల కన్నా మెరుగ్గా చేస్తుంది. అందుకే చాలామంది మేధావులను ఇది కలవర పెడుతోంది. ఇలాగే జరిగితే మనుషులను పక్కకు తప్పిస్తుందా? అనేది ఓ పెద్ద చిక్కువీడని ప్రశ్న.

మైక్రోసాఫ్ట్ ‌వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ‌కొన్ని దశాబ్దాల క్రితం, కంప్యూటర్ల వాడకం వచ్చిన కొత్తల్లో పుస్తకం రాశాడు. దాని పేరు ‘‘రోడ్‌ అహెడ్‌’’ (=‌శీ•• ష్ట్రవ••). మన జీవితాన్ని కంప్యూటర్లు ఎలా మార్చబోతున్నాయో ఊహించి రాశాడు. ఇప్పుడవి నూటికి నూరు శాతం అమలవుతున్నాయి. అలాగే రేపు (ఏఐ) కూడా పెద్ద విప్లవాన్ని తీసుకు రాబోతున్నది.

రేపు ఎ.ఐ.ని పనులు చేయించుకునే సాధనంగా ఉపయోగిస్తే, మనిషి పాత్ర తగ్గిపోతుంది. కాని, అదే సాంకేతికతను అభివృద్ధికి ఉపయోగిస్తే ఒక కొత్తదారి తెరుచుకుంటుంది. మన సామర్ధ్యం కొలవగలిగిన, అర్థంచేసుకోగలగిన మెరుగుపరచగలిగిన వాస్తవంగా మారుతుంది.

ప్రాచీన భారతదేశంలో ఆధునిక ఐక్యూ టెస్టులు లేకపోయినా మేధస్సు, వివేకం, జ్ఞాపకశక్తి అంచనా వేయడానికి చాలా కఠినమైన, సమగ్రమైన పద్ధతులు ఉండేవి. ముఖ్యంగా గురుకుల పరీక్షలు, తర్కశాస్త్రం, చర్చలు, జ్ఞాపకశక్తి పరీక్ష, సమస్యాపూర్ణం, మానసిక ఏకాగ్రత. ప్రాచీన పద్ధతులు ఎక్కువగా జ్ఞానం, వివేకం, మానసిక పరిపక్వతపై దృష్టి పెడితే, ఆధునిక పద్దతులు లాజికల్‌, ‌పాటర్న్ ‌రికగ్నిషన్‌ (‌నమూనా గుర్తింపుపై ఆధారపడుతుంది).

 కాగా, ఎ.ఐ. మానవ మేధస్సును మించిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2030 నాటికి ఎ.ఐ. మానవులతో సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా పనిచేసే స్థాయికి చేరుకోగలదని అంచనా. మనిషి మెదడుతో పోలిస్తే ఎ.ఐ. వేలాదిరెట్లు ఎక్కువ సమాచారాన్ని సెకన్లలో విశ్లేషించి నిర్ణయం తీసుకోగలదు.

విదేశీ ఎఐ వేదికలపై ఆధారపడటాన్ని నివారించడానికి భారత్‌ ‌స్వదేశీ లార్జ్ ‌లాంగ్వేజ్‌ ‌మోడల్స్ (ఎల్‌.ఎల్‌.ఎమ్‌)‌ను ప్రోత్సహిస్తోంది. వీటివల్ల హిందీ, తెలుగు, తమిళ్‌ ‌వంటి స్థానిక భాషల్లో ఖాతాదారులతో మాట్లాడడం చాట్‌బాట్స్ అం‌దుబాటులోనికి వస్తున్నాయి. ఇలా దేశీయంగా విభిన్న భాషల అవసరాలను తీర్చడంతోపాటు, ఆంగ్లేతర భాషలు మాట్లాడే విదేశాల్లో ఎ.ఐ.కి ఒక నమూనా అందించడానికి బహుభాషా భాషిణి సృష్టిపై భారత్‌ ‌దృష్టి సారిస్తున్నది.

వైద్యం, చట్టం, అకౌంటింగ్‌లతో పాటు వ్యవసాయం, పాలనారంగాలలో కూడా ఎఐ సేవలను అందించగలదు. ఎ.ఐ. రోబోలకు విశ్రాంతి అవసరం లేదు, జీతాలు అక్కర్లేదు పైగా అవి అలసిపోవు. ఏ.ఐ. మానవ మనుగడకే సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.