– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

విద్యార్థులు, నిరుద్యోగులు మరిన్ని అవకా శాలు సాధిస్తారు. సన్నిహితులు మరింత దగ్గరవు తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమౌతాయి. రావలసిస డబ్బు అందుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందడమే కాకుండా తగినంత లాభాలు దక్కుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలకు విజయాలు. 1,2 తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఖర్చులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. తండ్రి తరఫు వారితో వివాదాలు తీరతాయి. విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు. తరచూ ప్రయాణాలు ఉండవచ్చు. రావలసిన బాకీలు అందు తాయి. రుణాలు తీరతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రచయితలు, కళాకారులు విశేష పేరుప్రతిష్ఠలు. 2,3 తేదీల్లో అనుకోని ఖర్చులు, స్నేహితులతో విభేదాలు.  పంచాక్షరి పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

యత్నకార్యసిద్ధి. బంధువులనుంచి శుభ వార్తలు అందుతాయి. విద్యార్థులకు విజయాలు వరి స్తాయి. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. రావలసిన సొమ్ము అందుతాయి. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా సాగుతారు. రచయితలు, పరిశోధకులకు మరింత గుర్తింపు లభిస్తుంది. 3,4 తేదీల్లో వృథా ఖర్చులు.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ముఖ్య కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మికప్రయాణాలు. విద్యార్థుల యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. అవసరాలు పెరిగి కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది.  వ్యాపా రులకు కొద్దిపాటి లాభాలు. పారిశ్రామికవేత్తలకు అనుకోని విదేశీయానం. కళాకారులు, రచయితలకు కొంత నిరాశాజనకమే. 3,4తేదీలలో శుభకార్యాలకు హాజరు. ఆస్తి లాభం. నృసింహస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందు తాయి. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రచయితలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 5,6 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కార్యక్రమాలు సాఫీగా కాగలవు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి విషయా లలో బంధువులతో వివాదాల పరిష్కారం. దేవా లయాలు సందర్శిస్తారు. చిరకాల ప్రత్యర్థులు స్నేహితు లుగా మారి సహకరిస్తారు. రావలసిన సొమ్ము అందు తుంది. ఉద్యోగులు విధినిర్వహణలో  గుర్తింపు. 1,2 తేదీలలో శారీరకరుగ్మతలు.గణేశాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి. సన్నిహితులు, స్నేహితులతో వివాదాల పరిష్కారమవు తాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సమాజ సేవా కార్య క్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఆర్థికంగా బలం. ఉద్యోగులకు పనిభారం తగ్గడమే కాకుండా పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. 6,7తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శివాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవు తాయి. కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది.  మీ ఆశయాల సాధనలో బంధువులు సహకారం. భూములు, భవనాలు కొంటారు. దేవాలయాల సంద ర్శనం. ఉద్యోగులకు విధుల్లో ప్రతి బంధకాలు తొలగు తాయి. పైస్థాయినుంచి ప్రశంసలు. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. 5,6 తేదీలలో  దూర ప్రయాణాలు. ఆదిత్యహృదయం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు. వ్యాపారులు కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా గడుపుతారు. రచయితలు, పరిశోధకు లకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. 1,2 తేదీల్లో వృథా ఖర్చులు. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. శ్రేయోభిలాషులు మీపట్ల మరింత ప్రేమాభిమానాలు చూపుతారు. ప్రత్యర్థులు సైతం  స్నేహితులుగా మార తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. పాత బాకీలు వసూలు. ఖర్చులుపెరిగినా తట్టుకుని ముందుకు సాగుతారు. రచయితలు, క్రీడాకారులు సత్తా చాటుకుని పేరుప్రతిష్ఠలు పొందుతారు. 2,3 తేదీల్లో దూరప్రయాణాలు. శ్రీరామరక్షా స్తోత్రం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్య కార్యక్రమాలలో విజయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలలో పెట్టు బడులు పెట్టేందుకు తగిన సమయం. ఉద్యోగులకు ఊహించని రీతిలో పదోన్నతులు లభిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 4,5 తేదీల్లో కుటుంబంలో చికాకులు. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఊహించని వ్యక్తులతో పరిచయాలు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు సైతం పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పరిశోధకులు, క్రీడాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. 6,7 తేదీల్లో మానసిక ఆందోళన. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.

About Author

By editor

Twitter
Instagram