‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
అలా తల్లీ కూతుళ్లిద్దరూ ఒక అచేతనావస్థలో చాలా సేపు ఉండిపోయారు. వాళ్లిద్దర్ని చూస్తూ శ్రీధర్ మౌనంగా ఉండిపోయాడు.
పదకొండేళ్లు పెంచిన తమకే అంత మమకారం ఉంటే నవమాసాలూ మోసిన కన్నతల్లి ధరణికి ఎంత ప్రేమ, మమకారం, పేగు బంధం ఉంటాయో కదా! అనిపించింది అతనికి.
జీవితంలో దేన్నైనా తట్టుకోవచ్చు కానీ కన్నపిల్లలకి దూరంగా బతకడం మాత్రం చాలా కష్టం. అటువంటి బడబాగ్నిని ధరణి కడుపులో దాచుకొని తల్లులందరూ ఓర్పులో భూదేవి లాంటి వారని నిరూపించింది.
కొద్దిసేపటికి ధరణి మామూలు మనిషైంది. ప్రియ తల్లి మంచం వి•ద కూర్చుని ఆమెనే చూడసాగింది. ఆ తరువాత శ్రీధర్ సంజ్ఞతో రామన్న ఆమెను బయటకు తీసికెళ్లాడు.
శ్రీధర్ ఆమె దగ్గరకు వచ్చి ‘‘ధరణీ! నేను శ్రీధర్ని.గుర్తు పట్టావా?’’ అడిగాడు..
‘‘గుర్తు పట్టాను మాస్టారూ? వి•కు ఉత్తరమైతే రాశాను కానీ..వి•రు పిల్లని తీసుకొని వస్తారని కలలో కూడా అనుకోలేదు’’ అంది ధరణి.
‘‘నీ కూతురికి నువ్వు ‘వనజ’ అని పేరు పెడితే మేము ‘ప్రియ’గా మార్చాము. అందుకు ఏవి• అనుకోకు. నీ ఉత్తరం చూడగానే ప్రియను నీ దగ్గరకు ఎలా తీసుకురావాలా? అని చాలా రోజులు ఆలోచించాను. ఆ సమయంలోనే వనజ కూడా నిన్ను చూస్తాననీ గొడవ పెట్టింది. తనను మేం పెంచుకుంటున్న సంగతి ఈ మధ్యనే దానికి తెలిసిపోయింది. దాంతో మా భార్యా భర్తలం తనను తీసుకుని కెంగువకు వచ్చాము. నువ్విక్కడున్నావని అప్పుడు వి• అక్క చెప్పింది. కాకపోతే ఇక్కడికి రావడం కష్టం అని నా భార్య కౌసల్య మీ అక్క దగ్గరే ఉండిపోయింది. ఇక్కడికి రావడానికి మేమే చాలా కష్టపడ్డాము. తోవ సరిగ్గా లేదు. దానికి తోడు మధ్యలో పోలీసుల చెకింగ్లు. అలా భయపడుతూ రావలసి వచ్చింది’’ వివరించాడు శ్రీధర్.
‘‘మాస్టారు గారూ! మీరు అప్పుడు వనజని తీసికెళ్లారనీ తెలిసి చాలా బాధపడ్డాను. కానీ అది తప్పని ఇప్పుడు తెలిసింది. ఆ రోజు దాన్ని మీరు తీసికెళ్లకుండా ఉండి ఉంటే అది ఎన్నో ఇబ్బందులు పడేది. మా అక్క పరిస్థితి కూడా అంతంత మాత్రం. అందువల్ల దీన్ని పోషించే స్థితి దానికి లేదు. వి•రు తీసికెళ్లబట్టి అది హాయిగా, ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకుంటోంది. ఇప్పుడు వనజని చూస్తే ఇది నా కూతురేనా అనీ ఆశ్చర్యం కలుగుతున్నది. ఏది జరిగినా మన మంచికే అంటారు. అది నా కూతురు విషయంలో నిజమైంది. దీని తండ్రి సోమన్న ఏమయ్యాడో తెలియదు. మా వాళ్లు అతన్ని చత్తీస్‌గఢ్ పంపించినట్లు చెప్పారు. అతని గురించి ఎవ్వరూ చెప్పటంలేదు. నేనా అనారోగ్యం పాలయ్యాను. రెండేళ్ల నుంచి క్షయవ్యాధితో బాధపడుతున్నాను. అప్పట్నుంచి మా వాళ్లు నన్ను ఇక్కడికి పంపించి వైద్యం చేయిస్తున్నారు. మా అక్క దగ్గరకు కెంగువ వెళదామంటే పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. అక్కడికి వెళితే వాళ్లు నన్ను అరెస్ట్ చేసి నానా హింసలు పెడతారన్న భయంగా ఉంది. పోనీ పోలీసులకు లొంగి పోదామనుకుంటే దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. నా ద్వారా ఉద్యమంలో ఉన్న మిగతా వారి ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తారు. అది ఉద్యమానికి మంచిది కాదు.
ఈ ఉద్యమం, పోరాటాలు, ఎన్కౌంటర్లు, మందుపాతర్లు పేల్చడాలు , అడవుల్లో గడపటం ఇదంతా ఒక ఊబి. ఇందులో దిగితే బయటపడటం కష్టం. అయినా నా లాంటి వాళ్లు వేరే గత్యంతరం లేక ఇందులోకి వస్తున్నారు. ఈ ఉద్యమం ఒక దీపం లాంటిది. దీని వేడికి మా లాంటి పురుగులు మాడి మసి అవక తప్పదు. ముప్పై ఏళ్ల ఈ ఉద్యమ ప్రస్థానం చూస్తే శ్రీశ్రీ చెప్పినట్లు ‘ఇప్పుడు ఏ వెలుగులకీ ప్రస్థానం?’ అని అనిపిస్తుంది’’ అని ఆయాస పడుతూ మాట్లాడసాగింది.
‘‘అంటే ఈ ఉద్యమ పోరాటాలు సరియైనవి కావంటావా? అలా అయితే ఎందుకి వీళ్లంతా కొండల్లో ఉంటూ పోలీసులతో పోరాడుతున్నారు? ఇంతకీ ఎవరిది తప్పు?’’ అడిగాడు శ్రీధర్.
‘‘ప్రభుత్వ వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయి, గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయని నక్సల్స్ తుపాకీ చేతపట్టి ఉద్యమం బాట పట్టారు. శాంతి భద్రతలకు విఘాతం అంటూ పోలీసులు వారిపై (మాపై) దాడులు చేస్తున్నారు. వీళ్ల మధ్య అమాయకులైన మా గిరిజనులు నలిగిపోతున్నారు. పోలీసుల దమన కాండతో ఎందరో గిరిజన యువతీ యువకులు నక్సలైట్లలో చేరిపోతున్నారు. అందుకు నేను, నా భర్త సోమన్నే సాక్షులం.
అలా అనీ పోలీసులదే తప్పు అనీ చెప్పలేము. శాంతిభద్రతలను కాపాడటం వాళ్ల బాధ్యత. వాళ్లు నక్సలైట్లకు శత్రువులు కారు. వాళ్లు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. కరవమంటే కప్పకు, వదలమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది రెండు పక్షాల పరిస్థితి.
ఎవరో ఒకరు తగ్గి, చర్చించుకుంటే ఇద్దరికీ మంచిది. అప్పుడు ఈ కొండల్లో ఉద్యమాలుండవు. అడవుల్లో పేలుళ్లుండవు. కొండల్లో అగ్గి చల్లారుతుంది. గిరిజన ప్రాంతలన్నీ అభివృద్ధికి నోచు కుంటాయి. ఎరుపెక్కిన కొండలన్నీ పచ్చదనంతో కళకళలాడతాయి’’ అంది ధరణి.
ఆమె మాట్లాడుతుంటే ఆయాసం దగ్గు వస్తున్నాయి. దగ్గు వచ్చిందంటే అది ఒక పట్టాన తగ్గటం లేదు. ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత భయంకరంగా అది ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దగ్గు తరువాత కఫం, కఫంలో రక్తం కూడా పడుతోంది.
ఆ విషయాన్ని శ్రీధర్ గమనించాడు. అతని కెందుకో ధరణి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదనిపించింది.
‘‘ధరణీ! ఇంతకీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్పారు? సరియైన మందులు వాడుతునావా?‘‘ అనీ అడిగాడు.
‘‘ప్రతి వారం డాక్టరు వస్తున్నాడు. అతను ఆర్.ఎం.పి. డాక్టరు. ఏవో ఇంజక్షన్లు, మందులు ఇస్తున్నాడు. నాకెందుకో సరియైన మందులు ఇవ్వటం లేదనిపిస్తోంది. ఎందుకంటే రోజు రోజుకీ నా పరిస్థితి విషమిస్తోంది. ఈ మధ్యన కఫంలో రక్తం కూడా పడుతున్నాది. అది క్షయ వ్యాధి ముదిరిందనేందుకు సంకేతం. ఆ విషయం చెబితే డాక్టరు గారు మందులు మారుస్తాను అని చెప్పారు.
పోనీ బయటకు వెళదామంటే చుట్టూ పోలీసుల వలయం ఉంది. వాళ్లను తప్పించుకొనీ వెళ్లడం కష్టం.నేను ప్రస్తుతం అంపశయ్య వి•ద ఉన్నాను మేస్టారూ! ఈ కట్టెలో ప్రాణం ఎన్నాళ్లుంటుందో తెలియదు.అది ఏ క్షణమైనా పోవచ్చు! ఆ అనుమానం వల్లే నా కూతుర్ని తీసుకురమ్మనీ వి•కు ఉత్తరం రాశాను.దానిని చూస్తానో, లేదో అనే ఆలోచనలు నన్ను వారం రోజుల నుంచి నిద్రపోనివ్వటం లేదు. చూడకుండా చనిపోతానేమో అన్న భయం వెంటాడింది.ఎలాగైతేనేం మీ దయ వల్ల దాన్ని చూడగలిగాను. నా కోసం చాలా కష్టపడి దాన్ని తీసుకు వచ్చారు. ఇప్పుడు దీన్ని చూస్తుంటే అది వి• దగ్గర హాయిగా బతుకుతోందనిపిస్తోంది. ఆ ఆలోచనే నాకు కాసింత తృప్తి నిస్తోంది. లేకపోతే అది అనాథలా బతకవలసి వచ్చేది’’ అంది ధరణి చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ.
శ్రీధర్ ఆమెవైపు చూడసాగేడు. ఆమె కళ్ల వెంబడి ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. అందువల్ల మళ్లీ దగ్గు ముంచుకు వచ్చింది.
శ్రీధర్ ఆమె పరిస్థితిని చూసి చలించిపోయాడు.
‘‘ధరణీ! ఏడవకు. పిల్ల బయట ఉంది. అది వింటే భయపడుతుంది. నువ్వు ఇలా అనారోగ్యంతో మరింత బాధపడుతున్నట్లు తెలిస్తే తట్టుకోలేదు.నేను పోలీసులతో మాట్లాడతాను. అవసరమైతే ఎస్పీగారిని కలిసి నువ్వు బయటకు రావటానికి అనుమతిని తీసుకుంటాను.అప్పుడు నీకు మంచి వైద్యం అందించే అవకాశం వస్తుంది. విశాఖపట్నంలో నాకు తెలిసిన మంచి డాక్టరు ఉన్నారు. ఆయన దగ్గర చికిత్స తీసుకుంటే నెలరోజుల్లోనే నువ్వు మామూలు మనిషివి అవుతావు. ఈ రోజుల్లో క్షయకి ‘స్ట్రెప్టోమైసిన్’ లాంటి మంచి మందులున్నాయి. ఇది ప్రాణాంతకం కాదు’’ అరి చెప్పాడు శ్రీధర్.
‘‘మాస్టారు గారూ! ఆ ప్రయత్నం చెయ్యకండి. నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలుసు. దీన్ని ఏ డాక్టరూ బాగు చెయ్యలేడు. పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఇప్పుడు ఆ దేవుడు కూడా నాకు ఆయుష్షు పొయ్యలేడు.కిందకు వెళ్లినా అది వృథా ప్రయత్నమే అవుతుంది. దేనికైనా ఒక సమయం అంటూ ఉంటుంది. అప్పుడే అది ఫలితానిస్తుంది.
ఇక నేను ఆ వచ్చే పిలుపు కోసం ఎదురు చూడవలసిందే. ఏదైనా నా మాట మన్నించి నా కూతుర్ని తీసుకొచ్చి నా జీవిత చరమాంకంలోని నా కోరికను తీర్చినందుకు మీకు కృతజ్ఞతలు. లేకపోతే దాన్ని చూడలేదనే బాధతో చనిపోయేదాన్ని. అది నా ఆత్మకు శాంతికలిగించదు. మాలాంటి పేదవాళ్ల బతుకులు ఇంతే బాబూ! ఇవి సాఫీగా సాగవు. అవకాశం ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు సాగనివ్వరు. మా లాంటి పేదవాళ్లు పిల్లలను కనకూడదు బాబూ! కంటే జీవితాంతం వాళ్లు బాధలు పడవలసిందే. ఈ ప్రపంచం డబ్బున్న వాళ్లది. పేదవాళ్లకు బతికే అర్హత లేదు ఈ లోకంలో’’ అంది నిర్వేదంగా ధరణి.
ఆమె మాటలు శ్రీధర్గుండెల్ని కదిలించాయి. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అతనికి.
‘‘ధరణీ! నువ్వు కోరినట్లు వనజని తీసుకొచ్చాను. ఆ రోజు నీకు చెప్పకుండా నీ పిల్లని మేము తీసికెళ్లి పెంచుకున్నాం. అప్పట్లో నీకు చెప్పాలనుకున్నా నువ్వు కనపడకపోవడం వల్ల అది సాధ్యపడలేదు. అయినా వనజకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాం. అయినా పెంచిన వారికి కన్నవారు సాటిరారు. ఎంతైనా కన్నవాళ్లు కన్నవాళ్లే. కానీ అందరికీ కన్నవాళ్ల దగ్గర పెరిగే అదృష్టం దొరకదు. నువ్వు వనజ కన్నతల్లివి. దాని వి•ద పూర్తి అధికారం నీదే. ఇప్పుడు నీ పిల్లని ఇక్కడ వదిలెయ్యమంటే ఉంచేస్తాను. లేదు మీ అక్క గౌరికైనా అప్పగిస్తాను. ఎక్కడున్నా ఆ పిల్ల బాగుండాలి. అది హాయిగా బతకాలి. శ్రద్ధగా చదువుకోవాలి. అదే మనం ఆ బిడ్డకు ఇవ్వగలిగే బహుమానం. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. మేము వచ్చి చాలా సేపైంది. ఆలస్యం అయితే తిరిగి వెళ్లడం కష్టం. అదీ కాక పోలీసుల గస్తీ ఎక్కువగా ఉంది. చీకటి పడితే వెళ్లడం కష్టం’’అన్నాడు శ్రీధర్.
అతని మాటలకు ధరణి నిశ్చేష్టురాలైంది. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే కొద్దిసేపు మౌనం దాల్చింది. ఆ తరువాత శక్తి కూడదీసుకొని చెప్పడం మొదలు పెట్టింది.
‘‘మాస్టారూ! ఇప్పుడు నా ఆరోగ్యం బాగులేదు. ఎన్నాళ్లు బతుకుతానో తెలీదు. ఇది గాల్లో దీపం. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నేను పిల్లను పెంచలేను. బతకడానికి ఒకరి దయా దాక్షిణ్యాల వి•ద ఆధారపడుతున్నదాన్ని. పైగా ఇక్కడ వాతావరణం సరియైనది కాదు. ఏ సదుపాయాలూ లేవు. నా కూతురు మీ దగ్గర హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా పెరుగు తున్నది. పదిమందికి విద్య చెప్పే మీ నీడలో చక్కగా చదువుకుంటునాది.
దానికి ఏలోటూ లేకుండా మీ భార్యాభర్తలు పెంచుతున్నారు. కేవలం కన్నతల్లినన్న కారణంగా దానిని నా దగ్గర ఉంచుకోవడం అన్నది దానికి నష్టం చేస్తుంది. దాని జీవితాన్ని పాడుచేస్తుంది. ఏ తల్లి అయినా కోరుకునేది పిల్లల బాగోగులే. వాళ్లు ఎక్కడున్నా హాయిగా ఉండాలనే తల్లి మనసు ఆరాటపడుతుంది. మా అక్క కూడా దాన్ని సరిగ్గా పెంచలేదు. కాబట్టి నా కూతురు వనజ పెరగ వలసింది మీ దగ్గరే’’ ఆమె మాట్లాడుతుంటే దగ్గు ముంచుకొచ్చింది. కొద్దీసేపటికి తేరుకొనే మళ్లీ చెప్ప సాగింది.
‘‘అది నా దగ్గర ఉన్నది మూడేళ్లే. కానీ వి• దగ్గర పదేళ్లు పెరిగింది. దాని పేరు కూడా మీరే మార్చారు. ఆ పేరుతోనే అది మీ పిల్లగానే పెరగ నివ్వండి. దానికి మీ దంపతుల ఆసరా ఇప్పుడు చాలా అవసరం. అది మంచి విద్యాధికురాలై ఉన్నత స్థాయికి చేరుకుంటే కన్నతల్లిగా నా కన్నా సంతోషించే వారెవరూ ఉండరు.
దాని నుదుట వి•ద భగవంతుడు ఏం రాసేడో కానీ వి•రు దాన్ని తీసికెళ్లి ఆ రాతను మార్చేసారు. ఒక విధంగా చెప్పాలంటే అది తల్లి తండ్రులున్న ఒక అనాథ•. దాన్ని వి• దగ్గరకు పంపి ఆ దేవుడే కాపాడాడు. ఏది చేసినా దేవుడు మంచే చేస్తాడు. ఆ దేవుడు మీ రూపంలో నా పిల్లని కాపాడాడు’’.
ఒకవేళ ఆ దేవుడి దయ వల్ల అన్నీ అనుకూలించి నా ఆరోగ్యం కుదుటపడితే నేనే మీ ఇంటికి వచ్చి దాన్ని చూస్తాను. అది ఎక్కడ ఉన్నా నా తల్లి మనసు మాత్రం దాని మంచే కోరుకుంటుంటుంది. మీరు దాన్ని మీ పిల్లే అనుకొనీ పెంచి పెద్దచెయ్యండి. ఇంతకన్నా ఈ కన్నతల్లి ఏవి• ఆశించదు, కోరుకోదు’’ అంది చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ.
‘‘తప్పకుండా ధరణీ! ఒక పెంచిన తండ్రిగా కాక ఓ ఉపాధ్యాయుడిగా చెబుతున్నాను. తన జీవితం బాగుండాలంటే మంచి చదువు అవసరం. అది నేను కల్పిస్తాను. ఆమెకు ఉజ్జ్వల భవిష్యత్తు కలిగేలా తయారు చేస్తాను. దేవుడి దయవల్ల నీ ఆరోగ్యం బాగుపడితే నువ్వు కూడా మా దగ్గరికి వచ్చేయ వచ్చు.అప్పుడు నువ్వే స్వయంగా దగ్గరుండి నీ కూతుర్ని చదివించుకోవచ్చు. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రియ గురించి ఏమీ దిగులు పడకు.’ అన్నాడు చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ శ్రీధర్.

-గన్నవరపు నరసింహ మూర్తి