అణచివేత నిర్బంధాలను తెంచిన వీరనారీ వ•ర్తులు. చీకటిని చీల్చి స్వేచ్ఛాభానుడిని గెలిచిన పోరాట స్ఫూర్తులు! సమానత్వ సాధనలో ఎగసిపడిన జ్వాలలు. ఒకే వేదికపై కదం తొక్కిన ఇరవై వేల గళాలు. గాయాలనే ఆయుధాలుగా మార్చి, కష్టాలనే పాఠాలుగా మలచి, వివక్షపై విజయం సాధించి చరిత్ర పుటల్లో నిలిచారు. గుండె ధైర్యమే ఆభరణంగా, పట్టుదలే ఊపిరిగా ముందుకు సాగుతూ…ప్రపంచ మహిళా లోకానికే దక్షిణాఫ్రికా నారీమణులు ఆదర్శంగా నిలిచారు.

వర్ణవివక్ష సృష్టించిన అణచివేత… ఆ మహిళ లను బలహీనపరచలేదు. బదులుగా వారిని ఉక్కు పిడికిళ్లుగా మార్చింది. సామాజిక హింస, వివక్షే వారికి ఆయుధాలుగా మారాయి. దశాబ్దాల పాటు సాగిన తీవ్రమైన భౌతిక, మానసిక నిర్బంధాలను తట్టుకుని నిలబడిన ఆమహిళలు, చీకట్లను చీల్చు కుంటూ దేశ విముక్తి సాధనలో అపూర్వమైన చొరవ చూపారు. ఆ అజేయమైన పోరాట పటిమ నేడు ప్రపంచ మహిళా లోకానికే దిక్సూచిగా నిలిచింది.

ప్రత్యేక మహిళా దినోత్సవ నేపథ్యం: ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ జరుపుకుంటే, దక్షిణాఫ్రికాలో మాత్రం ఆగస్టు 9న ‘జాతీయ మహిళా దినోత్సవం’గా జరుపుకుంటారు. దీని వెనుక ఒక మహత్తరమైన చారిత్రక ఘట్టం ఉంది.1956 ఆగస్టు 9న దాదాపు 20,000 మంది మహిళలు రంగుల ఆధారంగా తమ స్వేచ్ఛను హరించే ‘పాస్‌ ‌చట్టాల’కు వ్యతిరేకంగా ప్రిటోరియాలోని •••నియన్‌ ‌బిల్డింగ్స్ ‌వైపు అడుగులు వేశారు. ఆ నిరసన ప్రదర్శన దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర ఉద్యమంలోనే ఒక తిరుగులేని మలుపు.

తిరుగుబాటు జ్వాలలను రగిలించిన ఉద్యమ నేతలు:ఉద్యమ సమయంలో పురుషులంతా జైళ్లలో బందీలుగా ఉన్నా, అజ్ఞాతంలోకి వెళ్లినా.. మహిళలు మాత్రం  ధైర్యంగా బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. ఒకవైపు కుటుంబాలను పోషిస్తూనే, మరోవైపు పిల్లలను పెంచుతూ ఊరూరా తిరుగుబాటు సందేశాలను మోసుకెళ్లారు. నెల్సన్‌ ‌మండేలా 27 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవిస్తున్న కాలంలో, ఉద్యమ జ్వాలలు ఆరిపోకుండా విన్నీ ‘‘మదర్‌ ఆఫ్‌ ‌ది నేషన్‌’’‌గా నిలబడి పోరాటాన్ని ముందుండి నడిపించారు. జాతి, రంగు, వర్గ భేదాలు లేకుండా ప్రజలందరినీ ఏకం చేసి సమానత్వం కోసం పోరాడవచ్చని లిలియన్‌ ‌న్గోయి, హెలెన్‌ ‌జోసెఫ్‌ ‌నిరూపించారు. భిన్నమైన సామాజిక, సాంస్కృతిక నేపథ్యాల నుండి వచ్చినా, ప్రజాస్వామ్య పునాదుల కోసం రహీమా వ•సా, సోఫియా విలియమ్స్ ‌ముందు వరుసలో నిలిచారు. వర్ణవివక్ష వ్యతిరేక పోరాటంలో మహిళాశక్తిని ఏకం చేస్తూ, సమాజ సేవనే ఊపిరిగా అల్బెర్టినా సిసులు జీవించారు.

పోరాట కాలంలోనే కాకుండా, ప్రజాస్వామ్యం సిద్ధించిన తర్వాత ‘ట్రూత్‌ అం‌డ్‌ ‌రీకన్సీలియేషన్‌ ‌కమిషన్‌’ (‌టిఆర్‌సి) ద్వారా ద్వేషాన్ని పక్కన పెట్టి, క్షమా గుణంతో దేశంలో శాంతిభద్రతల స్థాపనకు వీరంతా విశేష కృషి చేశారు. ఆఫ్రికన్‌ •••నియన్‌ ‌కమిషన్‌ ‌మాజీ అధ్యక్షురాలు ఎన్కోసజానా ద్లామిని-జుమా వంటి నాయకురాళ్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు.

1996లో రూపొందించిన దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య రాజ్యాంగం లింగ సమానత్వానికి, మహిళల హక్కులకు పూర్తి చట్టపరమైన భరోసా ఇచ్చింది. చట్టసభలో, పార్లమెంట్‌లో 45 శాతానికి పైగా మహిళా ప్రాతినిధ్యం సాధించి, ప్రపంచంలోనే అత్యధిక మహిళా ప్రజాప్రతినిధులున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. రాజకీయాల్లోనే కాకుండా కార్పొరేట్‌ ‌రంగాలు, బ్యాంకింగ్‌, ‌ప్రభుత్వ పరిపాలనా విభాగాలలో మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.

సాంస్కృతిక సౌందర్యం, ప్రాచీన కళలు: దక్షిణాఫ్రికా కేవలం పోరాటాల గడ్డ మాత్రమే కాదు, వైవిధ్యమైన సంస్కృతులకు నిలయం. అందుకే ఈ దేశాన్ని ‘‘రెయిన్‌బో నేషన్‌’’ అని పిలుస్తారు.

సాంప్రదాయ అలంకరణలు: వివాహితులు ధరించే ‘ఇసిచాలో’ అనే విశాలమైన టోపీలు, రంగురంగుల పూసల ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ముఖంపై ‘ఇంబిజో’ అనే తెల్లటి వర్ణాల డిజైన్లు వేసుకోవడం, మెడ, కాళ్లకు ‘ఇండ్జీలా’ అనే లోహపు ఉంగరాలను ధరించడం వీరి ప్రాచీన కళాత్మకతను చాటిచెబుతాయి.

వ్యాపార చొరవ: పూసల అలంకరణ, హస్తకళలు, కుండల తయారీ వంటి ప్రాచీన కళలను కాపాడుకుంటూనే, నేటి మహిళా వ్యాపారవేత్తలు ఆ కళా ఖండాలను అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నారు.

సఫారీ మహిళల సత్తా: క్రీడల్లోనూ దక్షిణాఫ్రికా మహిళలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటు న్నారు. క్రికెట్‌లో లారా వోల్వార్డ్, ‌మారిజానే కాప్‌ ‌వంటి ప్రపంచస్థాయి స్టార్‌ ‌ప్లేయర్ల సఫారీ జట్టును అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టారు. 2025లో జరిగిన మహిళా వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌ ‌మెట్లు ఎక్కడమే వీరి క్రీడా ప్రగతికి, క్రమశిక్షణకు బలమైన నిదర్శనం.

అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నప్పటికీ, నేటికీ అక్కడి మహిళలు కొన్ని తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకే సమాజంలో లింగ ఆధారిత హింసను అరికట్టేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

ఆర్థిక అసమానతలు: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఇప్పటికీ నిరుద్యోగం, పేదరికం, వనరుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు.

ఆరోగ్య సంక్షోభం: హెచ్‌.ఐ.‌వి. బారిన పడుతున్న వారిలో మహిళలసంఖ్య ఎక్కువగా ఉండటం ప్రజారోగ్య రంగానికి పెద్ద సవాలుగా మారింది. అణచివేత, హింస మనుషులను బలహీను లను చేయవని.. న్యాయం వైపు నిలబడే ధైర్యం ఉంటే మనిషి అజేయమైన శక్తిగా మారవచ్చని దక్షిణాఫ్రికా మహిళల చరిత్ర నిరూపించింది. సాధించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూనే, నేటికీ మిగిలి ఉన్న పేదరికం, లింగవివక్షపై వారు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. కష్టాలకు లొంగి పోకుండా మార్పు కోసం నిలబడటమే అసలైన స్ఫూర్తి అని చాటిచెప్పిన ఈ పోరాటయోధులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ధైర్యానికి, స్వతంత్ర భావాలకు సజీవ సాక్ష్యాలు!

జయశ్రీ ఆచంట,

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.