సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కార్యక్రమాలలో  విజయం సాధిస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహయోగాలు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.  వ్యాపారస్తులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.  క్రీడాకారులు, రచయితలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 12,13 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. గత సమస్యలు సైతం తీరతాయి. బంధువులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు సమకూర్చుకోవడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కొంత తగ్గుతాయి. రాజకీయవేత్తలు, వైద్యుల సేవలు గుర్తింపు పొందుతాయి. రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 14,15 తేదీల్లో  దూరప్రయాణాలు. అనారోగ్యం. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరులు,సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. అదనపు ఆదాయం సమకూరుతుంది.  కుటుంబ విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. గృహ, వాహనయోగాలు. ఆస్తుల కొనుగోలు యత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం.  వ్యాపారస్తులు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడాకారులు, వైద్యులకు అన్నింటా విజయాలే. 9,10 తేదీల్లో  అనుకోని ఖర్చులు. స్వల్ప అనారోగ్య సూచనలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

చిన్ననాటి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఒక కోర్టు వ్యవహారం అనుకూలిస్తుంది. శుభకార్యాలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. కొన్ని పాతబాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు కొత్త సంస్థలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఈతిబాధలు తొలగుతాయి. కళాకారులకు కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారుల కృషి ఫలించే సమయం. 10,11 తేదీల్లో  దూరప్రయాణాలు. అనారోగ్యం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

అనుకున్న కార్యక్రమాలు  దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి. చర, స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. విద్యార్థులు అనుకూల ప్రభావంతో  విజయాల బాటలో నడుస్తారు. ప్రత్యర్థులు సైతం వి•కు తోడుగా నిలుస్తారు. ఇంటాబయటా వి•కు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. క్రీడాకారులకు అవకాశాలు పెరుగుతాయి. 12,13 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులు, స్నేహితులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలిసిరావు. కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.  వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి.  ఉద్యోగులకు  కొద్దిపాటి చికాకులు. పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహమే. రచయితలు, పరిశోధకులకు ఒత్తిడులు పెరుగుతాయి. 10,11 తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. గణేశాష్టకం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం కొంత నిరుత్సాహపరుస్తుంది. అయితే అవసరాలకు ఇబ్బందులు ఉండవు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. శుభకార్యాలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.్య ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు జతచేరతారు. ఉద్యోగులు మార్పులకు సిద్ధంగా ఉండాలి. పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం. 5,6 తేదీల్లో సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలపై చర్చలు సఫలం. సమాజంలో ఆదరణ. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ప్రత్యర్థులు సైతం వి• నైపుణ్యాన్ని మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు అనూహ్యమైన ప్రగతి ఉంటుంది. ఉద్యోగస్తులు నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. కళాకారులు, వైద్యులకు సమస్యలు తీరతాయి. క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు 14,15తేదీల్లో దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయం కొంత నిరాశ కలిగించినా అవసరాలకు సొమ్ము లభిస్తుంది. కుటుం బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని కార్యాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటువద్దు. దేవాలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి.  వ్యాపారస్తులు అనుకున్న మేర లాభాలు ఆర్జిస్తారు.  ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొంత అనుకూలత . కళాకారులు, పరిశోధకులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. 12,13 తేదీలలో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. శ్రీసుబ్రహ్మణ్య ధ్యానం మంచిది.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైనరీతిలో కార్యక్రమాలు పూర్తి కాగలవు. రావలసిన సొమ్ము అందుతుంది. స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలలో సమర్థత చాటుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారస్తులకు సంతోషకరమైన సమాచారం.  ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాదిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.  14,15 తేదీల్లో ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. శివాష్టకం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. యత్నకార్యసిద్ధి. వి•లోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతన వస్తులాభాలు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో వి• మాటే చెల్లుతుంది. రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం. రచయితల ఆశలు ఫలించే సమయం. 10,11 తేదీలలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రీకృష్ణస్తుతి మంచిది.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. బంధువులు, స్నేహితుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.  సమాజంలో పరపతి పెరుగుతుంది. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. బంధువులు వి•పై మరింత ప్రేమాభిమానాలు చూపుతారు. వ్యాపారస్తులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పురోభివృద్ధి కనిపిస్తుంది. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు. క్రీడాకారులకు శుభవార్తలు. 12,13 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో చికాకులు. దత్తస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE