ఇటీవలి నెలల్లో భారతదేశాన్ని సందర్శించే ప్రపంచ నాయకుల సంఖ్య భారీగా ఉంది. అలా భారతదేశాన్ని సందర్శించిన అగ్ర నాయకులలో రష్యా నాయకుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌, ‌ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ ‌మాక్రాన్‌, ‌బ్రెజిలియన్‌ అధ్యక్షుడు లూలా డా సిల్వా, యూరోపియన్‌ ‌కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ఉర్సులా వాన్‌ ‌డెర్‌ ‌లేయన్‌ ఉన్నారు. మార్చి మొదటి వారంలో ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ ‌స్టబ్‌ ‌సందర్శించారు. ప్రపంచ శాంతిని నిర్ధారించడంలో, అనేక సంఘర్షణలకు సామరస్యపూర్వక పరిష్కారం తీసుకురావడంలో భారతదేశం ప్రాముఖ్యత గురించి వారందరూ ఏకగ్రీవంగా మాట్లాడుతున్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత స్థానం కల్పించాలని అనేక మంది ప్రపంచ నాయకులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. భద్రతా మండలిలో భారతదేశానికి స్థానం కల్పించాలని ఫిన్లాండ్‌ అధ్యక్షుడు ఇటీవల అన్నారు. ఇది చాలా ముఖ్యమైనదని ఆయన తెలిపారు. సభ్యత్వం, బాధ్యతల పరంగా ఐక్యరాజ్యసమితి, ఇతర అంత ర్జాతీయ సంస్థలను సంస్కరించాలని స్టబ్‌ ‌పిలుపు నిచ్చారు. నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా అంతర్జాతీయ సంస్థలను సంస్క రించాలని ఆయన అన్నారు. కొత్త ప్రపంచ క్రమాన్ని రూపొందించడంలో భారతదేశం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
గత 10 నుండి 15 సంవత్సరాలుగా భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం ప్రపంచ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పటికీ, 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత వారి స్వరాలు మరింత బిగ్గరగా మారాయి. వారు ఆయనను, ఆయనతో పాటు భారత దేశాన్ని అంతర్జాతీయ వేదికపై కీలక పాత్రధారిగా చూస్తున్నారు. స్టబ్‌ ‌పేర్కొన్నట్టు మోదీ ప్రత్యేకత ఏమిటంటే, అందరినీ కలుపుకొనిపోతూ, అంతటా స్థిరమైన సంబంధాలను కొనసాగించగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం. భారత్‌ ‌దౌత్య నైపుణ్యాలను, అందరితో సంబంధాలను కొనసాగించే సామర్థ్యాన్ని ఆయన గణనీయంగా ప్రశంసించారు. అందువల్ల భారతదేశం ‘‘ఎవరితోనైనా మాట్లాడగల’’ కొన్ని దేశాలలో ఒకటిగా నిలిచింది.
ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనలు, కీలక నాయకులతో ఆయన సమావేశాల ద్వారా కూడా ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారతదేశం స్థాయిని అంచనా వేయవచ్చు. గత కొన్ని నెలల్లో ఆయన జోర్డాన్‌, ఇథియోపియా, ఒమన్‌, ‌దక్షిణాఫ్రికా, మలేషియా, భూటాన్‌, ఇటీవల ఇజ్రాయెల్‌ ‌దేశాలను సందర్శించారు. వాస్తవానికి, ఆయన ఇజ్రాయెల్‌ ‌పర్యటన ముగిసిన వెంటనే (ఫిబ్రవరి 25, 26), ఇజ్రాయెల్‌-అమెరికా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. వారు ట్రిగ్గర్‌ను నొక్కడానికి ముందు మోదీ పర్యటన ముగిసి భారతదేశానికి సురక్షితంగా తిరిగి రావడానికి వేచి ఉన్నట్లుగా ఉంది. ఈ పర్యటన సందర్భంగా, ఇజ్రాయెల్‌ ‌ప్రధానమంత్రి బెంజమిన్‌ ‌నెతన్యాహు భారతదేశంలో, ప్రపంచంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆయన మోదీని ‘‘ఇజ్రాయెల్‌కు గొప్ప స్నేహితుడు’’ అని, ప్రపంచ వేదికపై గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. ఆయన మోదీని ఇజ్రాయెల్‌ ‌పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించమని ఆహ్వానించారు. మోదీ ప్రసంగం అసాధారణ మైనదిగా, హృదయాన్ని కదిలించేదిగా అభివర్ణిం చారు. ‘‘నెస్సెట్‌లో మీ(మోదీ) ప్రసంగం తర్వాత ఇజ్రాయెల్‌లో కంటతడిపెట్టనివారు ఒక్కరు కూడా లేరు’’ అని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యంలో గొప్ప చర్యలలో ఒకటిగా నెహ్రూ-గాంధీ కుటుంబం అనేక దశాబ్దాలుగా మొండిగా ప్రతిఘటించిన ఇజ్రాయెల్‌తో భారతదేశ సంబంధాన్ని దృఢంగా స్థాపించడాన్ని చెప్పుకోవాలి. ఇజ్రాయెల్‌లో మెజారిటీగా ఉన్న యూదులతో మెజారిటీ భారతీయులు స్నేహపూర్వక భావాలను కలిగి ఉన్నప్పటికీ, నెహ్రూ-గాంధీలు యూదు రాజ్యంతో స్నేహపూర్వక సంబంధాలను ఎప్పుడూ కోరుకోలేదు. ఎందుకంటే అది వారి ఓటు బ్యాంకు – ముస్లింలను బాధపెడుతుంది కాబట్టి. ఫలితంగా, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ ‌గాంధీ దేశాన్ని పాలించినప్పుడు భారతదేశం అనేక దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు కలిగి లేదు. 85 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు, ప్రధానంగా హిందువులు, యూదుల పట్ల హృదయపూర్వక భావాలను కలిగి ఉన్నప్పటికీ, ఈ కుటుంబం విదేశాంగ విధానం విషయంలో ముస్లిం మైనారిటీ నేతృత్వంలో ఉండటానికి అనుమ తించింది. తొమ్మిది సంవత్సరాల క్రితం మోదీ సందర్శించేంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా ఆ దేశాన్ని సందర్శించలేదు. ప్రధానమంత్రి మోదీ తన పదవీకాలంలో దానిని సరిదిద్దారు. ఈ కూటమి (ఇండియా-ఇజ్రాయెల్‌) ‌నుండి రెండు దేశాలు చాలా ప్రయోజనం పొందుతాయి. భారతదేశానికి సంబంధించినంతవరకు, ఈ కూటమి దాని వ్యూహాత్మక భాగస్వామ్యం కారణంగా దేశ రక్షణ సామర్థ్యాన్ని బలపరుస్తుంది. ఇజ్రాయెల్‌ ఆయుధ ఎగుమతుల్లో మూడింట ఒక వంతు భారతదేశానికి వెళుతుంది. ఇజ్రాయెల్‌ ‌కూడా వేలాది మంది భారతీయ శ్రామికులను ఆహ్వానిస్తోంది. కానీ 1992లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ దేశంతో అధికారిక దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా ఇజ్రాయెల్‌ ఒం‌టరితనాన్ని అంతం చేసిన ఘనత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు కూడా దక్కాలి. ఆ సమయంలోనే ఇజ్రాయెల్‌ ‌న్యూఢిల్లీలోని లే మెరిడియన్‌ ‌హోటల్‌లో తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది.
ఇదంతా కూడా ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్‌, ‌మరోవైపు ఇరాన్‌ ‌మధ్య జరుగుతున్న ప్రస్తుత యుద్ధంతో భారతదేశం ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుందీ తెలియజేస్తుంది. మధ్యప్రాచ్యం, అరబ్‌ ‌ప్రపంచం శతాబ్దాలుగా సంఘర్షణలో మునిగిపోవడం నిజంగా అత్యంత దురదృష్టకరం. చాలా సంవత్సరాలుగా, ఆ ప్రాంతంలోని చాలా ఇస్లామిక్‌ ‌దేశాలు ఇజ్రాయెల్‌, అమెరికాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తూ ఈ ప్రాంతంలో రాజకీయాలు చేసింది. ఏ సందర్భంలోనైనా సోవియట్‌ ‌యూనియన్‌తో, తన ‘‘శత్రువులతో’’ పోరాడటానికి అనేక ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించింది.
ఇరాన్‌పై అమెరికా దాడి ఫలితంగా, హార్ముజ్‌ ‌జలసంధి ద్వారా రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. ఎందుకంటే బీమా సంస్థలు జలసంధిని దాటే నౌకలకు బీమా చేయడానికి ఇష్టపడవు కాబట్టి. ఇది సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, ‌కువైట్‌, ఇరాక్‌, ఇరాన్‌ ‌సహా మొత్తం గల్ఫ్‌లోని చమురు ఎగుమతిదారులను ప్రభావితం చేసింది. హార్ముజ్‌ ‌ద్వారా నౌకలు రవాణా చేయకపోవడంతో, ఇరాన్‌ ‌చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాని ఆర్థిక వ్యవస్థ, యుద్ధ ప్రయత్నాలను ప్రభావితం చేసాయి.
ఇంతలో, మోడీ పాలనలో, భారతదేశం తన చమురు దిగుమతులను తెలివిగా గల్ఫ్ ‌దేశాలు, ఇరాన్‌, ఇరాక్‌ ‌నుండి రష్యాకు మళ్లించింది. భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుండి దిగుమతు లను పెంచాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, ఒమన్‌, ‌బహ్రెయిన్‌లను ఇరాన్‌ ‌క్షిపణులు తాకినప్పుడు, భారతదేశం ఈ దాడులను ఖండించింది. ఆ తర్వాత వెంటనే, నరేంద్ర మోదీ సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ ‌నాయకులతో మాట్లాడి, ఇరాన్‌ ‌గల్ఫ్ ‌దేశాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఇజ్రాయెల్‌ ‌ప్రధాన మంత్రి నెతన్యాహు, జోర్డాన్‌ ‌రాజు అబ్దుల్లాతో కూడా ఆయన మాట్లాడారు. వివాదం పెరగడం పట్ల భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోందని, సత్వరం సంయమనం పాటించాలని సూచించారు.
ఇది నిజంగా అద్భుతమైన దౌత్యం. 9 లక్షలకు పైగా భారతీయులు జీవనోపాధి పొందుతున్న గల్ఫ్ ‌దేశాలతో భారతదేశం బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ, దశాబ్దాలుగా ఈ ఇస్లామిక్‌ ‌దేశాలతో విభేదిస్తున్న ఇజ్రాయెల్‌తో తన సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఇది వింతగా అనిపించవచ్చు, అరబ్‌ ‌ప్రపంచంలో ప్రస్తుత యుద్ధంలో, ఇరాన్‌ ‌క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్‌, ‌సున్నీ నాయకుల పాలించే చాలా ఇస్లామిక్‌ ‌దేశాలు ఒకే వైపున ఉండటం కనిపిస్తుంది. అందువలన, ఇజ్రాయెల్‌తో భారతదేశ సంబంధాలు అరబ్‌ ‌దేశాలతో దాని సంబంధాలకు హాని కలిగించకుండా నరేంద్ర మోదీ నిర్ధారించారు. భారతదేశం దౌత్యం ఫలితంగా లేదా మరేదైనా కారణంగా, ఇరాన్‌ ‌తాత్కాలిక నాయకుడు తన క్షిపణుల దాడికి గురైన అరబ్‌ ‌దేశాలకు ‘‘క్షమాపణ’’ చెప్పారు. కవ్వింపునకు పాల్పడని దేశంపై ఇరాన్‌ ‌దాడి చేయదని స్పష్టం చేశారు.
అదే సమయంలో భారతదేశం ఇరాన్‌ను పూర్తిగా విడిచిపెట్టలేదు. ఇరాన్‌తో ఉన్న పాత సంబంధాల దృష్ట్యా, అమెరికా-ఇజ్రాయెల్‌ ‌సంయుక్త క్షిపణి దాడిలో ఇరాన్‌ ‌నాయకుడు అల్‌ ‌ఖమేనీ మృతి పట్ల భారతదేశం సంతాపం తెలిపింది. న్యూఢిల్లీలోని ఇరాన్‌ ‌రాయబార కార్యాలయంలో భారత ప్రభుత్వం తరపున భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ సంతాప పుస్తకంలో సంతకం చేశారు. అలాగే, విదేశీవ్యవహారాల మంత్రి డాక్టర్‌ ‌జైశంకర్‌ ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రితో టెలిఫోన్‌ ‌సంభాషణ నిర్వహిం చారు. అమెరికన్‌ ‌జలాంతర్గామి ఢీకొన్న ఇరాన్‌ ‌నౌక నుండి వచ్చిన విపత్తు సంకేతాలకు భారతదేశం స్పందించినప్పుడు కూడా తన మానవతా బాధ్యత లను నిర్వర్తించింది. దాదాపు అదే సమయంలో, కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా మరొక ఇరాన్‌ ‌నౌకకు కొచ్చిలో ఆశ్రయం ఇచ్చింది.
చివరగా, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. 2025 చివరి త్రైమాసికంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌తన ఛాతీని కొట్టుకుంటూ, భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడం కొనసాగిస్తే 25 శాతం శిక్షాత్మక ఆంక్షలు విధిస్తామని బెదిరించారు. యూరోపియన్‌ ‌యూనియన్‌తో భారతదేశం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత, అమెరికా తన నోటిదురుసు తనాన్ని తగ్గించుకుని, త్వరగా భారతదేశంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు, దౌత్యపరంగా అద్భుతమైన చర్యలు చేపడుతున్న భారత్‌ ‌పట్ల అమెరికా తన విధానాన్ని మృదువుగా చేసుకుంది. సరఫరాలను సులభతరం చేయడానికి భారతదేశం రష్యన్‌ ‌చమురును కొనుగోలు చేయవచ్చని ఇప్పుడు ప్రకటించింది. తరువాత భారతదేశం రష్యన్‌ ‌చమురును అమెరికన్‌ ‌చమురుతో భర్తీ చేస్తుందని, కానీ ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక చమురు అంతరాన్ని తగ్గించడానికి, భారతదేశం రాబోయే ఒక నెల పాటు తన కొనుగోళ్లను కొనసాగించవచ్చని అమెరికా ఖజానా మంత్రి స్కాట్‌ ‌బెసెంట్‌ ‌పేర్కొన్నారు.
ఇది నిజంగా అదనపు ప్రయోజనం చేకూరుస్తు న్నట్టుగా మోదీ అమెరికన్లకు లొంగిపోయారని ఆరోపిస్తున్న ప్రతిపక్ష నాయకులకు తగిన సమాధానం ఇచ్చింది.

ఎ. ‌సూర్య ప్రకాష్‌

About Author

By editor

Twitter
YOUTUBE