సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అనూహ్యమైన రీతిలో సొమ్ము అందుతుంది. సోదరీసోదరుల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలలో విఘ్నాలు తొలగి ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రతిభా వంతులుగా మంచి గుర్తింపుతో పాటు, విశేష ఆదరణ పొందుతారు. వాహనాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు శ్రమ ఫలించి ఉన్నత పోస్టులు సాధిస్తారు. సాంకేతిక నిపుణులు, రాజకీయవేత్తలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. క్రీడాకారులు, పరిశోధకుల ఆశయాలు నెరవేరే సమయం. 3,4 తేదీల్లో మానసిక ఆందోళన. కుటుంబంలో చికాకులు. గణేశాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. రాబడి గతం కంటే సంతృప్తినిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు సైతం మీకు అనుకూలంగా మారి చేయూతనిస్తారు. వాహన, కుటుంబసౌఖ్యం. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. బంధువులు, కుటుంబసభ్యుల సూచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగులకు మరింత అభివృద్ధి కనిపిస్తుంది, తమ ఆధిక్యతను చాటుకుంటారు. రాజకీయవేత్తలకు పదవీయోగం. కళాకారులు, రచయితలకు అన్ని విధాలా అనుకూలం. 5,6 తేదీల్లో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. శివారాధన మంచిది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం తగ్గి అప్పుల కోసం యత్నిస్తారు. కొన్ని సమస్యలు మీ సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తే కొంత సానుకూలమవుతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. కుటుంబబాధ్యతలు భారంగా మారి కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి సారించండి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారులకు కొంత నిరాశ తో పాటు ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు. రచయితలు, వైద్యులకు కొంత అనుకూల పరిస్థితి. కొంత అనుకూల ప్రభావం ఉంటుంది. 4,5 తేదీల్లో శుభవార్తలు, ఆకస్మిక ధనలబ్ధి. శ్రీరామస్తోత్రాలు పఠించండి
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. పట్టుదల, నేర్పుతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. ప్రముఖులు పరిచయం కాగలరు. దేవాలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందడం విశేషం. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 7, 8 తేదీల్లో ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు. శివస్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. విస్తరణయత్నాలు సానుకూలం. ఉద్యోగులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించి సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వైద్యులు, పరిశోధకులకు ఆహ్వానాలు. 2,3 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకర్షిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొద్దిపాటి రుగ్మతలు చికాకు పర్చినా చివరికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళాకారులకు నూతనోత్సాహం. క్రీడాకారులు, పరిశోధకులకు అవకాశాలు పెరుగుతాయి. 6,7 తేదీల్లో మానసిక వేదన, కుటుంబంలో ఒత్తిళ్లు. ఆదిత్యహృదయం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదించినా క్రమేపీ పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. అదనపు ఆదాయం సమకూరుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు తథ్యం. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. రచయితలు, పరిశోధకులకు నూతనోత్సాహం. 5,6 తేదీలలో అనారోగ్యం. స్నేహితులతో తగాదాలు. గణపతిని అర్చించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
వ్యవహారాలలో విజయం స్యాధించి సత్తా చాటుకుంటారు. పట్టుదలే అండగా ముందుకు సాగుతారు. సోదరులతో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. సేవాకార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తారు. వ్యాపారులకు ఎదురులేని పరిస్థితి నెలకొంటుంది. ఉద్యోగులకు ఊహించని ఆదరణ లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 7,8 తేదీల్లో చిక్కులు, వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. దుర్గామాతను పూజించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. శత్రువులు కూడా మీ సత్తా చూసి ఆశ్చర్యపోతారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. పలుకుబడి, హోదాలు కలిగిన వారు పరిచయమవుతారు. ఆశించిన ఆదాయం సమకూర్చుకుని అవసరాలు తీర్చుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండడమే కాకుండా పెట్టుబడులు సైతం సమకూరతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలు అనుకున్న ఆశయాలు సాధిస్తారు. క్రీడాకారులు, పరిశోధకులకు శుభవార్తలు. 3,4 తేదీల్లో మానసిక అశాంతి. అనారోగ్య సూచనలు. ఆంజనేయ దండకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆత్మీయులు, స్నేహితుల ఆప్యాయత చూరగొంటారు. సమాజంలో పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. రాబడి ఆశాజనకంగా ఉండి అప్పులు తీరే మార్గం కలుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. వాహన, గృహ యోగాలు కలుగుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు ఒత్తిళ్లు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలు, పరిశోధకులకు శుభవార్తలు. 6,7 తేదీల్లో బంధువిరోధాలు. మనశ్శాంతి లోపిస్తుంది. శ్రీనరసింహస్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. గతం నుండి ఎదురవుతున్న సమస్యలు క్రమేపీ తొలగుతాయి. అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారులకు మరింత అనుకూల సమయం. ఉద్యోగులకు ప్రమోషన్లు ఊరిస్తాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. రచయితలు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం. 7,8 తేదీల్లో మానసిక ఆందోళన. కుటుంబసమస్యలు. దత్తాత్రేయుని పూజించేండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రాబడి క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. బంధువుల తాకిడితో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులు•బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి మెప్పు పొందుతారు. పారిశ్రామికవేత్తలకు మరింత సంతోషకరంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారులకు అంచనాలు నిజం కాగలవు. 2,3 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. నవగ్రహస్తోత్రాలు పఠించండి.