సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సమాజసేవలో భాగస్వాములతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరతాయి. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారస్తులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. క్రీడాకారులు, రచయితలకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి. 31,1 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. ధననష్టం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. స్థిరాస్తుల వృద్ధి. కుటుంబానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు మరింత ప్రగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. పరిశోధకులు, కళాకారులకు ఊహించని అవకాశాలు. 26,27  తేదీల్లో  వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. గణేశాష్టకం పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబసభ్యుల చేయూతతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వాహన, గృహయోగాలు. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలను మార్చుకుంటారు. మనస్సులోని భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. వ్యాపారులు మరింత లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవేత్తలకు అనుకోని పదవీయోగం. కళాకారులు, రచయితలకు అనుకోని ఆహ్వానాలు రావచ్చు. 28,29  తేదీలలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. దూరపు బంధువుల ద్వారా ధనలాభం. యత్నకార్యసిద్ధి. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తండ్రి తరఫు వారితో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్నేహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వ్యాపారులు మరింతగా లాభాలు ఆర్జిస్తారు.  ఉద్యోగస్తులకు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, 29,30  తేదీలలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

కొత్త  ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. మీ ఆశయాలు నెరవేరే సమయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు అన్నింటా చేదోడుగా నిలుస్తారు. పలుకుబడి, హోదాలు కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు. పెట్టుబడులు అందే అవకాశం. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు తథ్యం. కళాకారులకు సన్మానాలు. రచయితలు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 27,28 తేదీల్లో బంధువులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. శారీరక రుగ్మతలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే. ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. బంధువులు, స్నేహితులతో ఇంటి విషయాలపై చర్చిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. శత్రువులు కూడా స్నేహితులుగా మారవచ్చు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వాహనయోగం. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు లభిస్తాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. ?రవీ• డాకారులు, రచయితలకు శుభవార్తలు.  28,29 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. అనారోగ్యం.  దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

యత్నకార్యసిద్ధి. కుటుంబసభ్యులు,స్నేహితుల నుంచి మాటసహాయం. అదనపు రాబడి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు.  విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు దక్కించుకుంటారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. రచయితలు, పరిశోధకులకు ఆహ్వానాలు. 30,31 తేదీల్లో ధననష్టం. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

కొత్త కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల రాకతో కుటుంబంలో సందడి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. భూ,గృహయోగాలు. అందర్నీ ఆశ్చర్యపరిచేలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల విధి నిర్వహణలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 31,1  తేదీలలో దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త ఆదాయమార్గాలు ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.  ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. అందరిలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. దేవాలయ దర్శనాలు. సంగీత,సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. గృహనిర్మాణ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో సజావుగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. పరిశోధకులు, రచయితలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 30,31 తేదీల్లో దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వృథా ఖర్చులు. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ఈవారం కొన్ని అద్భుతాలు ఎదురవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తికాగలవు. బంధువులు,స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. వాహనయోగం. ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులకు చిక్కులు తొలగుతాయి. నూతన భాగస్వాములు సైతం జతకడతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. రచయితలు, కళాకారులకు మరింత ఉత్సాహం. 26,27 తేదీల్లో  ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

నిరుద్యోగులు ఇంతకాలం చేసిన కృషి ఫలించే సమయం. కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అదనపు రాబడి దక్కుతుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరిచయాలు మరింత విస్తరిస్తాయి.  వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం,  కళాకారులకు పురస్కారాలు. క్రీడాకారులు, పరిశోధకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 29,30 తేదీల్లో అనుకోని ఖర్చులు. సోదరులతో వివాదాలు. ఆదిత్య హృదయం పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. తరచూ ప్రయాణాలు. ముఖ్య కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల కృషి కొంతమేర ఫలిస్తుంది. సన్నిహితులతో అకస్మాత్తుగా వివాదాలు. మీ నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి చికాకులు తప్పవు.  ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగస్తులకు మరిన్ని బాధ్యతలు. కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు, శ్రమ తప్పదు. 29,30 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. నూతన పరిచయాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE