ఇతర మతాలు, దేశాల నుండి సిబ్బందిని నియమించుకునే కంపెనీలు ‘క్రైస్తవానికి వ్యతిరేకం’ అని జేడీ వాన్స్ ‌చెప్పడం అవాంఛనీయం. అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్‌ఏ) ఇటీవలి చరిత్రలో మొదటిసారిగా, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు పెట్టడం, సిబ్బంది నియామ కాలకు విశ్వాసం, మతంతో ముడిపెట్టడం జరిగింది. అమెరికా వైవిధ్యమైన సంస్కృతిని విలువైనదిగా భావించడం ఆ దేశ ప్రాథమిక నైతికతకు లేదా సిద్ధాంతాలకు విరుద్ధం కాకపోవచ్చు.కానీ ఒక ‘క్రైస్తవ దేశం’గా, అమెరికన్‌ ‌కంపెనీలు, వ్యాపారాలు మూడవ ప్రపంచ దేశాల నుండి తక్కువ జీతాలకు ప్రతిభావంతులైన వ్యక్తులను నియమించడం గురించి పునరాలోచించవలసి ఉంటుందని సూచించడం అవాంఛనీయం.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అమెరికాను ‘‘క్రైస్తవ దేశం’’గా అభివర్ణించారు. ఇతర దేశాల నుంచి చౌకగా లభించే కార్మికుల నుంచి అమెరికన్‌ ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. టర్నింగ్‌ ‌పాయింట్‌  ‌నిర్వహించిన అమెరికా ఫస్ట్ ‌కాన్ఫరెన్స్-2025‌లో మాట్లాడుతూ, పోటీతత్వ పరంగా ఇతర మతాలకు చెందిన వ్యక్తులను నియమించడం ‘నిజమైన క్రైస్తవ రాజకీయాల్లో’ భాగం కాదని వాన్స్ ‌వాదించారు. అలా మాట్లాడుతున్న వాన్స్‌కి వాస్తవిక పరిస్థితిని చూపించాల్సి ఉంటుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌లేదా ఆయన ఉపాధ్యక్షుడు తీసుకున్న ‘అమెరికా ఫస్ట్’ ‌విధానం పట్ల ఎక్కువ మందికి ఎలాంటి అభ్యంతరాలు లేవు.కానీ నియామకం, ఉపాధి, వ్యాపారాలను నిర్వహించడం వంటి వాటికి మతపరమైన లేదా విశ్వాస సంబంధిత విషయాలతో ముడిపెట్టడం సమర్థనీయం కాదు.

2028లో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలనే ఆసక్తితో ఉన్న వాన్స్ అనే రిపబ్లికన్‌ ‌సైద్ధాంతికంగా అతిక్రమణకు పాల్పడుతూ మతత త్వంతో, రాజకీయంగా ఊగిసలాడుతున్న అజెండాను అనుసరించి ఉండవచ్చు. నేడు వివిధ తెగలకు చెందిన క్రైస్తవులు అమెరికా మెజారిటీ రాజకీయాలను శాసిస్తున్నారు. అమెరికా కూడా రెడ్‌ ఇం‌డియన్ల సమాధులను పునాదులుగా చేసుకొని తన అస్తిత్వాన్ని నిర్మించుకుంది. ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థలో, వ్యాపారాలను నిర్వహించడంలోనూ, సిబ్బంది నియామకంలోనూ అభర్థుల విద్యార్హతలు, వారు పొందిన శిక్షణ, వారి ప్రతిభ, విలువ జోడింపు, వారి పనితీరు, వారికి అయ్యే ఖర్చులు ఒక ప్రాతిపదికగా ఉంటాయి. జేడీ వాన్స్ ‌వ్యాఖ్యలను అమెరికాలోని వ్యాపారాలు, పరిశ్రమలు అంత తీవ్రమైనవిగా పరిగణించకపోవచ్చు. వారి సిబ్బందిలో అత్యధికంగా ఉన్న క్రైస్తవేతరులను, వాన్స్ ‌ప్రత్యేక రాజకీయ అజెండాకు మద్దతు ఇవ్వని వారిని  తొలగించడానికి ముందుకు రాకపోవచ్చు. వాన్స్ ‌సూచించినట్లుగా కంపెనీలు టాలెంట్‌ ‌వేటలో తమ ఎంపికను అమెరికన్‌ ‌క్రైస్తవులకు పరిమితం చేస్తే, నాస్తికులు, భౌతిక వాదులు, ఇతర మైనారిటీల పరిస్థితి ఏమిటి?

వాన్స్ ‌వ్యాఖ్యలు 162 మిలియన్ల ప్రొటెస్టంట్‌ ‌క్రైస్తవులకు మద్దతు ఇస్తున్నప్పటికీ, కాథలిక్కులు ఏమీ నీరుగారిపోవడంలేదు. కానీ ప్రతిభతో సంబంధం లేకుండా, ఆర్థిక విలువ పరంగా వారి సహకారంతో సంబంధం లేకుండా దేశంలో ఉన్న క్రైస్తవేతరులను, విదేశాల నుంచి వచ్చే క్రైస్తవేతరులను తిరస్కరించడమ నేది ఎక్కువ కాలం నిలబడదు. అది తాత్కాలికంగా మాత్రమే పనికి వస్తుంది.

ఉద్యోగాల కోసం, అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థకు విలువైన సహకారాన్ని అందించడానికి వస్తున్న వారి పట్ల జేడీ వాన్స్ ‌వివక్ష చూపిస్తున్నారా? వాన్స్‌కు వివిధ దేశాల విద్యార్థులు, నిపుణుల కారణంగానే అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలు నడుస్తున్న విషయం అర్థం కావడంలేదా? వాన్స్ ‌క్రైస్తవ, ‘ఇతరుల’ రాజకీయ ప్రచారాలకు ఒక దుర్మార్గమైన రోడ్‌ ‌మ్యాప్‌ ‌వేస్తున్నారా?

అమెరికన్‌ ‌సాంస్కృతిక, నాగరిక పరిణామం, శ్రామికుల మూలాలు లేదా వారు ఇంటికి తీసుకువెళ్ళే జీతభత్యాలకు అతీతంగా అమెరికాను ఒక ‘అత్యంత విలువైన శ్రామికులతో కూడిన దేశం’గా మార్చడానికి దోహదపడింది. యూదులు, హిందువులు, బౌద్ధులు, జైనులు వంటి మతపరమైన మైనారిటీలు దేశాభివృద్ధికి అందిస్తున్న సహకారం వాన్స్ ‌కంటికి ఆనదా?

జార్జ్ ‌వాషింగ్టన్‌ ‌కాలం నుండి, ప్రభుత్వ వ్యవహారాల్లో మతపరమైన జోక్యానికి భారీ ప్రతిఘటన ఉన్నప్పటికీ, అమెరికాను పాలించడంలో చర్చికి పెద్ద పాత్ర ఉంది. ఇప్పుడు, దానిని ప్రైవేట్‌ ‌రంగానికి విస్తరించడం అనేది వాన్స్ ‌చేస్తున్న  ప్రతిపాదన. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభను ఉదారంగా వాడుకుంటూ, వాటి ఉనికిని నిలబెట్టు కుంటున్న అమెరికన్‌ ‌వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిభావంతులైన శ్రామికులు తగినంతగా లభ్యం కాకపోవడం లేదా వారి సంఖ్య పరిమితమైన పక్షంలో అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పారిశ్రామిక, సేవల రంగాలలో అధిక విలువ ఆధారిత వరుసలలో అంతరాలకు దారితీస్తుంది. అందువల్ల, అనేక మంది విశ్లేషకులు అమెరికాను దేశ రాజ్యాంగం పరిపాలిస్తుందా లేక మతపెద్దలు పరిపాలిస్తారా? హక్కుల బిల్లుపై ‘టెన్‌ ‌కమాండ్‌మెంట్స్’ ‌పైచేయి సాధిస్తాయా? అనే ప్రశ్నలు లేవనెత్తారు. ట్రంప్‌ ‌ప్రభుత్వానికి చెందిన అనేక మంది విధాన నిర్ణేతలు జేడీ వాన్స్ ‌ప్రతిపాదిం చిన క్రైస్తవ దేశం చైనాతో పోటీ పడటానికి అవసర మైన అత్యంత ప్రతిభావంతులైనవారిని ఉద్యోగులుగా నియమించు కోవడానికి అనుమతించకపోవచ్చని భావిస్తున్నారు. ప్రత్యేకమైన లేదా నిర్బంధ విధానాలు ఇతర మతాలకు చెందినవారికి అవకాశాలను పరిమితం చేయడమే కాకుండా, అగశ్రేణి సాంకేతిక దిగ్గజాలను వాటి పెట్టుబడులను మరింత పోటీ తత్వంతో కూడుకున్న, సౌకర్యవంతమైన బహిరంగ మార్కెట్లకు మళ్లించడానికి దారి తీస్తుంది.

 కె.ఎ.బదరీనాథ్‌

 ‌డైరెక్టర్‌ & ‌చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌,

‌సెంటర్‌ ‌ఫర్‌ ఇం‌టిగ్రేటెడ్‌ అం‌డ్‌

 ‌హోలిస్టిక్‌ ‌స్టడీస్‌, ‌న్యూఢిల్లీ.

About Author

By editor

Twitter
YOUTUBE