సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

‌ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రావచ్చు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. వాహన యోగం. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రచయితలు, పరిశోధకులకు తగినంత గుర్తింపు లభిస్తుంది. 28,29 తేదీల్లో స్నేహితులతో విభేదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. పాత విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సంద ర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. కళాకారులకు ఊహించని విధంగా అవకాశాలు దక్కుతాయి. 29,30 తేదీల్లో దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలలో కదలికలు. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకుం టారు. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగ మిస్తారు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమా చారం. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహకరం. 30,31తేదీల్లో ఆకస్మికప్రయాణాలు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

బంధువులతో విభేదాలు నెలకొంటాయి. స్థిరాస్తి ఒప్పందాలను వాయిదా వేస్తారు. గృహ నిర్మా ణాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలకు చికాకులు తప్పవు. రచయితలు, పరిశోధకులకు ఊహించని పిలుపు రావచ్చు. 31, 1 తేదీల్లో విందువినోదాలు. కార్య జయం. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

రాబడి మెరుగుపడుతుంది. మీ ఊహలు, అంచనాలు నిజమవుతాయి. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. బంధువులతో సత్సం బంధాలు నెలకొంటాయి. వ్యాపారులు పెట్టుబడులు పెంచుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులు, క్రీడాకారులకు నూత నోత్సాహం. 2,3 తేదీల్లో వృథాఖర్చులు. ఆకస్మిక దూరప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి.  ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు తొలగు తాయి. వ్యాపారులు మరింతగా లాభపడతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు కొన్ని మార్పులు జరిగి ఉత్సా హంగా గడుపుతారు. కళాకారుల శ్రమ ఫలిస్తుంది. 28,29 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. పరిస్తితులు అనుకూలిం చవు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు. కళాకారులు, రచయితలకు నూతన అవకాశాలు. 30,31తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

అవసరాలకు ఏ మాత్రం లోటు లేకుండా గడిచి పోతుంది. సమాజసేవలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత ఉత్సాహంగా ముందడుగు. వ్యాపారులకు మెరుగైన లాభాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు తగ్గవచ్చు. రాజకీయ వేత్తలకు అన్నింటా విజయమే. కళాకారులు, క్రీడా కారులు మరిన్ని అవకాశాలు. 29,30 తేదీల్లో ఖర్చులు,ఆప్తులతో తగాదాలు. శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయ, వ్యయాలు సమానస్థాయిలో కొనసాగు తాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం. పరిచయాలు మరింత పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. పారిశ్రామిక వేత్తలకు అంచనాలు నిజం కాగలవు. కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 29, 30 తేదీల్లో దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కాలభైరవాష్టకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వాహన సౌఖ్యం. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమా చారం. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. రాజకీయ వేత్తలకు ప్రోత్సాహకరమైన కాలం. క్రీడాకారులు, పరిశోధకులకు అప్రయత్నంగా అవకాశాలు. 30,31 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో విభేదాలు. సూర్యారాధన చేయండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి. సన్నిహితులతో కష్టసుఖాలు విచారిస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. వ్యాపారులకు భాగస్వాములు మరింత సహకరిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ప్రోత్సాహం, సహకారం. కళా కారులకు నూతన అవకాశాలు. 31,1తేదీల్లో బంధువులతో విభేదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. ప్రత్యర్థులు సహాయపడడం విశేషం. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహ కరంగా ఉంటుంది. కళాకారులకు నూతనోత్సాహం. రచయితలు, పరిశోధకులకు పురస్కారాలు అందు తాయి. 2,3 తేదీల్లో మానసిక అశాంతి. శారీరక రుగ్మతలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE