– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు.  వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారులకు సాదా సీదాగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తల యత్నాలు నత్త నడకన సాగుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. 25,26 తేదీలలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. విష్ణుసహస్ర నామ పారాయణ చేయండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శన ఇంటి నిర్మాణయత్నాలు అనుకూ లిస్తాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూలత. రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు రావచ్చు. రచయితలు, వైద్యులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. 28,29 తేదీల్లో అనారోగ్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

స్తిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు సమస్యల సుడి నుండి బయటపడతారు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు దక్కుతాయి. క్రీడాకారులు, పరిశోధ కులకు ఉత్సాహం పెరుగుతుంది. 23,24 తేదీల్లో మానసిక ఆందోళన. దేవీస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతం. కుటుంబంలో శుభకార్యాలపై సంప్రదిస్తారు. ఆలోచనలు కార్యరూపం•. పుణ్య క్షేత్రాలు సందర్శి స్తారు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉం టాయి. ఉద్యోగులకు చిక్కులు వీడి ప్రగతి కనిపిస్తుంది. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. రచయితలు, క్రీడాకారులకు అంచనాలు నిజమవుతాయి. 27,28 తేదీల్లో ఖర్చులు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిం చండి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

రాబడి మెరుగ్గా ఉంటుంది. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి చేయూతనిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు. పుణ్యక్షేత్రాలు సందర్శన. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, క్రీడాకారులకు అనుకూల పరిస్థితులు. 26,27 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతాయి. ఇళ్లు, వాహనాలు కొంటారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార సంస్థలు విస్తరిస్తారు. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవర్గాలకు సానుకూల సమయం. 28,29 తేదీలలో ఖర్చులు అధికం. కుటుంబంలో ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

సమాజంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగుల బాధ్యతలు పెరిగినా సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. రచయితలు, క్రీడాకారులు స్వీయానుభవాలతో గుర్తింపు పొందుతారు. 24,25 తేదీలలో ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. దూర ప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ ఊహలు నిజం కాగలవు. అనుకున్న కార్యక్రమాలలో విజయం. వ్యాపారులకు లాభసాటి ఉద్యోగులకు ఉన్నతాధికారుల తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు విదేశీ పర్యటనలు జరుపుతారు. వైద్యులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 25,26 తేదీల్లో అనుకోని ఖర్చులు. స్నేహితులతో కలహాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహం• ఉంటుంది. ఉద్యోగులకు నూత నోత్సాహం. విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. కళా కారులకు నూతన అవకాశాలు.27,28 తేదీల్లో వృథా ఖర్చులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురి స్తాయి. కుటుంబ సభ్యుల మెప్పును పొందే నిర్ణయాలు. వ్యాపారులకు చికాకులు తొలగి ఊరట. ఉద్యోగులకు సంతోషకర సమాచారం. కళాకారులకు ఊహించని అవకాశాలు. క్రీడాకారులు, వైద్యులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. 24,25 తేదీల్లో ఇంట్లో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. గణేశాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

బంధువులతో వివాదాలు తీరి ఊరట చెందు తారు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలకు విజయాలు. కళా కారులు, రచయితల కృషి ఫలిస్తుంది. 23,24 తేదీల్లో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. దూర ప్రయాణాలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు విస్తరణలో ముందడుగు పడుతుంది. ఉద్యోగులకు శ్రమ ఫలించి మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. పరిశోధకులు, సాంకేతిక నిపుణుల ఆశలు నెరవేరతాయి. 26,27 తేదీల్లో కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE