– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

పలుకుబడి, హోదాలు కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయం ఆశాజనకం. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సఫలం. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు. 30,1 తేదీలలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు. ఆదాయం గతంకంటే మెరుగు.  సన్నిహితులు సహాయసహకారాలు అంది స్తారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 2,3 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు విజయ వంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కొత్త కాంట్రాక్టులు. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి స్నేహి తులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు గందరగోళం తొలగుతుంది. 3,4 తేదీల్లో దుబారా వ్యయం. శివాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

సన్నిహితులతో విభేదాలు నెలకొనే అవకాశం. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బందికరం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ఆచితూచి ముందుకు సాగాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. పారిశ్రామికవేత్తలు, రచయితలు, క్రీడాకారులకు విదేశీపర్యటనలు వాయిదా. 4,5తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. కొన్ని సమస్యలు తీరి ఊరట. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులకు విధుల్లో అవాంత రాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితల యత్నాలు సఫలం. 5,6 తేదీల్లో వ్యయ ప్రయాసలు. ఆంజనేయ దండకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వివాహయత్నాలు కలసివస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేసేవీలుంది. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు శుభవార్తలు. 1,2 తేదీల్లో బంధు విరోధాలు. ఆరోగ్య సమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ముఖ్య కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించ వచ్చు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వ్యాపారు లకు క్రమేపీ లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో మరింత అనుకూలస్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి. 3,4 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఆదిత్య హృదయం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

బంధుమిత్రులతో మరింత సఖ్యత నెలకొం టుంది. ఓర్పుతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారులు లాభాలు అందు కుంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు దక్కే అవ కాశం. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు లక్ష్యాలు నెరవేరే సమయం. 5,6 తేదీల్లో ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందు తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు విదేశీ ఛాన్స్ ఉం‌డవచ్చు. వ్యాపారులు మరింత లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఊరట. రాజకీయ వేత్తలు, కళాకారులు, రచయితలకు మరింత ప్రగతి ఉంటుంది. 30,1 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

సమాజంలో విశేష గౌరవం పొందుతారు. ఆశించినంత ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వేత్తలు, కళా కారులు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 1,2 తేదీల్లో మానసిక ఆందోళన. గాయత్రీ ధ్యానం చేయండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులు అవకాశాలు. వ్యాపారులకు పెట్టుబడులు ఊరట నిస్తాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరి శోధకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 3,4 తేదీల్లో ఖర్చులు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగస్తులకు విధి నిర్వ హణలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఊహించని అభివృద్ధి. 4,5 తేదీల్లో శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE