– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్
భారత్‌ను అస్థిరపరచడానికి ఉగ్రవాదులు, ముస్లిం మతోన్మాదులు అనుసరించని మార్గం లేదు. ఆ దిశలో ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకున్న సంగతి బయటపడిరది. సరిహద్దులో సైనికులపై దాడులు, వివిధ ప్రాంతాల్లో బాంబులు పెట్టి మారణకాండను సృష్టించడం వరకూ చూశాం. ఇప్పుడు రైళ్లను పడగొట్టేందుకు పథకం ప్రకారం కుట్రలు ప్రారంభించారు. పలుచోట్ల పట్టాలపై కనిపించిన వస్తువులు కలకలం రేపాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తంతో భారీ ప్రమాదాలు తప్పాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఈ ‘రైల్ జిహాద్’ మొదలు పెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో ఫర్హతుల్లా ఘోరీ అనే ఉగ్రవాది ప్రమేయం బయటపడిరది.
మతం పేరుతో ఉగ్రవాదానికి పాల్పడుతున్న ఈ ముఠాల అమానుష చర్యలు కొన్ని. ఇందులో ఎక్కువ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంగతి గుర్తించాలి.
– ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్- భీంసేన్ మధ్య సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 20 బోగీలు వేరుపడ్డాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక బండరాయిని రైలు ఢీ కొనడంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చిందని సిబ్బంది తెలిపారు.
– ఆగస్ట్ 22వ తేదీన ఉత్తరప్రదేశ్ అలీగఢ్ సమీపంలోని తలాస్‌పూర్ రైల్వే ట్రాక్‌పై అల్లాయ్ వీల్ కనిపించింది. రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి వెళ్లి తొలగించారు. అఫ్సాన్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశాడని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
– ఆగస్టు 23వ తేదీ రాత్రి ఉత్తరప్రదేశ్‌లోనే కాస్‌గంజ్-ఫరూఖాబాద్ మధ్య నడిచే ఫరూఖాబాద్ ఎక్స్‌ప్రెస్ వెళ్లే ట్రాక్‌పై ఎవరో చెక్క దుంగను పెట్టారు. దాన్ని తాకిన రైలు అకస్మాత్తుగా కుదుపులకు గురైంది. లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపేశాడు. తరువాత దుంగను తొలగించి ట్రాక్‌ను క్లియర్ చేశారు.
– ఆగస్టు 26వ తేదీ రాత్రి రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో జోధ్‌పూర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రైల్వే ట్రాక్‌పై ఉద్దేశపూర్వకంగా అమర్చిన సిమెంట్ దిమ్మెను ఢీకొని ఆగిపోయింది. అదృష్టవశాత్తు అంతకుమించి ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో 375 మంది ప్రయాణికులకు ముప్పు తప్పింది. రైలు బాగానే ఉండటంతో కొద్ది సేపటి తర్వాత గమ్యస్థానానికి బయలు దేరింది.
– ఆగస్టు 29వ తేదీ రాత్రి రాజస్థాన్ బరన్ జిల్లాలో కోటా-బినా రైల్వే ట్రాక్‌పై ఎవరో పాత మోటర్ సైకిల్‌ని పడేసి మట్టితో కప్పారు. ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలు పైలట్ వినోద్ మీనా దీన్ని చూసి వెంటనే అప్రమత్తమయ్యాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ముప్పు తప్పిపోయింది.
– ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్‌లోని చందన్‌నగర్-హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌ల మధ్య ట్రాక్‌పై ఇనుప రాడ్ అమర్చారు. రైలు 10 నిమిషాలు ఆలస్యం కావడంతో పెనుముప్పు తప్పింది. ఈలోగా రాడ్‌ను గుర్తించి తొలగించారు.
– సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి హర్యానాలోని భివానీకి పరుగులు పెడుతోంది కాళింది ఎక్స్‌ప్రెస్. కాన్పూర్ సమీపంలోనొ అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ మార్గంలో రైలు వెళుతుండగా పట్టాల మీద అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు లోకోమోటివ్ పైలట్ గుర్తించి వెంటనే బ్రేక్‌లు వేశాడు. అయితే రైలు ఆగిపోయే లోపే సిలిండర్‌ను ఢీకొట్టింది.దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడిరది. ఎలాంటి నష్టం జరగలేదు.
– సెప్టెంబర్ 10వ తేదీన రాజస్థాన్‌లోని అజ్మీర్ సమీపంలో శారధ్నా, బంగాడ్ స్టేషన్ల మధ్య పూలేరా – అహ్మదాబాద్ రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను ఉంచారు. వేగంగా వెళుతున్న రైలు దిమ్మెను ఢీ కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. దిమ్మె రెండు ముక్కులు కావడంతో పాటు, రైలు ఇంజిన్‌తోపాటు కొంత భాగం దెబ్బతిన్నది. అదృష్టవశాత్తు అంతకు మించి ఏమీ జరగలేదు
– సెప్టెంబర్ 4న జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా కుర్దువాడి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై పెద్ద బండరాయిని పెట్టారు. లోకోపైలట్ 200 మీటర్ల దూరంలోనే దీన్ని గమనించి అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ గార్డులు సంఘటనా స్థలానికి వచ్చి ఈ రాయిని తొలగించారు.
– ఆగస్టు 1న గుల్జార్ షేక్‌గా అనే యూట్యూబర్ రైలు పట్టాలపై సైకిళ్లు, సబ్బులు, రాళ్లు, సిలిండర్‌లతో సహా పలు వస్తువులను పెట్టి వీడియో తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు.ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించి షేక్‌ను అరెస్టు చేశారు.
పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి, రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఈ వరుస ఘటనలు చూస్తే ఏమనిపిస్తోంది? వీటిని కుట్రతో కూడిన విధ్వంసక ఆలోచనగా మాత్రమే చెప్పగలం. ఆ వస్తువులు యాదృచ్ఛికంగా వచ్చాయని ఎవరైనా అనుకుంటే వారిది అమాయకత్వం అనలేం. వారిని కూడా అనుమానించక తప్పదు. ప్రధాని మోదీ వందే భారత్ రైళ్లను ప్రారంభించినప్పుడు దేశంలోని పలు చోట్ల ఆ రైళ్ల మీద రాళ్లు విసిరిన ఘటనలు జరిగాయి. వారిని ప్రేరేపించినవారు ఎవరు అనే బహిరంగ రహస్యమే.
నెల రోజుల్లో 18 ఘటనలు
ప్రపంచంలోని అతి పెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వేకి ప్రముఖ స్థానం ఉంది. రైలు ప్రయాణం భద్రంగా, సురక్షితంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజు లక్షల సంఖ్యల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాలు చేయడానికే ఇష్టపడతారు. కానీ ఇటీవలి ప్రమాదాలు చూస్తుంటే రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ కుట్రపూరిత యత్నాలు ఇటీవల కాలంలో పెరిగాయని భారత రైల్వే ఆందోళన వ్యక్తంచేసింది.
సాంకేతిక లోపాలు, సిగ్నల్స్ తప్పిదాలు కొన్ని అయితే సంఘ విద్రోహులు, ఉగ్రవాదుల చర్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమైపోతోంది. నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు కుట్రలను భగ్నం చేస్తున్నా ఎక్కడో అక్కడ పొరపాటు జరిగి వేల సంఖ్యల్లో ప్రయాణికులు చనిపోతున్నారు. ఈ ఆగస్టు నుంచి ఈ తరహాలో 18 ఘటనలు వెలుగుచూశాయనీ, గత ఏడాది జూన్ నుంచి 24 ఘటనలు జరిగాయని రైల్వే నివేదిక వెల్లడిరచింది. అందులో ఆగస్టులో 15, సెప్టెంబర్‌లో ఇప్పటివరకు మూడుసార్లు ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. ఇవి ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోనే వెలుగు చూశాయి. ఆ తర్వాత పంజాబ్, రaార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణలో బయటపడ్డాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై కుట్ర
మన దేశ ఆర్థిక వ్యవస్ధలో రైల్వే కూడా అత్యంత కీలకం. కానీ ప్రమాదాల భయంతో రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది. బీమారంగంపై భారం పెరుగు తుంది. అత్యధిక లాభాలు ఆర్జించే రైల్వే వ్యవస్థను కుప్పకూల్చే కుట్ర ఈ ఘటనల వెనుక కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, ప్రజలు ఆత్మ విశ్వాసం కోల్పోయేలా చేయడం, ప్రభుత్వాన్ని బలహీన పరచాలనే కుట్ర కోణం ఇందులో ఉన్నాయి. మోదీ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేసే అవసరం ఎవరికి ఉంది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభ మైంది. ఇలాంటి పైశాచిక చర్యల వల్ల రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురి కావడం వందల సంఖ్యల్లో మరణాలు, కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లుతుంది. ఈ కుట్రలో పిల్లలను ఉపయోగించుకుంచుకుంటు న్నారు. ఇవన్నీ ఆకతాయి చేష్టలని, వారు అమాయకులని నమ్మించడం సులువు. ఏవైనా కేసులు నమోదైతే బాలల హక్కులకు ముప్పు ఏర్పడిరదని గగ్గోలు పెట్టేందుకు మన దేశంలో హక్కులు, మానవతావాద సంఘాలు ఎన్నో ఉన్నాయి.
ఇది రైల్ జిహాద్
అవతలి మతాలను దెబ్బతీయడానికి ఉన్మాదులు జరిపే చర్య జిహాద్. లవ్ జిహాద్, భూ జిహాద్ విన్నాం. ఇప్పుడు రైల్ జిహాద్. 2018 నుంచి ఏటా కనీసం 40 దాకా చిన్నాపెద్దా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ నెలా కనీసం మూడు చోట్ల రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. కేంద్రంలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక గత పదేళ్లలో ఏకంగా దాదాపు 700 ట్రెయిన్ యాక్సిడెంట్లు జరిగాయి. ఇటీవల రెండు నెలల సమయంలో రైలు ప్రమాదాల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
2017లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రెండు ఘోర ప్రమాదాల్లో 150 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదాల వెనుక పాకిస్తాన్ ఐఎస్‌ఐ ప్రమేయం ఉన్నట్టు అప్పట్లో అనుమానాలొచ్చాయి. ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేశారు బిహార్ పోలీసులు. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్‌లో పట్టాలపై కుట్ర చేసి.. రైలు ప్రమాదాల్ని సృష్టించి.. ఆ విధంగా మోదీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పక తప్పదు. తాజాగా కాన్పూర్ ఘటనను పరిశీలిస్తే ఈ ఘటన వెనుక జమాత్-ఏ- ఇస్లామీ హస్తమున్నట్టు యూపీ పోలీసులు సందేహిస్తున్నారు.
ఎవరీ ఫర్హతుల్లా ఘోరీ?
అనుమానించినట్లుగానే కుట్రకోణం అప్పుడే వెలుగులోకి వచ్చింది. రైల్ జిహాద్ వెనుక ఉన్నది ఫర్హతుల్లా ఘోరి. ఇతడు పాకిస్తాన్‌లో ఉంటూ భారత్‌లోని స్లీపర్ సెల్స్ ద్వారా కుట్రలను అమలు చేస్తున్నాడని భారత ప్రభుత్వం గుర్తించింది. ఫర్హతుల్లా ఘోరి ఓ వీడియోలో రైలు ప్రమాదాలను అమలు చేయడం ఎలాగో వివరించి, భారత్‌లోని అనుయా యులకు పంపించాడు. రైల్వే లైన్లతో పాటు, పెట్రోలు లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం. హిందూ నాయకులను హత మార్చడం ఈ పథకంలో భాగాలు. ప్రెషర్ కుక్కర్‌ల వంటి గృహోపకరణాలను ఉపయోగించి బాంబులను ఎలా సృష్టించాలో కూడా వివరిస్తూ వీడియోలు చేశాడు ఘోరీ. 2002లో అక్షరధామ్ ఆలయంపై దాడి వెనుక ఫర్హతుల్లా ఉన్నాడు. ఈ ఏడాది బెంగళూర్ లోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ళ వెనుక ఇతని పాత్రను ఎన్‌ఐఏ గుర్తించింది. 2004లో హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కూడా ఫర్హతుల్లా ఘోరీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు
ఈ జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట రోజునే బెంగళూరులో బీజేపీ ఆఫీసు ముందు మోటారు సైకిల్ బాంబుపేల్చేందుకు కుట్ర పన్నాడు ఘోరీ. అది విఫలమైంది. ఆ రోజున జరగరాని ఘటన జరిగితే మన మీడియాకు అయోధ్య రామాలయం కన్నా ఇదే పెద్ద వార్త అయ్యేది.
ఫర్హతుల్లా ఘోరీని తయారు చేసింది పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఇతడు ‘ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్-ఐఎస్‌కేపీ’ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆఫ్గన్ నుంచి భారత్ వరకూ ఉండే భూమినే ఖొరాసన్ స్టేట్ అంటారు జిహాదీలు. ఇస్లామిక్ శక్తుల అంతిమ పోరాటం ఇక్కడే.. దీనికి గజ్వాయే హింద్ అనే పేరు పెట్టుకున్నారు. గోద్రా లాంటి ఘటనలతో దేశంలో అలజడి సృష్టించాలనే కుట్రను అమలు చేస్తున్నారు. ఫర్హతుల్లా తమ దేశంలో లేడని పాకిస్తాన్ బుకాయిస్తోంది. ఇతనికి హైదరా బాద్‌తో కూడా సంబంధాలున్నాయని తెలుస్తోంది.
రంగంలోకి ఎన్‌ఐఏ
వరుసగా రైలు ప్రమాద కుట్రలు బయటపడు తుండడంతో రైల్వే శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నది. రైళ్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడిరచారు. ప్రతి ఇంజన్‌కు ముందు, వెనుక, గార్డు కోచ్‌కు కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు, రైల్వే ట్రాక్‌ల వద్ద మిగిలి పోయిన ఇంజినీరింగ్ పరికరాలు, మెటీరియల్‌ను తక్షణమే తొలగించాలని రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్ల అధికారులను ఆదేశించింది.